pastors
-
ఏపీఎన్ఆర్టీఎస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
కడప కార్పొరేషన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గనిర్దేశం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల కోసం ఏపీఎన్ఆర్టీఎస్ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైఎస్సార్సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్ అన్నారు. అబుదాబిలో గురువారం ప్రముఖ పారిశ్రామికవేత్త మైనర్ బాబు ఆధ్వర్యంలో అబుదాబి ఐక్య తెలుగు క్రైస్తవ సంఘాల పాస్టర్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇలియాస్ మాట్లాడుతూ కరోనా సమయంలో వివిధ దేశాల్లో ఉన్న వేలాది మంది తెలుగువారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, అధికారులతో మాట్లాడి వెసులుబాటు కల్పించినట్లు గుర్తుచేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధ సమయంలో 918మంది, సుడాన్లో అంతర్యుద్ధం సమయంలో 99 మంది తెలుగు విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి చేర్చామని వివరించారు. ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు వినీత మాట్లాడుతూ దివంగత వైఎస్సార్ ఆశయ సాధనకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని, అన్ని రంగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించారన్నారు. ఏపీఎన్ఆర్టీఎస్ యూఏఈ రీజనల్ కో ఆర్డినేటర్ ప్రసన్న సోమిరెడ్డి, వైఎస్సార్సీపీ కన్వీనర్ సయ్యద్ అక్రం మాట్లాడుతూ ఏపీఎన్ఆర్టీఎస్ ప్రవాసాంధ్ర భరోసా బీమాను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల అధ్యక్షుడు ఫాదర్ శిశిర కుమార్, ఉపాధ్యక్షులు ఫాదర్ అగ్రిపా రాజుతోపాటు నాయకులు జాఫర్ వలీ, రెడ్డెయ్యరెడ్డి, మోహన్, సయ్యద్ నాసర్, ఆనంద్, అబ్దుల్లా, అరుణ్, ఆశీర్వాదం, సంపత్ పాల్గొన్నారు. -
అర్చకులు,ఇమామ్,మౌజమ్,పాస్టర్లకు ఆర్థికసాయం
-
లాక్డౌన్ వేళ..ఆర్థిక అండ
జయనగరం పూల్‌బాగ్: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో పూజలు, ప్రార్థనలు నిషేధించింది. భక్తులు రాకపోవడంతో అర్చకులు, మౌజమ్(ఇమామ్)లు, పాస్టర్లకు భృతి కరువైంది. వీరిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. జిల్లా వ్యాప్తంగా 3,060 మందికి రూ.5వేలు చొప్పున రూ.కోటీ53లక్షల ఆర్థిక సా యం మంగళవారం అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లాలో వివిధ దేవాలయాల్లో పూజలు చేసే 1616 మంది అర్చకులు, చర్చిల్లో ప్రార్థనలు జరిపే 1320 మంది పాస్టర్లు,62 మసీదుల్లో నమాజ్ చేయించే 124 మంది మౌజామ్,ఇమామ్‌లు లబ్ధిపొందనున్నారు. వీరి ఖాతాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి నగదు జమచేయనున్నారు. ఆర్థిక సాయంపై లబ్ధిదారు ల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేక ఆర్థిక సాయం... లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పాస్టర్లను, మౌజామ్లు, ఇమామ్‌లను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. అందులో భాగంగా ఒక్కొక్కరికి రూ.5వేలు సాయం అందించనుంది. జిల్లా వ్యాప్తంగా 1320 మంది పాస్టర్లు, 62 మంది మౌజామ్లు, 62 మంది ఇమామ్‌లు ఉన్నారు. వారందరికీ సాయం అందుతుంది. దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు ఎండోమెంట్ శాఖ ద్వారా సాయం అందనుంది. జిల్లావ్యాప్తంగా అందరికీ కలిపి రూ.కోటి 53 లక్షలు సాయం అందనుంది. – ఎం.అన్నపూర్ణమ్మ, మైనారిటీ సంక్షేమాధికారి, విజయనగరం కష్టకాలంలో ఆదుకుంటున్నారు.. సీఎం జగన్మోహన్రెడ్డి కష్టకాలంలో ఆదుకుంటున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇటువంటి సమ యంలో ఆర్థికంగా సాయం అందించి ఆదుకోవడం శుభపరిణామం. రెండు నెలలుగా ఆలయాలకు భక్తులు రాకపోవడంతో భృతికరువైంది. అర్చకులకు అండగా నిలవడం అభినందనీయం. – ఆకెళ్ల భాస్కరరావు, అర్చకులు, విజయనగరం -
నేడు అర్చకులు,పాస్టర్లుకు రూ.5వేల చొప్పున సాయం
-
మహిళపై లైంగికదాడి; పాస్టర్‌పై కేసు
సాక్షి, కోనేరుసెంటర్(మచిలీపట్నం): మహిళకు మత్తు మందు ఇచ్చి నగ్నంగా ఫొటోలు తీసి, బెదిరించి పలుమార్లు లైంగికదాడి చేసిన ఒక పాస్టర్ ఉదంతం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇనగుదురుపేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం చిలకలపూడికి చెందిన రాచర్ల జోయెల్ రాజుపేటలోని ఇమ్మానియేల్ గాస్పెల్ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. రాజుపేటకు చెందిన ఓ వివాహితతో ప్రార్థనల పేరిట పరిచయం పెంచుకున్నాడు. 2019 అక్టోబరులో ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు వేసి సెల్ఫోన్లో అసభ్యకరంగా ఫొటోలు తీశాడు. ఫొటోలు చూపించి కోరిక తీర్చాలని, లేదంటే సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేసి, పలుమార్లు లైంగికదాడి చేశాడు. ఇటీవల అతని వేధింపులు అధికం కావడంతో మానసికంగా నలిగిపోయిన భార్యను చూసి అనుమానం వచ్చిన భర్త నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. దీనిపై ఇనగుదురుపేట పోలీసులకు తనపై బలవంతంగా లైంగికదాడి చేశాడంటూ ఆమె ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇనగుదురుపేట పోలీసులు తెలిపారు. -
ప్రముఖ మత ప్రబోధకుడు బిల్లీ గ్రాహం కన్నుమూత
వాషింగ్టన్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మత ప్రబోధకుడు బిల్లీ గ్రాహం కన్నుమూశారు. 99 ఏళ్ల బిల్లీ గ్రాహం అమెరికా నార్త్ కరోలినాలో మోన్‌ట్రీట్‌లోని స్వగృహంలో బుధవారం తుదిశ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా ప్రొస్టేట్ క్యాన్సర్, పార్కిన్సన్, ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న బిల్లీ గ్రాహం మృతిచెందారని ఆయన అధికార ప్రతినిధి జెరేమీ బ్లూమ్ వెల్లడించారు. ఆయన మృతి పట్ల అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతాపం ప్రకటించారు. క్రైస్తవులతో పాటు ఇతర మతాల వాళ్లు ఓ మంచి వ్యక్తిని కోల్పోయారని ట్రంప్ పేర్కొన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా మత ప్రబోధకుడిగా బిల్లీ గ్రాహం విశేష సేవలు అందించారు. చివరి వరకు మానవ హక్కుల కోసం జరిగిన ప్రతి పోరాటంలోనూ ఆయన తనవంతు పాత్ర పోషించారు. ఆయన ప్రబోధాలను 185 దేశాల్లో మాట్లాడే 45 భాషల్లోకి అనువదించారు. -
సాగర్ హైవేపై ప్రయివేట్ బస్సు బోల్తా
► పది మంది పాస్టర్లకు స్వల్ప గాయాలు ► నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం యాచారం: సాగర్ హైవేపై ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో పది మంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా యాచారం సీఐ మదన్ మోహన్ రెడ్డి తెలిపిన వివరాలు...నగరంలోని ఆంధ్ర క్రిష్టియన్ జికల్ కాలేజీకి చెందిన 26 మంది పాస్టర్లు శనివా రం ఉదయం గాంధీనగర్ నుంచి ఓ ఓ ప్రైవేటు బస్సులో నాగార్జునసాగర్ విహారయాత్రకు వెళ్లారు. నగరానికి తిరిగి వస్తుండగా రాత్రి 8–45 గంటల సమయంలో యాచారం– గునుగల్ గేట్ల మధ్యన క్రీడా క్షేత్రం సమీపంలో బస్సు బొల్తా పడింది. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది పాస్టర్లకు స్వల్పగాయాలయ్యాయి. వారిని వెంటనే నగరంలోని వివిధ ఆస్పత్రులకు పంపించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
'తండ్రి వస్తేనే కొడుకును వదులుతాం..'
తమ చెరలో ఉన్న ఇస్సాక్‌ను విడుదల చేయాలంటే అతని తండ్రి పాస్టర్ కన్నయ్య తమ వద్దకు రావాల్సిందేనని మావోయిస్టులు అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు ఇస్సాక్ ఆచూకీ కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లి మావోయిస్టుల చేతిలో బందీలైన పాస్టర్లను ఆదివారం రాత్రి మావోయిస్టులు విడిచిపెట్టారు. అయితే చెర వీడిన పాస్టర్లు అటవీ ప్రాంతంలో అసలేం జరిగిందనే దానిపై నోరు మెదపడం లేదు. ఇస్సాక్ ఆచూకీ కోసం వెళ్లినపుడు మావోయిస్టులు ఎలా తారసపడ్డారు, ఏం మాట్లాడారు, ఇస్సాక్‌ను చూపించారా, ఎలాంటి హెచ్చరికలు చేశారనే దానిపై వారు వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. అయితే, తాము ముందు నుంచీ బందీ చేసిన ఇస్సాక్‌ను, పాస్టర్లను మావోయిస్టులు విడివిడిగా ఉంచినట్లు తెలిసింది. కాగా, కన్నయ్య వచ్చిన తర్వాత అతనితో మాట్లాడిన అనంతరం కొడుకుని విడుదల చేస్తామని, మరోసారి ఇస్సాక్‌విడుదల కోసం ఎవరూ మధ్యవర్తులుగా రావద్దని మావోయిస్టులు హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో ఇస్సాక్ భవితవ్యం ఇక అతని తండ్రిపైనే ఆధారపడి నట్లయింది. ఈ నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఆందోళన కుటుంబసభ్యుల్లో నెలకొంది. మరోవైపు మావోయిస్టులు కన్నయ్యకు అల్టిమేటం జారీచేస్తూ ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇస్సాక్‌ను అపహరించిన నాటి నుంచి కన్నయ్య ఆచూకీ లేకపోవడంతో మావోయిస్టులు లేఖలో ఏం రాశారనేది స్పష్టంగా తెలియరాలేదు.