
డ్రైవర్లతో ముఖం కడిగించి వారిలో అవగాహన కల్పిస్తున్న పోలీసులు
తణుకు: వాహన డ్రైవర్లకు తగిన విశ్రాంతి లేకపోవడంతోనే ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని తణుకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.ఎ.స్వామి పేర్కొన్నారు. బుధవారం రాత్రి తణుకు పట్టణ పరిధిలోని పదహారో నెంబరు జాతీయ రహదారిపై వాష్ అండ్ గో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల డ్రైవర్లకు నిద్ర మత్తు లేకుండా ముఖం కడుక్కుని టీ తాగి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లేలా వారిలో అవగాహన కల్పించారు. ఉండ్రాజవరం జంక్షన్‌తో పాటు శర్మిష్ట సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ, ట్రాఫిక్ ఎస్సై ఎం.బాల, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment