బిహార్‌లో బస్సు బోల్తా : యాత్రికులకు గాయాలు | Bus roll over in bihar siddipet Pilgrims injured | Sakshi
Sakshi News home page

బిహార్‌లో బస్సు బోల్తా : యాత్రికులకు గాయాలు

Published Wed, Feb 22 2017 2:58 PM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

Bus roll over in bihar siddipet Pilgrims injured

సిద్దిపేట: వారణాశి పుణ్యక్షేత్రానికి వెళ్తున్న సిద్దిపేట వాసులు ప్రమాదానికి గురయ్యారు. స్థానిక శ్రీనివాస ట్రావెల్స్‌కు చెందిన బస్సులో సిద్దిపేట పరిసర ప్రాంతాలకు చెందిన వారు దాదాపు 40 మంది కాశీ తీర్థయాత్రకు పయనమయ్యారు.

వీరి ప్రయాణిస్తున్న బస్సు బుధవారం ఉదయం బిహార్ రాష్టంలోని గయా చెక్ పోస్టు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులోని 15 మంది స్వల్పంగా గాయపడ్డారు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నకోడూర్ మండలం మందపల్లికి చెందిన వారని తెలుస్తోంది. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement