సాగర్‌ హైవేపై ప్రయివేట్‌ బస్సు బోల్తా | private bus roll over on the Sagar highway | Sakshi
Sakshi News home page

సాగర్‌ హైవేపై ప్రయివేట్‌ బస్సు బోల్తా

Published Sun, Feb 26 2017 11:28 PM | Last Updated on Sat, Aug 11 2018 8:12 PM

సాగర్‌ హైవేపై ప్రయివేట్‌ బస్సు బోల్తా - Sakshi

సాగర్‌ హైవేపై ప్రయివేట్‌ బస్సు బోల్తా

► పది మంది పాస్టర్లకు స్వల్ప గాయాలు
► నాగార్జునసాగర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ప్రమాదం


యాచారం: సాగర్‌ హైవేపై ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో పది మంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా యాచారం సీఐ మదన్ మోహన్ రెడ్డి తెలిపిన వివరాలు...నగరంలోని ఆంధ్ర క్రిష్టియన్ జికల్‌ కాలేజీకి చెందిన 26 మంది పాస్టర్లు శనివా రం ఉదయం గాంధీనగర్‌ నుంచి ఓ ఓ ప్రైవేటు బస్సులో నాగార్జునసాగర్‌ విహారయాత్రకు  వెళ్లారు.

నగరానికి తిరిగి వస్తుండగా రాత్రి 8–45 గంటల సమయంలో యాచారం– గునుగల్‌ గేట్ల మధ్యన క్రీడా క్షేత్రం సమీపంలో బస్సు బొల్తా పడింది. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది పాస్టర్లకు స్వల్పగాయాలయ్యాయి. వారిని వెంటనే నగరంలోని వివిధ ఆస్పత్రులకు పంపించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని,  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement