జమ్మలమడుగు: పట్టణంలోని బైపాస్ రోడ్డునుంచి అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 17దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు మంగళవారం సాయంత్రం స్థానిక అర్బన్ సీఐ శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం ఉదయం బైపాస్‌రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు వాహనాలు వేగంగా వస్తుండటంతో వాటిని ఆపే ప్రయత్నం చేశామన్నారు. వారు వాహనాలతో తమన ఢీకొట్టాలని చూశారన్నారు. తాము అప్రమత్తమై ఇద్దరిని పట్టుకుని వారి వాహనంలో ఉన్న దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దుంగల రవాణాలో బెంగళూరుకు చెందిన కుప్పుస్వామి శర్వాన్, రాజంపేటకు చెందిన సుబ్రమణ్యంలు ప్రధాన సూత్రదారులుగా గుర్తించి వారిని పట్టుకున్నామన్నారు. వీరు బెంగళూరుకు చెందిన షమీర్ అనే వ్యక్తితో సంబంధాలు పెట్టుకుని ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ కేసులో మరో ఎనిమిది మందిని అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ నాగరాజు, పోలీసులు పాల్గొన్నారు
ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్్ట
Published Tue, Nov 22 2016 10:59 PM | Last Updated on Sat, Aug 11 2018 8:15 PM
Advertisement
Advertisement