
వాషింగ్టన్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మత ప్రబోధకుడు బిల్లీ గ్రాహం కన్నుమూశారు. 99 ఏళ్ల బిల్లీ గ్రాహం అమెరికా నార్త్ కరోలినాలో మోన్‌ట్రీట్‌లోని స్వగృహంలో బుధవారం తుదిశ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా ప్రొస్టేట్ క్యాన్సర్, పార్కిన్‌సన్, ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న బిల్లీ గ్రాహం మృతిచెందారని ఆయన అధికార ప్రతినిధి జెరేమీ బ్లూమ్ వెల్లడించారు. ఆయన మృతి పట్ల అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతాపం ప్రకటించారు. క్రైస్తవులతో పాటు ఇతర మతాల వాళ్లు ఓ మంచి వ్యక్తిని కోల్పోయారని ట్రంప్ పేర్కొన్నారు.
ఆరు దశాబ్దాలకు పైగా మత ప్రబోధకుడిగా బిల్లీ గ్రాహం విశేష సేవలు అందించారు. చివరి వరకు మానవ హక్కుల కోసం జరిగిన ప్రతి పోరాటంలోనూ ఆయన తనవంతు పాత్ర పోషించారు. ఆయన ప్రబోధాలను 185 దేశాల్లో మాట్లాడే 45 భాషల్లోకి అనువదించారు.