బిహార్‌లో బస్సు బోల్తా | The bus roll over in Bihar | Sakshi
Sakshi News home page

బిహార్‌లో బస్సు బోల్తా

Published Thu, Feb 23 2017 3:33 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

The bus roll over in Bihar

35 మందికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
గాయపడిన వారిలో సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, హైదరాబాద్‌ వారు
40 మంది యాత్రికులతో సిద్దిపేట నుంచి కాశీకి బయలుదేరిన బస్సు
గయాకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో పల్టీకొట్టిన బస్సు


సాక్షి, సిద్దిపేట: కాశీయాత్రకు వెళ్లిన యాత్రికుల బస్సు బిహార్‌ రాష్ట్రం గయాకు 30 కిలో మీటర్ల దూరంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 10 మందికి పైగా కాళ్లు చేతులు విరి గాయి. బుధవారం ఉదయం ప్రమాదం జరి గిందని.. బస్సు ఒక పల్టీ కొట్టిన తర్వాత పెద్ద రాతి గుండుకు తాకి ఆగిందని, లేకుంటే బస్సు లోయలో పడేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులలో కొంతమందిని గయా పట్టణంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి, మరి కొంతమందిని పట్నాకు తరలించారు.

బస్సులో ఉన్న వాళ్లంతా 60 ఏళ్లకు పైబడిన రిటైర్డు ఉద్యోగులు, వృద్ధులే. వారం రోజుల నుంచి విశ్రాంతి లేకుండా డ్రైవర్‌ బస్సు నడపటంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆర్టీఏ అధికారుల వద్ద లభించిన రూట్‌ పర్మిట్‌ లెటర్‌ ప్రకారం గాయపడిన వారిలో సిద్దిపేట, సిరిసిల్ల, ,కరీంనగర్, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన వారున్నారు. దీనిపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించి అక్కడి అధికా రులతో మాట్లాడారు. బాధితులకు వైద్య సహా యం అందించాలని, సీరియస్‌గా ఉన్నవారిని హైదరాబాద్‌కు తరలించాలని కోరారు.

కాశీకి వెళ్తూ..
టీఎస్‌–08,యూఏ–1216 నంబరు గల శ్రీ శ్రీనివాస ట్రావెట్స్‌ ప్రైవేటు బస్సు ఈ నెల 15న 40మంది ప్రయాణికులతో కాశీ యాత్రకు బయలుదేరింది. ఒక కాంట్రాక్టర్‌ వారిని యాత్రకు తీసుకువెళ్తున్నారు. సిద్దిపేట, దుబ్బాక, సిరిసిల్ల, హైదరాబాద్‌కు చెందిన ప్రయాణికులను ఎక్కించుకున్నారు. రాత్రి 10 గంటలకు మందపల్లి గ్రామం నుంచి తొమ్మది మందిని ఎక్కించుకుని సిద్దిపేట మీదుగా బయలు దేరింది. మొదట వారు భద్రాచలంలో రాముల వారిని దర్శనం చేసుకున్నారు. అన్నవరం ,సింహాచలం దర్శనం అనంతరం శ్రీకూర్మం, అరసవెళ్లి మీదుగా ఒరిస్సా రాష్ట్రంలోని పూరి, కోణార్క్‌ దేవాలయాలను సందర్శించారు.

మంగళవారం భువనేశ్వర్‌ సమీపంలో రాత్రి భోజనం ముగించుకొని గయా వైపు బయలు దేరారు. గయా పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో బారాచాడి గ్రామం శివారులో బస్సు పల్టీ కొట్టింది. డ్రైవర్‌ వరుసగా ఏడు రోజులు నుంచి విశ్రాంతి లేకుండా బస్సు నడుపుతున్నాడని, డ్రైవింగ్‌ చేస్తూ కునుకు తీయటంతో బస్సు పల్టీ కొట్టిందని బాధితులు ‘సాక్షి’కి వివరించారు. బస్సు పల్టీ కొట్టి పెద్ద రాతిగుండుకు తాకి ఆగిపోయిందని.. లేకుంటే బస్సు లోయలో పడిపోయి పెను ప్రమాదం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు ఫోన్‌ ద్వారా వివరించారు. బస్సు అద్దాలు, ఇనుప ఊచలు గుచ్చుకోవటం వలన దాదాపు 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

బస్సులో ఉన్నది వీళ్లే..
1 తుమ్మిశెట్టి మల్లేశం (సిద్దిపేట), చల్లారి వెంకటలక్ష్మి (సిద్దిపేట), 3. చల్లాడి అంజ య్య (సిద్దిపేట), 4. లక్ష్మణ్‌ (సిద్దిపేట), 5. శివలక్ష్మి (సిద్దిపేట), 6. కృష్ణవేణి (హైదరాబాద్‌), 7. పి.నర్సిం హారెడ్డి (మందపల్లి), 8. పి.అరుణ (మందపల్లి), 9. బి.విజయ (కొండపాక), 10. మల్లారెడ్డి, 11. ప్రమీల, 12 మంగమ్మ, 13, ప్రతాప్‌రెడ్డి (కొండపాక) 14. విజయ (హైదరాబాద్‌) 15. చిట్యాల సులోచన (పెద్దచెప్యాల), 16. కొత్త వెంకటమ్మ (మందపల్లి), 17 అనుసూయ (మంద పల్లి), 18. సులోచన (మందపల్లి), 19. మధురమ్మ (మందపల్లి), 20. కొత్త రాంచంద్రారెడ్డి (మందపల్లి), 21. కూర పద్మ (సిద్దిపేట), 22. అనసూ య(కరీంనగర్‌), 23. విమలవ్వ (కరీం నగర్‌), 24. బాలవ్వ (ఎల్లుపల్లి), 25. శన గొండ బ్రహ్మచారి (బెజ్జంకి), 26. అన్నపూర్ణ (బెజ్జంకి), 27, అనసూయ (మందపల్లి), 28. విజయ (పెద్ద చెప్యాల), 29.నర్సింహారెడ్డి (హైదరాబాద్‌), 30. డి.సరళ (సిరిసిల్ల), 31. ఎ.విజయ (మందపల్లి), 32. మచ్చ మార్కండేయ (బెజ్జంకి), 33. తులశవ్వ (బెజ్జంకి), 34, బాల్‌రాజయ్య (పెద్ద చీకోడ్‌), 35. రాంచంద్రారెడ్డి, (పెద్ద చీకోడ్‌) 36. యాదవ్వ (వెలికట్ట), 37. మూడ నారాయణ (పెద్ద చీకోడ్‌), 38 బాలకృష్ణయ్య (సిద్దిపేట), 39. కాంతమ్మ (పెద్ద చికోడ్‌), 40. బాల్‌రాములు (పెద్ద చీకోడ్‌).  

తక్షణమే స్పందించిన మంత్రి హరీశ్‌రావు
రిటైర్డ్‌ ఉద్యోగి పన్యాల నర్సింహారెడ్డిని విమానంలో హైదరాబాద్‌ కు తీసుకరావటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట తిరుపతిలో ఉన్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తక్షణమే స్పందించారు. యాత్రికుడు మల్లారెడ్డి ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ అందించారు. ఆయన వెంటనే బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు. అక్కడ అయ్యే వైద్య ఖర్చులను తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు.

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సోదరుని కుమారుడు సచిన్‌ యాదవ్‌తో మాట్లాడి వ్యక్తగత సహాయాన్ని అర్ధించారు. క్షతగాత్రుల ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకోవాలని కోరారు. మంత్రి అభ్యర్థనతో బాధితులకు అక్కడి అధికారులు వైద్య సేవలు అందిస్తున్నారు. సీరియస్‌గా ఉన్న వారిని పట్నాకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఒక్కరిద్దరు మినహా మిగిలిన వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్టే అని అక్కడి వైద్యులు తెలిపినట్లు బాధితుడు ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement