కృష్ణా పుష్కరాలకు భారీ బందోబస్తు | full security for krishna pushkar | Sakshi
Sakshi News home page

కృష్ణా పుష్కరాలకు భారీ బందోబస్తు

Published Thu, Aug 11 2016 12:05 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

కృష్ణా పుష్కరాలకు భారీ బందోబస్తు

కృష్ణా పుష్కరాలకు భారీ బందోబస్తు

మఠంపల్లి :
 కృష్ణానది పుష్కరాల్లో శాంతి భద్రతల పర్యవేక్షణకు 8,500 మంది పోలీసులు,వలంటీర్లు, స్వచ్ఛంద సంఘాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు  ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన మఠంపల్లిలో పోలీస్‌ సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 28 ఘాట్ల పరిధిలో 6 వేల మంది పోలీసులు, మరో 2500 మంది స్వచ్ఛంద వలంటీర్లతో బందోబస్తుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా 28 ఘాట్ల వద్ద ప్రతి 20కిలో మీటర్లకు ఒక పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం తిరుగుతుందన్నారు. కృష్ణాపుష్కరాల విజయవంతానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  శాంతి భద్రతల పరిరక్షణకు విధిగా కృషి చేయాలన్నారు.  సమావేశంలో డీఎస్పీ సునితామోహన్, సీఐ నర్సింహారెడ్డి, ఎస్‌ఐలు రమేష్, రంజిత్‌రెడ్డి, ఆర్‌కె.రెడ్డి, గోపితదితరులున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement