వాట్సాప్ వీడియో కాల్
న్యూఢిల్లీ : వాయిస్ కాలింగ్, ఆ తర్వాత వీడియో కాలింగ్ వంటి ఫీచర్లతో ఆకట్టుకున్న వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. అదే గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్. ఇన్ని రోజులు ఇద్దరు వ్యక్తులకు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్‌ను, గ్రూప్‌లోని సభ్యులు కలిసి మాట్లాడుకునే విధంగా ఈ కొత్త ఫీచర్‌ను లాంచ్ చేయబోతుంది. గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ పేరుతో దీన్ని పరిచయం చేస్తోంది. డబ్ల్యూఏబీటా ఇన్ఫో ఈ ఫీచర్‌ను తొలుత స్పాట్ చేసింది. ఆండ్రాయిడ్‌లోని 2.17.443 వెర్షన్‌లో ఈ గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ ఉన్నట్టు సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్‌పై యాప్ కొత్త వెర్షన్ 2.18.39పై కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే అధికారికంగా దీన్ని ప్రవేశపెట్టనప్పటికీ, బీటా యూజర్లకు మాత్రం ఇది అందుబాటులో ఉన్నట్టు డబ్ల్యూబీటా ఇన్ఫో రిపోర్టు చేసింది. దీనికి సంబంధించి స్క్రీన్ షాట్‌ను కూడా ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. వీడియో కాల్‌లో ఎక్కువ మందిని చేర్చడానికి పైన కుడివైపు ఓ ఆప్షన్ కూడా ఉన్నట్టు ఆ స్క్రీన్‌షాట్ తెలిపింది. మీరు, మరో వ్యక్తితో పాటు ముగ్గురు సభ్యులు ఈ గ్రూప్ వీడియో కాల్‌లో మాట్లాడుకునేలా ప్రస్తుతం ఈ ఫీచర్ పనిచేస్తుందని తెలిసింది. అయితే నాన్-బీటా యూజర్లకు ఈ ఫీచర్ ఎప్పుడు తీసుకొస్తుందో ఇంకా తెలియరాలేదు. కానీ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
WhatsApp beta for Android 2.18.39: new option to add participants in a group call 🔥 [***AVAILABLE IN FUTURE***] pic.twitter.com/XtAzxiSAhQ
— WABetaInfo (@WABetaInfo) February 5, 2018
Comments
Please login to add a commentAdd a comment