
చిత్తూరు, నిండ్ర:‘ఏయ్.. ఎక్కడికెళ్లి వస్తున్నారు? ఒక గ్రా మం వాళ్లు ఇంకో గ్రామంలో తిరగద్దండి. వేరే గ్రామాల్లోకి వెళ్తే కేసులు నమోదు చేస్తా’ అంటూ నగరి సీఐ మల్లికార్జున వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మండలంలోని కొప్పేడు దళితవాడలో ఎమ్మెల్యే రోజా బుధవారం వైఎస్సార్‌సీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకులు వెళ్లారు. తిరిగి స్వగ్రామాలకు వెళ్తున్న వారి వాహనాలను నగరి సీఐ మల్లికార్జున గుప్తా మార్గమధ్యలో నిలిపారు. ఎక్కడికి వెళ్లి వస్తున్నారని బెదిరింపులకు దిగారు. ఎమ్మెల్యే రోజా కార్యక్రమానికి వెళ్లినట్టు చెప్పడంతో సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు మీ గ్రామంలోనే ఉండాలి. మరో గ్రామానికి వెళ్తే కేసులు నమోదు చేస్తా’ అని హెచ్చరించారు. వేరే గ్రామాల్లో తిరగవద్దని చెప్పే హక్కు సీఐకి ఎవరిచ్చారని నేతలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment