సామాజిక సేవ అభినందనీయమని సిరిసిల్ల రూరల్ సిఐ శ్రీధర్ పేర్కొన్నారు. తెలంగాణ అవిర్భావ వేడుకల సందర్భంగా తంగళ్లపల్లి మండలంలోని రెండు వృద్ధాశ్రమాల్లో
సిరిసిల్లరూరల్ సీఐ శ్రీధర్
వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ
సిరిసిల్లరూరల్: సామాజిక సేవ అభినందనీయమని సిరిసిల్ల రూరల్ సిఐ శ్రీధర్ పేర్కొన్నారు. తెలంగాణ అవిర్భావ వేడుకల సందర్భంగా తంగళ్లపల్లి మండలంలోని రెండు వృద్ధాశ్రమాల్లో తంగళ్లపల్లి పోలీసుల ఆధ్వర్యంలో గురువారం బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని లగిశెట్టి విశ్వనాథం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో, టెక్స్‌టైల్ పార్క్ సమీపంలోని అ మ్మ వృద్ధాశ్రమంలో సిరిసిల్ల రూరల్ సిఐ పండ్ల పంపిణీ చేశారు. ఇంత మంది వృద్ధులను పోషిస్తున్న లగిశెట్టి శ్రీనివాస్‌ను, గడ్డం శ్రీనివాస్‌ను అభినందించారు. ఈ సేవలు కొనసాగించాలని కోరారు. పోలీసుల సహకారం ఎప్పుడు ఉంటుందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పోలీసు శాఖ ముందుండాలన్నారు. కార్యక్రమంలో సర్పంచులు లావణ్య, సునిత, ఎంపీటీసీలు నర్సయ్య, అనిత, మానస తదితరులు పాల్గొన్నారు.