అనంతపురం సెంట్రల్: ఖాళీగా ఉన్న సీఐ పోస్టులను భర్తీ చేస్తూ డీఐజీ ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్‌లో ఉన్న సీఐ శ్రీధర్‌ను కదిరి అర్బన్ సీఐగా నియమించారు. కదిరి అర్బన్‌లో పనిచేస్తున్న శ్రీనివాసులును పెనుకొండకు బదిలీ చేశారు. చిత్తూరు జిల్లా గంగవరం సీఐ రవికుమార్‌ను పుట్టపర్తి రూరల్ సర్కిల్‌కు బదిలీ చేశారు. కర్నూలు సీఐడీ విభాగంలో పనిచేస్తున్న చిన్నగౌస్‌ను ఉరవకొండ సీఐగా నియమించారు.