Published
Tue, Jul 26 2016 7:10 PM
| Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
పుష్కరాల విజయవంతానికి సహకరించాలి
మట్టపల్లి (మఠంపల్లి): మండలంలోని మట్టపల్లి వద్ద ఆగస్టు 12 నుంచి 23 వరకు జరిగే కృష్ణా పుష్కరాలకు స్థానికంగా ఉన్న అన్ని వర్గాలు, శాఖలు సహకరించాలని తహసీల్దార్ యాదగిరి, ఎస్‌ఐ ఆకుల రమేశ్ కోరారు. మంగళవారం మట్టపల్లిలోని ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రంలో వివిధ కులాల అన్నదాన సత్ర కమిటీలతో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. పుష్కరాల విజయవంతానికి దేవస్థానం, అన్నదానసత్రాలు, స్థానిక గ్రామపంచాయతీ, ఆర్టీసీ తదితర శాఖలు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా అన్నదాన సత్ర కమిటీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరు మట్టపల్లిరావు, ఈఓ ఎంపీ లక్ష్మణరావు, సర్పంచ్ శ్రీనివాసరావు, ఆర్‌ఐ శైలజ, చల్లా రామ్మూర్తి, దాసా నాగేశ్వరరావు, తండు వెంకటరత్నంగౌడ్, ఎన్.అంజయ్యగౌడ్, ఎ.శౌరెడ్డి, పి.రామారావు, ఎం.వెంకటేశ్వర్లు, మట్టపల్లిరావు, గిరిబాబు, చంద్రశేఖరశర్మ, అశోక్, ఎం.ఎం. యాదవ్, మాల్యాద్రి, బుచ్చయ్య, అనంతరాములు, రమేష్, కార్యదర్శి గురవయ్య, వీఆర్‌ఓ వెంకటరామారావు పాల్గొన్నారు.