సంచలనాత్మక కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ విజయం అసామాన్యమైనదిగా, వ్యక్తిగతంగా ఎంతో అపూర్వమైనదిగా అభివర్ణించారు. ఎండకు వెరవకుండా.. కష్టాన్ని లెక్కచేయకుండా.. బీజేపీని అతి పెద్ద పార్టీగా నిలబెట్టడంలో అహర్నిశలూ శ్రమించిన కర్ణాటక కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నానని, కర్ణాటక సమగ్ర అభివృద్ధిలో బీజేపీ తన సంపూర్ణ పాత్రను నిర్వహిస్తుందని అన్నారు.