Bus roll over
-
రెప్పపాటులో 'ఘోరం'.. జల్లేరు వాగులో బస్సు బోల్తా
సమయం మధ్యాహ్నం 12 గంటలు.. పల్లె వెలుగు బస్సు ఓ వంతెనపై వెళుతోంది.దాదాపు నాలుగు గంటలుగా ప్రయాణం.. సాఫీగానే సాగుతోంది... మరో పావు గం టలో గమ్యస్థానం చేరుకోనుండటంతో ప్రయాణికులంతా సిద్ధంగా ఉన్నారు.. అంతలో.. హఠాత్తుగా పెద్ద కుదుపు.. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి బ్రిడ్జిపైనే ఓవర్టేక్ చేసి బస్సు ముందుకు దూసుకొచ్చాడు.. అదుపు తప్పిన బస్సు డివైడర్‌ను ఎక్కి వంతెన ఎడమ వైపు రెయిలింగ్‌ను బలంగా ఢీ కొట్టింది.. తేరుకునేలోపే బస్సు వాగులో పడిపోయింది.. పది ప్రాణాలు నీటిలో కలిశాయి.. పశ్చిమ గోదావరి జిల్లా వేగవరం వద్ద జల్లేరు వాగులో చోటు చేసుకున్న విషాద ఘటన ఇది. ప్రముఖుల దిగ్భ్రాంతి బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. జంగారెడ్డిగూడెం/జంగారెడ్డిగూడెం రూరల్, ఏలూరు టౌన్: కొద్దిసేపట్లో గమ్య స్థానానికి చేరుకోవాల్సిన బస్సు ప్రయాణం కొన్ని కుటుంబాలకు అంతిమయాత్రగా మారింది. మృతుల కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఒక ప్రాణాన్ని రక్షించే క్రమంలో పది ప్రాణాలు పోయాయి. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం శివారు జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు పడిపోయిన ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. అక్కడున్న స్థానికులు తక్షణమే స్పందించగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను కాపాడటంతోపాటు వెంటనే ఆస్పత్రులకు తరలించి వైద్య సాయం అందించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మరో రూ.2.5 లక్షల చొప్పున అదనంగా పరిహారాన్ని అందించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. భద్రాచలం నుంచి జంగారెడ్డిగూడెం వస్తున్న పల్లె వెలుగు బస్సు (ఏపీ 37 జడ్ 0193) జల్లేరు వాగు వంతెనపై ఓ ద్విచక్ర వాహనదారుడిని తప్పించే క్రమంలో ప్రమాదానికి గురైంది. ఉదయం 8 గంటలకు బయల్దేరిన ఈ బస్సులో 47 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఆ సమయంలో వాగులో నీరు నిండుగా ప్రవహిస్తోంది. క్షతగాత్రుల హాహాకారాలతో స్థానికులు వెంటనే స్పందించి కాపాడారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు వీఆర్ ఎలీజా, తెల్లం బాలరాజు, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, జేసీ హిమాన్షు శుక్లా, ఆర్టీసీ ఛైర్మన్, ఎండీ ద్వారకా తిరుమలరావు సహాయ చర్యలను పర్యవేక్షించారు. జల్లేరు వాగులో పడిన ఆర్టీసీ బస్సు వద్ద సహాయక చర్యల్లో స్థానికులు ఆర్టీసీ తరఫున రూ.2.50 లక్షలు ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన సేవలు అవసరమైతే తక్షణమే ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తామని భరోసా ఇచ్చారు. తీవ్ర గాయాలైన బాధితులకు మెరుగైన వైద్యాన్ని ఆర్టీసీ పర్యవేక్షణలోనే అందిస్తామని తెలిపారు. ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి మృతులకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించారని, ఆర్టీసీ తరపున మరో రూ.2.50 లక్షలు అందచేస్తామని చెప్పారు. తొలుత వారిద్దరూ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రి వద్ద విలపిస్తున్న బాధితులు నిమిషాల వ్యవధిలో... ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 20 నిమిషాల్లోనే రెస్క్యూ అక్కడకు చేరుకుంది. క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, డీఎస్పీలు డాక్టర్ రవికిరణ్ తదితరులు ఆగమేఘాలపై అక్కడకు వెళ్లారు. సుమారు 4 గంటలకుపైగా శ్రమించిన రెస్క్యూ టీం వాగులో పడిన బస్సును మూడు భారీ క్రేన్ల సాయంతో వెలికి తీసింది. క్షతగాత్రులకు తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేశారు. క్షతగాత్రుల వివరాలు.... పసుపులేటి రాజారావు (సూర్యారావుపాలెం–ఉండ్రాజవరం), కె.హరినాథ్‌బాబు (నల్లజర్ల), కవ్వాడి కామరాజు (గోపన్నగూడెం–అశ్వారావుపేట), సత్తెనపల్లి కృష్ణవేణి (తాళ్లపూడి), సత్తెనపల్లి పద్మారావు (తాళ్లపూడి), చోడేదేవి (పూసర్ల–వేలేరుపాడు), చోడే సీతమ్మ (పూసర్ల–వేలేరుపాడు), మల్లిడి సోమశేఖర్‌రెడ్డి (రామవరం–అనపర్తి), కోట మనీషా(కుక్కునూరు), కోట ముత్యాలు (కుక్కునూరు), ఎం.లక్ష్మి (జంగారెడ్డిగూడెం), కె.నాగమ్మ (దేవులపల్లి), పంపన శకుంతలదేవి (గొల్లగూడెం–ద్వారకాతిరుమల), కె.కీర్తి (నాగిగూడెం–కుక్కునూరు), కోట ప్రశాంతి (కుక్కునూరు), తాటి సుబ్బలక్ష్మి (తోటపల్లి–బుట్టాయగూడెం),కె.సులోచన (నాయుడుగూడెం– కుక్కునూరు), పాయం శివ (భద్రాచలం), పాయం రమేష్ (పండువారిగూడెం), ఉమ్మడి దుర్గ (టి.నర్సాపురం), జి.రవిశేఖర్ (కరిచెర్లగూడెం), పసుపులేటి మంగ (సూర్యారావుపాలెం), కేత వరలక్ష్మి, కండెల్లి స్వప్న (గోపాలపురం), ఉండ్రాజవరపు గీతికాన్షి (జి.కొత్తపల్లి–ద్వారకాతిరుమల). ఈత రావడంతో.. బస్సు ముందు సీట్లల్లో కూర్చున్నాం. హఠాత్తుగా వెనుక నుంచి ఓ ద్విచక్ర వాహనం వేగంగా రావడంతో తప్పించే క్రమంలో వంతెనను ఢీకొని బస్సు వాగులో పడిపోయింది. ఈత రావడంతో వాగులో దూకి ప్రాణాలు కాపాడుకున్నాం. స్థానికులు, మత్స్యకారులు వెంటనే స్పందించి నాటు పడవలు, తాళ్ల సాయంతో గాయపడ్డ వారిని రక్షించారు. – శివ, రమేష్, భద్రాచలం (ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణిస్తున్న ప్రత్యక్ష సాక్షులు) ఆర్డీవోతో విచారణ కమిటీ క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ప్రమాద సమాచారం తెలియగానే ఆయన వెంటనే జంగారెడ్డిగూడెం చేరుకుని గాయపడ్డవారిని పరామర్శించారు. స్వల్ప గాయాలైన వారికి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ 9 మందికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బస్సు ప్రమాద ఘటనపై ఆర్డీవో స్థాయి అధికారితో కమిటీని నియమించామని, నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదంపై గవర్నర్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం పట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో డ్రైవర్‌తో సహా 9 మంది ప్రయాణికులు మృతిచెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు తగిన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. సీఎం జగన్ సానుభూతి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాకు ఆదేశం సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని మోదీ బాసట సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని ప్రధాని కార్యాలయం అధికారిక ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఈ మొత్తాన్ని అందచేయనున్నట్లు పేర్కొన్నారు. బాధాకరం: మండలి చైర్మన్ సాక్షి,అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ఏపీ శాసనమండలి చైర్మన్ మోషెన్ రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో తొమ్మిది మంది మరణించడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు వెనువెంటనే ప్రభుత్వం స్పందించి సత్వరంగా రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సకోసం జంగారెడ్డిగూడెం, ఏలూరులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారని పేర్కొన్నారు. ఘటనపై సత్వరమే స్పందించి, విచారణకు ఆదేశించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా
-
అనంతపురంలో ట్రావెల్ బస్సు బోల్తా
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న మార్నింగ్ స్టార్‌కు చెందిన ట్రావెల్ బస్సు పామురాయి గ్రామ సమీపంలోకి రాగానే అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ప్రమాద సంఘటన తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని జేసీబీ సహాయంతో రోడ్డుకు అడ్డంగా బస్సును పక్కకు తొలగించారు. బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను పోలీసులు అక్కడి స్థానికుల సహాయంతో బయటికి తీసి రక్షించారు. కాగా ఈ ఘటనలో బెంగుళూరుకు చెందిన కారుణ్య(28), శిరీష(30), అవంతి(25), మరొకరికి తీవ్ర గాయాలవడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా
కాటారం(మల్హర్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూర్ పీవీనగర్ వద్ద కాటారం – మంథని ప్రధాన రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రయాణికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గోదావరిఖని డిపోకు చెందిన (ఏపీ 01 వై 2992) నంబర్ అద్దె బస్సు గోదావరిఖని నుంచి మంథని మీదుగా భూపాలపల్లికి 63 మంది ప్రయాణికులతో బయలుదేరింది. పెద్దపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతమైన అడవిసోమన్‌పల్లి మానేరు వంతెన దాటిన అనంతరం ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి బస్సు రోడ్డు పక్కకు దిగి పల్టీ కొట్టింది. దీంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. ప్రమాదాన్ని పసిగట్టిన కొందరు అప్రమత్తమై బస్సు లోపల భాగాలను గట్టిగా పట్టుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, 30 మంది ప్రయాణికులు తీవ్రగాయాలపాలవ్వగా మరో 7గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రయాణికుల తల, కాళ్లు, శరీరంలోని ఇతర భాగాలకు గాయాలయ్యాయి. పలువురికి తీవ్ర రక్తస్రావమైంది. బాధితులు 108, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో క్షతగాత్రులను కాటారం, మహదేవపూర్, మంథని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయించారు. -
యాత్రికుల బస్సు బోల్తా.. ఒకరి మృతి
కర్నూలు ,ఓర్వకల్లు: యాత్రికుల బస్సు బోల్తా పడి ఒకరు మృతిచెందగా, 17 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లా బేలూరు పట్టణానికి చెందిన 52 మంది యాత్రికులు కేఏ 06 డి 4887నంబర్ శివగంగ ట్రావెల్ (తుమ్కూర్) టూరిస్టు బస్సు çకర్నూలు జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాల సందర్శనార్థం బయలు దేరివచ్చారు. శ్రీశైలం, మహానంది క్షేత్రాలను దర్శించుకొని తిరుగు ప్రయాణంలో మంత్రాలయానికి బయలుదేరారు. మార్గం మధ్యలో ఓర్వకల్లు వద్దకు చేరుకోగానే 40వ నంబర్ జాతీయ రహదారిపై బస్సు ముందు చక్రం పగిలి ప్రమాదవశాత్తు అదుపుతప్పింది. ఈ క్రమంలో నంద్యాల నుంచి కర్నూలు వైపు వెళ్లుతుండగా ఎడమవైపు నుంచి కుడి వైపునకు వేగంగా దూసుకెళ్లి కర్నూలు నుంచి సెంట్రింగ్ సామగ్రితో వస్తున్న మినీ లారీని ఢీకొట్టి ఫ్లైఓవర్ వంతెనపై నుంచి ఆర్టీసీ బస్టాండ్ వైపు ఉన్న సర్వీస్ రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాదంలో 15 మంది కన్నడ యాత్రికులతో పాటు మినీ ట్రక్కు డ్రైవర్ ఫరూక్‌బాషా, హెల్పర్ వినోద్‌కుమార్ గాయపడ్డారు. ప్రమాద సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు బోల్తా పడగానే యాత్రికులు పెద్దఎత్తున ఆర్థనాదాలు చేయడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక ఎస్ఐ మధుసూదన్‌రావు పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మూడు 108 వాహనాల్లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కన్నడ భక్తుడు గోవింద్ స్వామి(50) కోలుకోలేక మృతి చెందాడు. ప్రముఖుల పరామర్శ టూరిస్టు బస్సు బోల్తా పడిన విషయం తెలుసుకున్న వెంటనే వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, గౌరు వెంకటరెడ్డి, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ వేర్వేరుగా ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాద తీరును పరిశీలించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్ పరామర్శ కర్నూలు(హాస్పిటల్): ఓర్వకల్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్చారు. వీరిని సాయంత్రం జిల్లా కలెక్టర్ కలిసి పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్‌ను ఆదేశించారు. క్షతగాత్రులు వీరే.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన రంగస్వామి, పుత్తురాజ్, బీటీ దేవి, శోభ, నాగమ్మ, నాగరాజు, శాంతమ్మ, ఇందిరా, సరస్వతి, సర్వమంగళ, దేవమ్మ, రామయ్య, తాయమ్మ, సిద్దలింగమ్మ వీరందరు మాండ్యా జిల్లా నాగమంగళ తాలుకా బేలూర్ పట్టణ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఇక తుంకూరు టూరిస్టు బస్సు డ్రైవర్ రవికుమార్, ట్రక్కు డ్రైవర్ షేక్ ఫరూక్బాషాకు తీవ్ర గాయాలు అయ్యాయి. ట్రక్కుహెల్పర్ వినోద్‌కుమార్ కర్నూలు నగరంలోని లక్ష్మినగర్‌కు చెందిన వాసి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కర్నూలు తాలుకా రూరల్ సీఐ పవన్‌కిశోర్ తెలిపారు. -
త్వరగా వచ్చేయ్..మరో పార్టీ ఉంది
శబరిమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఈ సంఘటన మదనపల్లె బైపాస్‌రోడ్డులో చోటుచేసుకుంది. చిత్తూరు , మదనపల్లె సిటీ : అనంతపురం జిల్లా ఓబుళదేవలచెరువు (ఓడిసి), గోరంట్ల, నల్లమాడ మండలాలకు చెందిన 18 మంది అయ్యప్ప భక్తులతో పాటు వారి కుటుంబసభ్యులు 27 మంది శబరిమలకు ప్రైవేటు బస్సులో ఈనెల 20న ఓడిసి నుంచి బయలుదేరి వెళ్లారు. 22న అక్కడ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం కన్యాకుమారి, రామేశ్వరంలోని ఆలయాలను సందర్శించారు. గురువారం వేలూరు సమీపంలోని స్వర్ణదేవాలయం దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో ఘోర ప్రమాదానికి గురయ్యారు. మదనపల్లె బైపాస్‌రోడ్డులోని ఆర్టీఓ కార్యాలయం వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొని బోల్తాపడింది. అప్పుడు సమయం ఉదయం 3.30 గంటలు. బస్సు ముందరి అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. భక్తుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. బస్సులో ప్రయాణిస్తున్న గోర్లంట మండలం పాలసముద్రం పంచాయతీ లింగొల్లపల్లెకు చెందిన వంటమాస్టర్ సిద్ధిరెడ్డిగారి తిరుపాల్‌రెడ్డి (40) రెండు కాళ్లు విరిగిపోయాయి. అలాగే రామాంజులమ్మ (40), చంద్ర (30), సాలమ్మ (70) బాలనాగమ్మ(70), లలితమ్మ(70), ఆంజనమ్మ (65), నాగలక్ష్మి(62), వెంకట్రమణప్ప(65), లావణమ్మ(46), ఆదిలక్ష్మమ్మ (65), వెంకటశివారెడ్డి (65), సవరమ్మ (45), వెంకటలక్ష్మి(70), బి.రమణప్ప(55) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే రూరల్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తిరుపాల్‌రెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం పుట్టపర్తిలోని సత్యసాయి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. గాయపడిన వారిలో పలువురిని 108లో మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించి చికిత్స చేశారు. స్వల్పంగా గాయపడిన వారిని పోలీసులు మరో బస్సులో స్వగ్రామాలకు తరలించారు. రూరల్ పోలీçసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐచర్ వ్యాను ఢీకొని మోటార్ సైక్లిస్టు.. పీలేరు రూరల్ : ఐచర్ వ్యాను ఢీకొనడంతో మోటార్ సైక్లిస్టు దుర్మరణం చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు.. సో మల మండలం నెల్లిమందకు చెందిన ఓంకార్ (23) మోటార్ సైకిల్లో పీలేరు నుంచి వాల్మీకిపురానికి బయలుదేరాడు. కలికిరి నుంచి పీలేరుకు ఎదురుగా వస్తున్న ఐచర్ వాహనం జంగంపల్లె అతడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓంకార్‌ను చికిత్స నిమిత్తం 108లో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ ఓంకార్ మృతి చెందాడు. పీలేరు ఎస్ఐ సుధాకర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు ఢీకొని వైఎస్సార్ జిల్లా వాసి... పుత్తూరు: రైలు ఢీకొని ఒకరు మృతి చెందిన సం ఘటన పుత్తూరులో చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్ కథనం.. వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం చెర్లోపల్లెకు చెందిన ఎస్.లక్ష్మీనారాయణ (33)కొన్నేళ్లుగా కూలీ ప నులు చేసుకుంటూ బొజ్జనెత్తంలో నివాసముంటున్నా డు. శుక్రవారం ఉదయం అతడు పుత్తూరు– తడుకు రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొంది. లక్ష్మీనారా యణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హెడ్‌కానిస్టేబుల్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని విశ్రాంత హెచ్ఎం.. కార్వేటినగరం: గుర్తుతెలియని వాహనం ఢీకొని విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికుల కథనం..ముస్లిం కాలనీకి చెందిన రిటైర్డ్ హెచ్ఎం పీ.ఎండీ షఫీఉల్లాఖాన్(72) సొంత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంలో పుత్తూరుకు వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా, సురేంద్రనగరం పెద్ద కనుమ వద్ద గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని భోరున విలపించారు. మృతదేహాన్ని ఇంటికి తరలించారు. గతంలో ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘంలో నాయకుడిగా, ప్రస్తుతం మండల విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘానికి మండల అ«ధ్యక్షుడిగా షఫీ వ్యవహరిస్తున్నారు. పలువురు పెన్షనర్ల సంఘ నాయకులు ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. త్వరగా వచ్చేయ్..మరో పార్టీ ఉంది ‘త్వరగా..త్వరగా వచ్చేయ్..మరో పార్టీ ఉంది’ అన్న బస్సు ఓనర్ మాటలే కొంపముంచాయి. వాస్తవానికి తాము గోల్డెన్ టెంపుల్ దర్శించుకున్న అనంతరం కాణిపాకం దేవాలయాన్ని సందర్శించాల్సి ఉందని, అయితే బస్సు ఓనర్ అర్జెంట్‌గా రమ్మన్నాడని, మరో పార్టీని తీసుకెళ్లాలని ఆదేశించాడని, అందుకే కాణిపాకానికి తీసుకెళ్లలేనంటూ డ్రైవర్ నేరుగా అనంతబాట పట్టాడని భక్తులు చెప్పారు. అంతేకాకుండా సుదీర్ఘమైన ప్రయాణానికి ఇద్దరు డ్రైవర్లకు బదులు ఒక్కడినే పంపడం, ఏకధాటిగా ఒకడే రేయింబవళ్లూ బస్సు నడుపుతుండడం.. నిద్రలేక కునుకుతీయడం వలనే ఈ ఘోర ప్రమాదం సంభవించిందని భక్తులు ‘సాక్షి’కి చెప్పారు. -
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
కృష్ణా, పెదపారుపూడి(పామర్రు): డ్రైవర్ నిద్ర మత్తులో బస్సు నడపడంతో అదుపు తప్పి పంట కాలువలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని వానపాముల హైస్కూల్ వంతెన వద్ద ఆదివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి ఏపీ 16టీజే 4532 నెంబరు గల ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు బయలుదేరింది. తెల్లవారు జామున 5.10 నిమిషాలకు వానపాముల హైస్కూల్ సమీపంలోకి రాగానే అదుపు తప్పి పక్కన ఉన్న సౌత్ చానల్ పంట కాలువలోకి బోల్తా కొట్టింది. బస్సు బోల్తా పడినప్పుడు బస్సులో సుమారు 35 మంది ప్రయాణిలు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు ముగ్గురికి మాత్రమే గాయాలయ్యాయి. గాదిరాజు కృష్ణవేణి, బోడా వీరభద్ర సూర్య శశి కిరణ్, భార్గవిలు స్వల్పంగా గాయపడ్డారు. బాధితులను గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తెల్లవారుజాము కావడంతో ప్రయాణికులు గాడ నిద్రలో ఉండటంతో ఏమి జరిగిందో తెలియలేదని ప్రయాణికులు ఆంజనేయరాజు, అబూ అలీ చెప్పారు. ప్రమాదం జరుగగానే ప్రయాణికులను వదిలి డ్రైవర్ పారిపోయాడు. సౌత్ చానల్లో నీరు తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పామర్రు, గుడివాడ సీఐలు, ఎస్సెలు డి. శివశంకర్ ప్రసాద్, ఎస్. దుర్గా ప్రసాద్ హుటాహూటిన ఘటనా సల్థానికి చేరుకున్నారు. బస్సు యాజమాన్యంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. -
పొట్టకూటికి వెళ్లి.. అనంత లోకాలకు
అంతేలే పేదల బతుకులు. అశ్రువులే నిండిన కుండలు. ఉన్న ఊరిలో ఉపాధి లేదు. ఖాళీగా కూర్చుంటే కుటుంబం గడవదు. ఇంకేం చేయాలి. ఎక్కడ పనిదొరికితే అక్కడికి వెళ్లి పని చేసుకుంటూ పొట్ట పోసుకోవాలి. ఈ కోవకే చెందిన ఒడిశా రాష్ట్రవాసులు కొంతమంది పొట్ట చేతబట్టుకుని పనికోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లారు. రోజూ లాగానే పని పూర్తి చేసుకుని ఇంటికి తిరుగు ముఖం పట్టిన సమయంలో బస్సు బోల్తా కొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అంతా నిరుపేదలే బాధితులంతా నిరుపేదలే. కష్టాన్ని నమ్ముకుని ఎక్కడో ఒడిశా, విశాఖ ప్రాంతాల నుంచి ఇక్కడ పనిచేసేందుకు వచ్చారు. మృతులిద్దరూ ఆదివాసీలు. మిగిలిన చాలామంది కూడా ఆదివాసిలే. గాయపడిన 17 మందిలో పిక్కి సత్యవేణి, పిక్కోలు కాసులమ్మ, పిక్కి రాము అనే ముగ్గురు మహిళలు మాత్రం విశాఖ జిల్లాకు చెందిన వారు. ప్రమాదం ఇలా.. అశ్వినీ రొయ్యల ఫ్యాక్టరీలో గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకూ మహిళా కార్మికులు నైట్ షిఫ్ట్ చేశారు. డ్యూటీ దిగిన తర్వాత 30 మంది కార్మికులు ఫ్యాక్టరీకి చెందిన మినీబస్సులో సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద ఉన్న తమ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌కు బయల్దేరారు. బస్సును డ్రైవర్ జయరాజు అతివేగంగా నడపడంతో అదుపు తప్పి బోల్తా పడిందని విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామానికి చెందిన బాధితురాలు పిక్కి సత్యవేణి శుక్రవారం తెల్లవారుజామున 2.45 గంటలకు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనలో ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా ముకుందాపురం మండలం చిటికపొంగ గ్రామానికి చెందిన ఉర్లక కళావతి (23) అలియాస్ లిజా, ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా గైబ మండలం సరికా గ్రామం కాశీనగర్‌కు చెందిన సబర సుందరి (19) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో 17 మంది గాయపడగా ప్రభుత్వాస్పత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి పంపారు. ఒడిశాకు చెందిన గురుబారి నాయక్, నాయక్ సీమా అనే మహిళలకు తీవ్రగాయాలు కావడంతో ఐసీయూలో ఉంచారు. ఒడిశాకు చెందిన బిరుసువా గొమాంగో, విశాఖ జిల్లాకు చెందిన పిక్కి రాము అనే ఇద్దరు మహిళలు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారికి స్వల్పగాయాలు కావడంతో వారికి చికిత్స చేసి పంపించారు. భీమవరం టౌన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పట్టణంలో అశ్వినీ రొయ్యల ఫ్యాక్టరీకి చెందిన మినీ బస్సు గురువారం అర్ధరాత్రి యనమదుర్రు రోడ్డు పీడబ్ల్యూడీ లాకుల సమీపంలో నీరులేని పంటబోదెలోకి తిరగబడటంతో ఒడిశాకు చెందిన ఇద్దరు యువతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ప్రమాదంలో 17 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు మహిళలు అదే ఆస్పత్రిలో సాధారణ వార్డులో చికిత్స పొందుతుండగా 13 మంది మహిళలకు స్వల్పగాయాలు కావడంతో చికిత్స చేసి పంపారు. ఫ్యాక్టరీకి చెందిన డ్రైవర్ జయరాజు అతివేగంగా, అజాగ్రత్తగా మినీ బస్సును నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు పిక్కి సత్యవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు భీమవరం వన్‌టౌన్ ఎస్సై ఎస్.సత్యసాయి తెలిపారు. డ్రైవర్ జయరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసాపురం డీఎస్పీ టి.ప్రభాకరబాబు, సీఐ డి.వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను చూసి వివరాలు తెలుసుకున్నారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ రమణ ఘటనా స్థలానికి వెళ్లి బస్సును పరిశీలించారు. ఫిట్నెస్, పత్రాలు సరిగా ఉన్నాయో లేదో విచారిస్తున్నట్టు ఆయన తెలిపారు. గందరగోళంగా వివరాలు మృతులు, బాధితులంతా ఒడిశా, విశాఖకు చెందిన వారు కావడంతో వివరాలు తెలియక గందరగోళం నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు పేర్లు సేకరించగలిగినా మృతుల పేర్లు ఎవరెవరివో తెలియలేదు. ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని బాధితుల ఆధార్ కార్డులు తీసుకురమ్మని పోలీసులు కోరినా సాయంత్రం వరకూ అందజేయలేదు. మృతదేహాలు అనాథలుగా ప్రభుత్వాస్పత్రి మార్చురీలోనే సాయంత్రం వరకూ ఉన్నాయి. అక్కడ కనీసం ఎవరూ లేరు. సాయంత్రం 4 గంటల సమయంలో మృతురాలు సుందరి కుటుంబ సభ్యులు ఒడిశా నుంచి రావడంతో ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాన్ని గుర్తించడంతో ఆచూకీ తెలిసింది. -
సాగర్ హైవేపై ప్రయివేట్ బస్సు బోల్తా
► పది మంది పాస్టర్లకు స్వల్ప గాయాలు ► నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం యాచారం: సాగర్ హైవేపై ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో పది మంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా యాచారం సీఐ మదన్ మోహన్ రెడ్డి తెలిపిన వివరాలు...నగరంలోని ఆంధ్ర క్రిష్టియన్ జికల్ కాలేజీకి చెందిన 26 మంది పాస్టర్లు శనివా రం ఉదయం గాంధీనగర్ నుంచి ఓ ఓ ప్రైవేటు బస్సులో నాగార్జునసాగర్ విహారయాత్రకు వెళ్లారు. నగరానికి తిరిగి వస్తుండగా రాత్రి 8–45 గంటల సమయంలో యాచారం– గునుగల్ గేట్ల మధ్యన క్రీడా క్షేత్రం సమీపంలో బస్సు బొల్తా పడింది. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది పాస్టర్లకు స్వల్పగాయాలయ్యాయి. వారిని వెంటనే నగరంలోని వివిధ ఆస్పత్రులకు పంపించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
బిహార్‌లో బస్సు బోల్తా
⇒ 35 మందికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం ⇒ గాయపడిన వారిలో సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, హైదరాబాద్ వారు ⇒ 40 మంది యాత్రికులతో సిద్దిపేట నుంచి కాశీకి బయలుదేరిన బస్సు ⇒ గయాకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో పల్టీకొట్టిన బస్సు సాక్షి, సిద్దిపేట: కాశీయాత్రకు వెళ్లిన యాత్రికుల బస్సు బిహార్ రాష్ట్రం గయాకు 30 కిలో మీటర్ల దూరంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 10 మందికి పైగా కాళ్లు చేతులు విరి గాయి. బుధవారం ఉదయం ప్రమాదం జరి గిందని.. బస్సు ఒక పల్టీ కొట్టిన తర్వాత పెద్ద రాతి గుండుకు తాకి ఆగిందని, లేకుంటే బస్సు లోయలో పడేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులలో కొంతమందిని గయా పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి, మరి కొంతమందిని పట్నాకు తరలించారు. బస్సులో ఉన్న వాళ్లంతా 60 ఏళ్లకు పైబడిన రిటైర్డు ఉద్యోగులు, వృద్ధులే. వారం రోజుల నుంచి విశ్రాంతి లేకుండా డ్రైవర్ బస్సు నడపటంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆర్టీఏ అధికారుల వద్ద లభించిన రూట్ పర్మిట్ లెటర్ ప్రకారం గాయపడిన వారిలో సిద్దిపేట, సిరిసిల్ల, ,కరీంనగర్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన వారున్నారు. దీనిపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించి అక్కడి అధికా రులతో మాట్లాడారు. బాధితులకు వైద్య సహా యం అందించాలని, సీరియస్‌గా ఉన్నవారిని హైదరాబాద్‌కు తరలించాలని కోరారు. కాశీకి వెళ్తూ.. టీఎస్–08,యూఏ–1216 నంబరు గల శ్రీ శ్రీనివాస ట్రావెట్స్ ప్రైవేటు బస్సు ఈ నెల 15న 40మంది ప్రయాణికులతో కాశీ యాత్రకు బయలుదేరింది. ఒక కాంట్రాక్టర్ వారిని యాత్రకు తీసుకువెళ్తున్నారు. సిద్దిపేట, దుబ్బాక, సిరిసిల్ల, హైదరాబాద్‌కు చెందిన ప్రయాణికులను ఎక్కించుకున్నారు. రాత్రి 10 గంటలకు మందపల్లి గ్రామం నుంచి తొమ్మది మందిని ఎక్కించుకుని సిద్దిపేట మీదుగా బయలు దేరింది. మొదట వారు భద్రాచలంలో రాముల వారిని దర్శనం చేసుకున్నారు. అన్నవరం ,సింహాచలం దర్శనం అనంతరం శ్రీకూర్మం, అరసవెళ్లి మీదుగా ఒరిస్సా రాష్ట్రంలోని పూరి, కోణార్క్ దేవాలయాలను సందర్శించారు. మంగళవారం భువనేశ్వర్ సమీపంలో రాత్రి భోజనం ముగించుకొని గయా వైపు బయలు దేరారు. గయా పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో బారాచాడి గ్రామం శివారులో బస్సు పల్టీ కొట్టింది. డ్రైవర్ వరుసగా ఏడు రోజులు నుంచి విశ్రాంతి లేకుండా బస్సు నడుపుతున్నాడని, డ్రైవింగ్ చేస్తూ కునుకు తీయటంతో బస్సు పల్టీ కొట్టిందని బాధితులు ‘సాక్షి’కి వివరించారు. బస్సు పల్టీ కొట్టి పెద్ద రాతిగుండుకు తాకి ఆగిపోయిందని.. లేకుంటే బస్సు లోయలో పడిపోయి పెను ప్రమాదం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు ఫోన్ ద్వారా వివరించారు. బస్సు అద్దాలు, ఇనుప ఊచలు గుచ్చుకోవటం వలన దాదాపు 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ఉన్నది వీళ్లే.. 1 తుమ్మిశెట్టి మల్లేశం (సిద్దిపేట), చల్లారి వెంకటలక్ష్మి (సిద్దిపేట), 3. చల్లాడి అంజ య్య (సిద్దిపేట), 4. లక్ష్మణ్ (సిద్దిపేట), 5. శివలక్ష్మి (సిద్దిపేట), 6. కృష్ణవేణి (హైదరాబాద్), 7. పి.నర్సిం హారెడ్డి (మందపల్లి), 8. పి.అరుణ (మందపల్లి), 9. బి.విజయ (కొండపాక), 10. మల్లారెడ్డి, 11. ప్రమీల, 12 మంగమ్మ, 13, ప్రతాప్‌రెడ్డి (కొండపాక) 14. విజయ (హైదరాబాద్) 15. చిట్యాల సులోచన (పెద్దచెప్యాల), 16. కొత్త వెంకటమ్మ (మందపల్లి), 17 అనుసూయ (మంద పల్లి), 18. సులోచన (మందపల్లి), 19. మధురమ్మ (మందపల్లి), 20. కొత్త రాంచంద్రారెడ్డి (మందపల్లి), 21. కూర పద్మ (సిద్దిపేట), 22. అనసూ య(కరీంనగర్), 23. విమలవ్వ (కరీం నగర్), 24. బాలవ్వ (ఎల్లుపల్లి), 25. శన గొండ బ్రహ్మచారి (బెజ్జంకి), 26. అన్నపూర్ణ (బెజ్జంకి), 27, అనసూయ (మందపల్లి), 28. విజయ (పెద్ద చెప్యాల), 29.నర్సింహారెడ్డి (హైదరాబాద్), 30. డి.సరళ (సిరిసిల్ల), 31. ఎ.విజయ (మందపల్లి), 32. మచ్చ మార్కండేయ (బెజ్జంకి), 33. తులశవ్వ (బెజ్జంకి), 34, బాల్‌రాజయ్య (పెద్ద చీకోడ్), 35. రాంచంద్రారెడ్డి, (పెద్ద చీకోడ్) 36. యాదవ్వ (వెలికట్ట), 37. మూడ నారాయణ (పెద్ద చీకోడ్), 38 బాలకృష్ణయ్య (సిద్దిపేట), 39. కాంతమ్మ (పెద్ద చికోడ్), 40. బాల్రాములు (పెద్ద చీకోడ్). తక్షణమే స్పందించిన మంత్రి హరీశ్‌రావు రిటైర్డ్ ఉద్యోగి పన్యాల నర్సింహారెడ్డిని విమానంలో హైదరాబాద్ కు తీసుకరావటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట తిరుపతిలో ఉన్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తక్షణమే స్పందించారు. యాత్రికుడు మల్లారెడ్డి ఫోన్‌కు ఎస్ఎంఎస్ అందించారు. ఆయన వెంటనే బిహార్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు. అక్కడ అయ్యే వైద్య ఖర్చులను తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సోదరుని కుమారుడు సచిన్ యాదవ్‌తో మాట్లాడి వ్యక్తగత సహాయాన్ని అర్ధించారు. క్షతగాత్రుల ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకోవాలని కోరారు. మంత్రి అభ్యర్థనతో బాధితులకు అక్కడి అధికారులు వైద్య సేవలు అందిస్తున్నారు. సీరియస్‌గా ఉన్న వారిని పట్నాకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఒక్కరిద్దరు మినహా మిగిలిన వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్టే అని అక్కడి వైద్యులు తెలిపినట్లు బాధితుడు ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
బిహార్‌లో బస్సు బోల్తా : యాత్రికులకు గాయాలు
సిద్దిపేట: వారణాశి పుణ్యక్షేత్రానికి వెళ్తున్న సిద్దిపేట వాసులు ప్రమాదానికి గురయ్యారు. స్థానిక శ్రీనివాస ట్రావెల్స్‌కు చెందిన బస్సులో సిద్దిపేట పరిసర ప్రాంతాలకు చెందిన వారు దాదాపు 40 మంది కాశీ తీర్థయాత్రకు పయనమయ్యారు. వీరి ప్రయాణిస్తున్న బస్సు బుధవారం ఉదయం బిహార్ రాష్టంలోని గయా చెక్ పోస్టు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులోని 15 మంది స్వల్పంగా గాయపడ్డారు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నకోడూర్ మండలం మందపల్లికి చెందిన వారని తెలుస్తోంది. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా
♦ డ్రైవర్, కండక్టర్ సహా 15 మందికి గాయాలు ♦ రాయిలాపూర్ గేటు వద్ద ఘటన ♦ డ్రైవర్ నిర్లక్ష్యమేనంటున్న పోలీసులు కౌడిపల్లి: అదుపు తప్పడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. డ్రైవర్, కండక్టర్ సహా 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కౌడిలిపల్లి మండలం రాయిలాపూర్ గేట్ సమీపంలో మెదక్-నర్సాపూర్ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. బాధితులు, ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ డిపోకు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు (నం: టీఎస్ 15జెడ్ 0116) గురువారం ఉదయం మెదక్ నుంచి జేబీఎస్‌కు వెళ్తుంది. బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. రాయిలాపూర్ గేట్ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. రాయిలాపూర్ గేట్ వద్ద ప్రయాణికులు లేకపోవడంతో ఆగకుండా వెళ్లింది. సమీపంలో రోడ్డుపైబైక్లు ఆపుకుని నలుగురు వ్యక్తులు ఉండటంతో వారిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించగా అదుపుతప్పిన బస్సు రోడ్డు కుడివైపునకు దూసుకెళ్లింది. అక్కడే గ్రామానికి మంచినీటిని సరఫరాచేసే బోరుమోటార్‌ను ఢీకొని సమీపంలోని మామిడి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సంగమేశ్వర్ (మెదక్), కండక్టర్ అనిత (గౌతాపూర్)తోపాటు ప్రయాణికులు గూడ లక్ష్మి(మెదక్), కౌ డిపల్లి అంతయ్య (కొడిపాక), సాలె నర్సింలు (దేవులపల్లి), సాదుల లక్ష్మీనర్సమ్మ (కిష్టాపూర్), రమ, బద్రి కావ్య, వీరరాజు (సరూర్‌నగర్), బానూబీ (మెదక్), సఫబేగం, షేక్‌అలీ (నర్సాపూర్), జలాల్పూర్ సుధాకర్ (కౌడిపల్లి), ర్యాగ ల్ల శ్రీకాంత్ (కొల్చారం), నరహరి (ధర్మాసాగర్) గాయపడ్డారు. ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి తనసిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆటోలో నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సహాయక చర్యలు... బస్సు బోల్తా పడటంతో ప్రయాణికులు ఆర్తనాదాలతో మిన్నంటాయి. బస్టాండ్ వద్ద ఉన్న కాజిపేటకు చెందిన జహంగీర్‌తోపాటు రాయిలాపూర్ వాసులు బస్సు అద్దాలను ధ్వంసం చేసి క్షతగాత్రులను బయటకు తీశారు. వారిని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. స్వల్పగాయాలైన వారిని వేరు బస్సులో తరలించారు. డ్రైవర్ సంగమేశ్వర్‌ను నర్సాపూర్‌లో ప్రథమ చికిత్స అనంతరం బంధువులు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. నర్సాపూర్ ఆసుపత్రి వైద్యులు బాధితులకు చికిత్సలు నిర్వహించారు. డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం వల్లే బస్సు బోల్తాపడిందని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. డ్రైవర్‌కు తప్పిన ప్రమాదం... బస్ బోల్తా పడటంతో డ్రైవర్ సంగమేశ్వర్‌గౌడ్‌కు గాయాలతో తప్పించుకున్నారు. బస్సు బోరు బావిని ఢీకొనడంతో బోల్తా పడ్డ ప్రదేశంలో బోరుబావిలోని పైప్ డ్రైవర్ సీటుకు పక్కనే తేలింది. కొద్దిలో డ్రైవర్ తలకు తగిలే ప్రమాదం ఉండేదని పలువురు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకోగలిగారు. -
‘తూర్పు’న ఘాట్ రోడ్లో..బస్సు బోల్తా
రాష్ట్రానికి చెందిన మహిళ మృతి చింతూరు/మారేడుమిల్లి: తూర్పు గోదావరి జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్లో సోమవారం వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో రాష్ట్రానికి చెందిన చింతగింజల విజయ(50) అనే మహిళ మృతి చెందింది. మరో 8 మంది గాయపడగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 45 మంది భక్తులు గతనెల 29న తీర్థయాత్రలకు బయలుదేరారు. ఈ క్రమంలో సోమవారం మారేడుమిల్లి నుంచి భద్రాచలం బయలుదేరారు. బస్సు ఘాట్ రోడ్లో ఇజ్జలూరు సమీపంలో యూ టర్న్ తీసుకునే క్రమంలో అదుపు తప్పి పక్కనే లోయలోకి బోల్తా పడింది. దీంతో ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపుర్‌కు చెందిన విజయ బస్సులో ఇరుక్కుని మృతి చెందగా, డ్రైవర్, క్లీనర్‌తో పాటు ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి.