నా చావుకు సీఐ కారణం | woman asi attempts suicide | Sakshi
Sakshi News home page

నా చావుకు సీఐ కారణం

Published Wed, Aug 23 2017 10:59 AM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM

నా చావుకు సీఐ కారణం - Sakshi

నా చావుకు సీఐ కారణం

► లేఖ రాసి మహిళా ఏఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం
బనశంకరి(కర్ణాటక): సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వేధింపులు తట్టుకోలేక మహిళా ఏఎస్‌ఐ లేఖరాసి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన హవేరిజిల్లా హిరేకరూరు పట్టణంలో మంగళవారం జరిగింది. హంసభావి పోలీస్‌స్టేషన్‌లో ఎం.ఏ అసాది మహిళా ఏఎస్‌ఐ. హిరేకరూరుపట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ సంగనాద జీఆర్‌. పట్టణంలో జరిగిన రైతుల ధర్నాకు ఏఎస్‌ఐ అసాది బందోబస్తుకు వచ్చారు.

ఆమె డ్యూటీ పత్రాలు లేకుండా రావడంతో సీఐ సంగనాద ఆమెను నాటకాలు ఆడటానికి వచ్చావా, షాపింగ్‌ చేయడానికి వచ్చావా అని హేళన చేస్తూ వేధింపులకు దిగాడు. దీంతో ఆవేదన చెందిన అసాది తన చావుకు సీఐ కారణమని డెత్‌నోట్‌ రాసిపెట్టి నిద్రమాత్రలు మింగింది. తీవ్ర అస్వస్ధతకు గురైన బాధితురాలిని దావణగెరెలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement