
మైసూరు: కర్నాటకలోని మైసూరు నగరంలో సహాయ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గోపీనాథ్ కుమార్తె గిరిజా లక్ష్మీ (19) ఆత్మహత్య చేసుకుంది. జలపురి పోలీసు వసతి గృహంలోని సీ బ్లాక్‌లో ఉంటున్న ఇంటిలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది.
కాగా, బయటకు వెళ్లి వచ్చిన కుటుంబ సభ్యులు ఇంటికి రాగా గిరిజ ఉరికి వేలాడుతూ కనిపించింది. ఇక, బీకాం చదువుతున్న గిరిజా ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. నజరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐదు రోజుల క్రితమే గిరిజా అన్న అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ బాధే ఆత్మహత్యకు కారణమని అనుమానాలున్నాయి.