![CI Car Driver attempt to Rape Girl in Guntur - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/10/attempt-to-Rape.jpg.webp?itok=AA9P3AZg)
సాక్షి, గుంటూరు : మహిళలు, బాలికలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరు నగరంలో మైనర్ బాలికపై సీఐ కారు డ్రైవర్ అత్యాచారయత్నం చేయబోయాడు. ఆ కామాంధుడి చర్యతో బెంబేలెత్తిపోయిన బాలిక గట్టిగా కేకలు వేసింది. దీంతో పట్టాభిపురం సీఐ కారు డ్రైవర్ జానీ బాలికను వదిలేసి పారిపోయాడు. ఈ ఘటనపై బాధిత బాలిక నల్లపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. సీఐ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ.. బాధ్యతాయుతంగా మెలగాల్సిన వ్యక్తే.. ఇలా బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment