
సాక్షి, చెన్నై: మహిళను లైంగిక వేధింపులకు గురి చేసిన ఇన్‌స్పెక్టర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఇన్‌స్పెక్టర్ కన్యాకుమారి జిల్లా కుళచ్చల్ పరిధిలో గల పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ ఒకరు ఒక మహిళతో వీడియో కాలింగ్‌లో మాట్లాడుతుండగా అసభ్యమైన పదజాలంతో వేధింపులు గురి చేయడం ఇటీవల వాట్సాప్‌లో వైరల్ అయ్యింది. ఈ వీడియోలలో ఒక వీడియోలో ఇన్‌స్పెక్టర్ యూనిఫాంలో ఉంటూ మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతూ వచ్చారు. మరో వీడియోలో అతను బెడ్‌పై అర్ధనగ్నంగా పడుకుని అసభ్యచేష్టలు చేస్తూ కనిపించాడు. ఈ వీడియోను తిలకించిన పోలీసు అధికారులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇన్‌స్పెక్టర్ లీలలను వీడియో కాలింగ్ ద్వారా నమోదు చేసి విడుదల చేసిన మహిళ నాగర్‌కోవిల్ ప్రాంతానికి చెందినట్లు తెలిసింది.
విచారణ కోసం వెళ్లిన సమయంలో సదరు మహిళను చూసి ఆకర్షితుడైన ఇన్‌స్పెక్టర్ ఆమె నంబరు తీసుకుని తరచూ మాట్లాడేవారు. ఆ తరువాత క్రమక్రమంగా అసభ్యకరంగా మాట్లాడుతుండడంతో మహిళ ఆవేదనకు గురైంది. దీంతో ఈ వ్యవహారాన్ని ఆమె వాట్సాప్ ద్వారా విడుదల చేసినట్లు సమాచారం. ఈ వీడియో వ్యవహారం గురించి ఎస్పీ శ్రీనాథ్ విచారణకు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో దీనిపై విచారణ ముగించి విచారణ నివేదికను నెల్‌లై డీఐజీకి పంపారు. దీంతో ఇన్‌స్పెక్టర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment