శ్రీశైలం తాత్కాలిక సీఐగా మధుసూదన్‌రావు
కర్నూలు: శ్రీశైలం సీఐ విజయకృష్ణ స్థానంలో వీఆర్‌లో ఉన్న మధుసూదన్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. 1995 బ్యాచ్‌కు చెందిన ఈయన గతంలో జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం ఫ్యాక‌్షన్ జోన్‌లో సీఐగా పని చేశారు. కర్నూలు తాలుకా సీఐగా సుమారు మూడు సంవత్సరాలు పని చేశారు. పదవీ కాలం పూర్తి కావడంతో గత ఏడాది మార్చిలో ఆయన వీఆర్‌కు బదిలీ అయ్యారు. పది నెలల అనంతరం మళ్లీ ఆయనను శ్రీశైలం సర్కిల్‌కు నియమితులయ్యారు. విజయకృష్ణను వారం రోజుల క్రితం విధుల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీఎస్పీ మైదానంలో జరుగుతున్న ఎస్‌ఐ దేహధారుఢ్య పరీక్షల వద్ద ఆయన విధులు నిర్వహిస్తున్నారు. వీఆర్‌లో ఉన్న మరో 14 మంది సీఐలు పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు.