
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
గుర్తు తెలియని మృతదేహం లభ్యవైున సంఘటన శుక్రవారం ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోచోటు చేసుకుంది.
ఇబ్రహీంపట్నంరూరల్: గుర్తు తెలియని మృతదేహం లభ్యవైున సంఘటన శుక్రవారం ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోచోటు చేసుకుంది. ఆదిభట్ల సీఐ గోవింద్‌రెడ్డి కథనం ప్రకారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాదర్‌గుల్ కుర్మల్‌గూడ గ్రామం ఇందిరనగర్ కాలనీ పక్కన అనుమానస్పద స్థితిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యవైుంది.
మృతుడి వయస్సు 65–70 ఉండవచ్చని, మృతుడు యాచకుడై ఉంటాడని పోలీసులు గుర్తించారు. అనారోగ్యంతో మరణించి ఉంటాడని, పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు సీఐ గోవింద్‌రెడ్డి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.