వానపాముల వద్ద పంట కాలువలో బోల్తా కొట్టిన బస్సు
కృష్ణా, పెదపారుపూడి(పామర్రు): డ్రైవర్ నిద్ర మత్తులో బస్సు నడపడంతో అదుపు తప్పి పంట కాలువలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని వానపాముల హైస్కూల్ వంతెన వద్ద ఆదివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి ఏపీ 16టీజే 4532 నెంబరు గల ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు బయలుదేరింది. తెల్లవారు జామున 5.10 నిమిషాలకు వానపాముల హైస్కూల్ సమీపంలోకి రాగానే అదుపు తప్పి పక్కన ఉన్న సౌత్ చానల్ పంట కాలువలోకి బోల్తా కొట్టింది. బస్సు బోల్తా పడినప్పుడు బస్సులో సుమారు 35 మంది ప్రయాణిలు ఉన్నారు.
అయితే అదృష్టవశాత్తు ముగ్గురికి మాత్రమే గాయాలయ్యాయి. గాదిరాజు కృష్ణవేణి, బోడా వీరభద్ర సూర్య శశి కిరణ్, భార్గవిలు స్వల్పంగా గాయపడ్డారు. బాధితులను గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తెల్లవారుజాము కావడంతో ప్రయాణికులు గాడ నిద్రలో ఉండటంతో ఏమి జరిగిందో తెలియలేదని ప్రయాణికులు ఆంజనేయరాజు, అబూ అలీ చెప్పారు. ప్రమాదం జరుగగానే ప్రయాణికులను వదిలి డ్రైవర్ పారిపోయాడు. సౌత్ చానల్‌లో నీరు తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పామర్రు, గుడివాడ సీఐలు, ఎస్సెలు డి. శివశంకర్ ప్రసాద్, ఎస్. దుర్గా ప్రసాద్ హుటాహూటిన ఘటనా సల్థానికి చేరుకున్నారు. బస్సు యాజమాన్యంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment