రైల్వేకోడూరు పరిసర ప్రాంతాలలో కార్లు దొంగతనం చేస్తున్న రంపా వినోద్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు రైల్వేకోడూరు ఇన్‌చార్జి సీఐ మోహనకష్ణ తెలిపారు. నిందితుడి నుంచి ఒక కారు, ఒక ఆటో, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రైల్వేకోడూరు రూరల్: రైల్వేకోడూరు పరిసర ప్రాంతాలలో కార్లు దొంగతనం చేస్తున్న రంపా వినోద్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు రైల్వేకోడూరు ఇన్‌చార్జి సీఐ మోహనకష్ణ తెలిపారు. నిందితుడి నుంచి ఒక కారు, ఒక ఆటో, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక పోలీసుస్టేషనులో సీఐ శనివారం వివరాలు వెల్లడించారు. రైల్వేకోడూరులో ఒక కారు దొంగతనానికి గురైందని ఇటీవల కేసు నమోదు అయిందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశామన్నారు. తమకు వచ్చిన సమాచారం మేరకు రాజంపేటకు చెందిన అతనిని రైల్వేకోడూరు పాతబస్టాండులోని ఎన్‌టీఆర్ విగ్రహం సమీపంలో పట్టుకున్నామని చెప్పారు. నిందితుడు రైల్వేకోడూరులో ఓ కారు, ఓ ద్విచక్ర వాహనం, చక్రంపేటలో ఒక ద్విచక్ర వాహనం, నెల్లూరులో ఒక ద్విచక్ర వాహనం, అనంతపురంలో ఒక ఆటో దొంగతనం చేశాడని, వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ సుమారు రూ. 10 లక్షలు ఉంటుందని వివరించారు. సమావేశంలో ఎస్సైలు వెంకటేశ్వర్లు, భక్తవత్సలం, కానిస్టేబుల్‌లు ఉదయ్, ఈశ్వర్ పాల్గొన్నారు.