పుష్కరాలకు పెరుగుతున్న రద్దీ
పుష్కరాలకు పెరుగుతున్న రద్దీ
Published Wed, Aug 17 2016 11:41 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పుష్కరాలు బుధవారం నాటికి ఆరు రోజలు పూర్తయ్యాయి. ఈ నెల 12 నుంచి పుష్కరాలు ప్రారంభంకాగా మొదటి రెండు రోజుల పాటు భక్తులు నామమాత్రంగా తరలివచ్చారు. శని, ఆది,సోమ వారాలు సెలవు దినాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ప్రధాన ఘాట్లన్నీ జనసందోహంతో కిక్కిరిసి పోయాయి. ఈ నెల 12 నుంచి 17 వరకు వాడపల్లి, మట్టపల్లి, నాగార్జునసాగర్‌లో 12 లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యధికంగా నాగార్జునసాగర్‌కు 5.57 లక్షల మంది వచ్చారు. సినీ, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు చేసి పునీతులయ్యారు. పుష్కరాల ముగింపునకు మరో ఆరురో జుల వ్యవధి మాత్రమే ఉండటంతో బుధవారం నాడు ఘాట్ల వద్ద భక్తుల రద్దీ పెరిగినట్లు కనిపించింది. పానగల్లు, దర్వేశిపురం, కాచరాజుపల్లి ఘాట్ల వద్దకు కూడా భక్తులు వేల సంఖ్యలో వచ్చారు.
భక్తుల రద్దీ..
ఆరో రోజు సుమారు మూడున్నర లక్షల మంది భక్తులు 28 ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించారు. అది కూడా నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లిలో మాత్రమే 2,64,737 మంది భక్తులు స్నానాలు చేయగా, మిగిలిన అన్ని చోట్లా కలిపి 85 వేల మంది భక్తులు స్నానమాచరించారు. ఎప్పటిలాగే సాగర్ శివాలయం ఘాట్‌కు 80 వేల మంది, సురికి వీరాంజనేయ స్వామి ఘాట్‌లో 34 వేల మంది వరకు స్నానాలు చేసినట్లు అంచనా. మట్టపల్లిలో 38 వేలు, వాడపల్లిలో 85 వేలపై చిలుకు, కనగల్ మండలం దర్వేశిపురం ఘాట్‌లో 19,500, నేరేడుచర్ల మహంకాళి గూడెం ఘాట్‌లో 15 వేల మంది స్నానాలు చేశారు. బ్యాక్ వాటర్ పరిధిలో ఉన్న చందంపేట మండలం కాచరాజుపల్లి ఘాట్‌కు 7,100, పానగల్లు ఘాట్‌కు 5 వేల మంది భక్తులు వచ్చారు. ఇక పీఏపల్లి మండలం అజ్మాపూర్, మేళ్వచెర్వు మండలం బుగ్గ మాదారం, కిష్టాపురం, మేళ్వచెర్వు, కనగల్ ఘాట్, వాడపల్లిలోని లక్ష్మీ నరసింహస్వా మి ఘాట్, ఓల్డ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఘాట్, ముదిమాణిక్యం, లక్ష్మీపురం, మెట్లరేవు, అయ్యప్పటెంపుల్, ముదిరాజ్ ఘాట్లకు భక్తులు వందల సంఖ్యలోనే వచ్చారు.
ప్రముఖులు హాజరు..
సినీ, రాజకీయ, విద్యా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు బుధవారం వివి«ధ ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అడవిదేవులపల్లిలో ఎమ్మెల్సీ పూలరవీందర్, వాడపల్లిలో లోకాయుక్త ఆనంద రెడ్డి, నాగార్జునసాగర్‌లో మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి , విద్యాసంస్థ లకు చెందిన పదిహేను వందల మంది విద్యార్థులు, వీరితో పాటు సినీ హాస్యనటుడు వేణు మాధవ్, బీజేపీ నాయకులు సీఎల్.రాజం దంపతులు మట్టపల్లిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
Advertisement
Advertisement