
సెల్ టవర్ ఎక్కి.. వ్యక్తి హల్ చల్!
సిద్దిపేట: ఓ వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలోని కోహెడ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల వేధింపులకు నిరసనగా మండలంలోని రాంచంద్రపూర్ గ్రామానికి చెందిన బత్తుల రాజు కోహెడలో ఆదివారం ఉదయం సెల్ టవర్ ఎక్కాడు. భూ వివాదంలో తనపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించాడు. సీఐ శ్రీనివాస్ అక్కడికి వచ్చి బాధితుడు రాజుకు హామీ ఇవ్వడంతో అతను సెల్ టవర్ పై నుంచి కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.