vedio call
-
వీడియో కాలింగ్‌లో వేధింపులు: సీఐ సస్పెన్షన్
సాక్షి, చెన్నై: మహిళను లైంగిక వేధింపులకు గురి చేసిన ఇన్స్పెక్టర్ను అధికారులు సస్పెండ్ చేశారు. ఇన్స్పెక్టర్ కన్యాకుమారి జిల్లా కుళచ్చల్ పరిధిలో గల పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ ఒకరు ఒక మహిళతో వీడియో కాలింగ్‌లో మాట్లాడుతుండగా అసభ్యమైన పదజాలంతో వేధింపులు గురి చేయడం ఇటీవల వాట్సాప్‌లో వైరల్ అయ్యింది. ఈ వీడియోలలో ఒక వీడియోలో ఇన్స్పెక్టర్ యూనిఫాంలో ఉంటూ మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతూ వచ్చారు. మరో వీడియోలో అతను బెడ్‌పై అర్ధనగ్నంగా పడుకుని అసభ్యచేష్టలు చేస్తూ కనిపించాడు. ఈ వీడియోను తిలకించిన పోలీసు అధికారులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇన్స్పెక్టర్ లీలలను వీడియో కాలింగ్ ద్వారా నమోదు చేసి విడుదల చేసిన మహిళ నాగర్‌కోవిల్ ప్రాంతానికి చెందినట్లు తెలిసింది. విచారణ కోసం వెళ్లిన సమయంలో సదరు మహిళను చూసి ఆకర్షితుడైన ఇన్స్పెక్టర్ ఆమె నంబరు తీసుకుని తరచూ మాట్లాడేవారు. ఆ తరువాత క్రమక్రమంగా అసభ్యకరంగా మాట్లాడుతుండడంతో మహిళ ఆవేదనకు గురైంది. దీంతో ఈ వ్యవహారాన్ని ఆమె వాట్సాప్ ద్వారా విడుదల చేసినట్లు సమాచారం. ఈ వీడియో వ్యవహారం గురించి ఎస్పీ శ్రీనాథ్ విచారణకు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో దీనిపై విచారణ ముగించి విచారణ నివేదికను నెల్లై డీఐజీకి పంపారు. దీంతో ఇన్స్పెక్టర్ను అధికారులు సస్పెండ్ చేశారు. -
వాట్సాప్‌లోకి మరో కొత్త ఫీచర్
న్యూఢిల్లీ : వాయిస్ కాలింగ్, ఆ తర్వాత వీడియో కాలింగ్ వంటి ఫీచర్లతో ఆకట్టుకున్న వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. అదే గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్. ఇన్ని రోజులు ఇద్దరు వ్యక్తులకు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్‌ను, గ్రూప్‌లోని సభ్యులు కలిసి మాట్లాడుకునే విధంగా ఈ కొత్త ఫీచర్‌ను లాంచ్ చేయబోతుంది. గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ పేరుతో దీన్ని పరిచయం చేస్తోంది. డబ్ల్యూఏబీటా ఇన్ఫో ఈ ఫీచర్‌ను తొలుత స్పాట్ చేసింది. ఆండ్రాయిడ్‌లోని 2.17.443 వెర్షన్లో ఈ గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ ఉన్నట్టు సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్‌పై యాప్ కొత్త వెర్షన్ 2.18.39పై కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా దీన్ని ప్రవేశపెట్టనప్పటికీ, బీటా యూజర్లకు మాత్రం ఇది అందుబాటులో ఉన్నట్టు డబ్ల్యూబీటా ఇన్ఫో రిపోర్టు చేసింది. దీనికి సంబంధించి స్క్రీన్ షాట్‌ను కూడా ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది. వీడియో కాల్లో ఎక్కువ మందిని చేర్చడానికి పైన కుడివైపు ఓ ఆప్షన్ కూడా ఉన్నట్టు ఆ స్క్రీన్‌షాట్ తెలిపింది. మీరు, మరో వ్యక్తితో పాటు ముగ్గురు సభ్యులు ఈ గ్రూప్ వీడియో కాల్లో మాట్లాడుకునేలా ప్రస్తుతం ఈ ఫీచర్ పనిచేస్తుందని తెలిసింది. అయితే నాన్-బీటా యూజర్లకు ఈ ఫీచర్ ఎప్పుడు తీసుకొస్తుందో ఇంకా తెలియరాలేదు. కానీ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. WhatsApp beta for Android 2.18.39: new option to add participants in a group call 🔥 [***AVAILABLE IN FUTURE***] pic.twitter.com/XtAzxiSAhQ — WABetaInfo (@WABetaInfo) February 5, 2018 -
నీచుడు: భార్యను స్నేహితులతో కలిసి..
హైదరాబాద్: పాశ్చాత్య సంస్కృతి ప్రభావానికి లోనైన ఓ భర్త భార్యతో పైశాచికంగా ప్రవర్తించాడు. కంచన్‌బాగ్ బాబా నగర్లో దారుణం జరిగింది. ఓ మహిళను కట్టుకున్న భర్తే స్నేహితులకు సుఖం పంచాలని కోరాడు. వివరాల్లోకి వెలితే.. ఈ ప్రాంతానికి చెందిన ఎండీ సలీంకు 2016లో వివాహమయ్యింది. అనంతరం ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. అయితే నగరంలో ఉంటున్న తన భార్యకు రోజూ వీడియో కాల్ చేసేవాడు. ఈ సందర్భంగా భార్యను నగ్నంగా ఉండమనేవాడు. భర్త చెప్పడంతో కాదనలేక ఆమె అలాగే చేసింది. కానీ ఆ వీడియో సంభాషణను రికార్డు చేసి తన మిత్రులతో షేర్ చేసి ఆనందించేవాడు. అంతే కాకుండా కొన్ని రోజుల కిందట స్వదేశానికి వచ్చిన సలీం భార్యకు నిద్రమాత్రలు ఇచ్చి తన మిత్రుడు చాంద్‌తో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు కంచన్‌బాగ్ పోలీసులకు ఆదివారం రాత్రి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సలీంను అరెస్ట్ చేయగా చాంద్ పరారీలో ఉన్నాడు.