శ్రీశైలం తాత్కాలిక సీఐగా పార్థసారధి
Published Fri, Feb 3 2017 12:42 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
కర్నూలు: శ్రీశైలం సీఐ మధుసూదన్‌రావు స్థానంలో కర్నూలు డీసీఆర్‌బీలో ఉన్న పార్థసారధి నియమితులయ్యారు. ఈ మేరకు ఎస్పీ ఆకే రవికృష్ణ ఆదేశాలు జారీ చేశారు. 1998 బ్యాచ్‌కు చెందిన ఈయన పాములపాడు, ఆలూరు ప్రాంతాల్లో ఎస్‌ఐగా పనిచేశారు. 2011లో సీఐగా పదోన్నతి పొంది సీఐడీకి బదిలీ అయ్యారు. ఆదోని త్రీటౌన్, మహిళా పీఎస్, కర్నూలు మహిళా పీఎస్‌లో పనిచేశారు. ప్రస్తుతం డీసీఆర్‌బీ నుంచి ఆయనను శ్రీశైలానికి నియమిస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో సీఐగా పనిచేసిన విజయ్‌కృష్ణపై అవినీతి ఆరోపణలు రావడంతో ఓఎస్‌డీ రవిప్రకాష్ చేత విచారణ జరిపించారు. ఆరోపణలు రుజువు కావడంతో వీఆర్‌కు బదిలీ చేశారు. మధుసూదన్‌రావు నెల రోజుల పాటు శ్రీశైలం తాత్కాలిక సీఐగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం ఐజీ కార్యాలయం లైజనింగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. జనవరి 21న చేపట్టిన బదిలీల్లో భాగంగా బేతంచర్ల నుంచి సీసీఎస్‌కు(అటాచ్) బదిలీ అయిన ఆర్.సుబ్రహ్మణ్యంకు పార్థసారధి స్థానంలో డీసీఆర్‌బీకి నియమిస్తూ ఎస్పీ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు పార్థసారధి, సుబ్రహ్మణ్యం వారికి కేటాయించిన స్థానాల్లో గురువారం విధుల్లో చేరారు.
Advertisement