
కొంతమంది ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికి ఎలాంటి బేషజాలకు పోకుండా సాదాసీదాగా ఉంటారు. ఇంకొంతమంది మాత్రం తమ అధికారాన్ని కొద్దిపాటి హోదాని చూసుకుని కన్నుమిన్ను గానకుండా ప్రవర్తిస్తారు. అచ్చం అలాంటి ఘటన గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కాబట్టి..
మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఒక వ్యక్తి తన మోటారు సైకిల్‌ని రివర్స్ చేస్తున్నప్పుడు.. అక్కడే ఉన్న ఒక మహిళా పోలీసు ప్యాంట్ పై బురద పడింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ పోలీస్.. తన ప్యాంట్‌ని శుభ్రం చేయమని ఆ వ్యక్తి బలవంతం చేసింది. గత్యంతరం లేక ఆ వ్యక్తి ఆమె ప్యాంటును శుభ్రం చేశాడు. అయినా ఆ అధికారిణి శాంతించలేదు.
ఆ వ్యక్తిని ఒక చెంపదెబ్బ కొట్టి వెళ్లిపోయింది. వీడియో వైరల్ కావడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. సదరు మహిళ ఖాకీ.. కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే హెంగార్డు శశికళగా గుర్తించారు. ఈ ఘటనపై రేవా ఎస్పీ శివ కుమార్ మాట్లాడుతూ..."ఆ వీడియో తమదాకా వచ్చిందని, ఫిర్యాదు అందితే శశికళపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు.
मध्य प्रदेश के रीवा में एक महिला पुलिसकर्मी ने सिरमौर चौक के पास पहले युवक से पैंट साफ कराई. फिर उसे जोरदार थप्पड़ जड़ दिया. बाइक हटाते हुए महिला पुलिसकर्मी के पैंट में कीचड़ लग गया था @ndtv @ndtvindia @DGP_MP @drnarottammisra pic.twitter.com/m0hdSJ2mrZ
— Anurag Dwary (@Anurag_Dwary) January 12, 2022
చదవండి: ఒమిక్రాన్ ఉధృతిని ఆపలేం.. బూస్టర్‌తో ప్రయోజనం ఉండకపోవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment