ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలి | APNRTS services should be taken advantage | Sakshi
Sakshi News home page

ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Published Fri, Sep 29 2023 2:45 AM | Last Updated on Fri, Sep 29 2023 2:45 AM

APNRTS services should be taken advantage  - Sakshi

కడప కార్పొరేషన్‌: ముఖ్యమంత్రి వైఎస్‌  జగన్‌­మోహన్‌­రెడ్డి మార్గనిర్దేశం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల కోసం ఏపీఎ­న్‌ఆర్‌­టీఎస్‌ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకో­వాలని వైఎస్సార్‌సీపీ గల్ఫ్‌ కన్వీనర్‌ బీహెచ్‌ ఇలి­యాస్‌ అన్నారు. అబుదాబిలో గురువారం ప్రముఖ పారి­శ్రా­మిక­­వేత్త మైనర్‌ బాబు ఆధ్వర్యంలో అబుదాబి ఐక్య తెలుగు క్రైస్తవ సంఘాల పాస్టర్స్‌ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇలియాస్‌ మాట్లాడుతూ కరోనా సమయంలో వివిధ దేశాల్లో ఉన్న వేలాది మంది తెలుగు­వారిని స్వదేశానికి తీసు­కు­వచ్చేందుకు ఏపీఎన్‌­ఆర్‌­టీఎస్‌ ద్వారా కేంద్ర విదే­శాంగ శాఖ మంత్రి, అధికారులతో మాట్లాడి వెసు­లు­బాటు కల్పించినట్లు గుర్తుచేశారు. ఉక్రె­యిన్, రష్యా యుద్ధ సమయంలో 918మంది, సుడాన్‌లో  అంతర్యుద్ధం సమయంలో 99 మంది తెలుగు విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి చేర్చా­మని వివరించారు.

ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్‌  సభ్యు­­రాలు వినీత మాట్లాడుతూ దివంగత వైఎస్సార్‌ ఆశయ సాధనకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని, అన్ని రంగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్‌ కల్పించార­న్నారు. ఏపీఎన్‌ఆర్‌­టీఎస్‌ యూఏఈ రీజ­నల్‌ కో ఆర్డినేటర్‌ ప్రసన్న సోమిరెడ్డి, వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ సయ్యద్‌ అక్రం మాట్లా­డుతూ ఏపీఎన్‌­ఆర్‌టీఎస్‌ ప్రవాసాంధ్ర భరోసా బీమాను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచి­ంచారు.

ఈ కార్య­క్రమంలో క్రైస్తవ సంఘాల అధ్య­క్షుడు ఫాదర్‌ శిశిర కుమార్, ఉపా­ధ్యక్షులు ఫాదర్‌ అగ్రిపా రాజుతో­పాటు నాయ­కులు జాఫర్‌ వలీ, రెడ్డెయ్యరెడ్డి, మోహన్, సయ్యద్‌ నాసర్, ఆనంద్, అబ్దుల్లా, అరుణ్, ఆశీర్వాదం, సంపత్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement