పూర్తికావస్తున్న ఊట్లపల్లి ఘాట్
పెద్దవూర : ఊట్లపల్లి పుష్కర ఘాట్ పనులు పూర్తికావస్తున్నట్లుగా ఘాట్ ఇన్‌చార్జి అధికారి, డిండి ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రభాకర శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన ఘాట్‌ను సందర్శించారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి పనులు పూర్తవుతాయని అన్నారు. ఈ నెల 5వ తేదీ లోపు పనులు మొత్తం పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట దేవరకొండ బస్ డిపో మేనేజర్ రమేశ్, మేరెడ్డి జైపాల్‌రెడ్డి ఉన్నారు.