పోలీసుల అత్యుత్సాహానికి ఓ ఇంజనీరింగ్ విద్యార్థి బలయ్యాడు. పోలీసులు అవమానించారనే మనస్తాపం తో భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రానికి చెందిన ఒల్లాల సాయిగౌతమ్ (21) నిజామా బాద్‌లో పాలిటెక్నిక్ చదివాడు. అక్కడ ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం సాయిగౌతమ్ హైదరాబాద్ జేఎన్‌టీయూలో బీటెక్ సెకండియర్ చదువుతూ నిజాంపేట్ లోని ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. అమ్మా యి సైతం అక్కడే చదువుకుంటోంది. ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన అమ్మాయి కుటుంబసభ్యు లు ఘట్‌కేసర్‌లోని పోలీస్ ఔట్‌పోస్టులో కాని స్టేబుల్‌గా పనిచేస్తున్న తమ బంధువుకు చెప్పారు. అంతా కలిసి అమ్మాయితో సాయి గౌతమ్‌పై నిజాంపేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించగా కేసు నమోదు చేశారు.
Published Wed, Jan 4 2017 7:30 AM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement