చౌకబియ్యం తరలిస్తున్న లారీ పట్టివేత
పోరుమామిళ్ల: చౌకడిపోల ద్వారా పేదలకు అందాల్సిన 380 బియ్యం బస్తాలు ఓ లారీలో అక్రమంగా తరలిస్తుండగా పట్టణ సరిహద్దులో ఎస్‌ఐ కృష్ణంరాజునాయక్, సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పద్మనాథన్ తెలిపారు. బద్వేలుకు చెందిన సునీల్ గిద్దలూరులో వాటిని కొనుగోలు చేసి లారీలో బద్వేలుకు తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు లారీని పట్టుకున్నట్లు ఆయన వివరించారు. డ్రైవర్ శీను, బియ్యం అక్రమ రవాణాదారుడు సునీల్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. లారీ, వ్యక్తులను తహసీల్దారుకు అప్పగించినట్లు సీఐ వివరించారు.