
చిన్నారులు ప్రణతి, శివకుమార్ (ఫైల్)
సాక్షి, రాయచూరు(కర్ణాటక): మూర్ఖపు తండ్రి అనాలోచిత నిర్ణయానికి ఇద్దరు పసికందుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కలబురగి జిల్లా కమలాపుర తాలూకా గబ్బూరవాడి గ్రామంలో శరణప్ప అనే దివ్యాంగుడు పాన్ బీడా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈయనకు కుమార్తె ప్రణతి(5), కుమారుడు శివకుమార్(3) ఉన్నారు. కొంతకాలంగా వ్యాపారం సరిగా జరగడం లేదు. కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు.
సోమవారం సాయంత్రం గ్రామంలోని అనంత లింగేశ్వర దేవాలయ బావిలోకి పిల్లలతో కలిసి దూకాడు. గమనించిన స్థానికులు బావిలోకి దిగి గాలించి ముగ్గురిని బయటకు తీశారు. అప్పటికే చిన్నారులు ఇద్దరూ మృతి చెందారు. శరణప్ప ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనపై కమలాపుర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: బాలికపై అఘాయిత్యం.. 80 ఏళ్ల వృద్ధుడితోపాటు.. మరో ఐదుగురు
Comments
Please login to add a commentAdd a comment