
వీడియో కాన్పరెన్స్‌లో నరేంద్ర మోదీ(పాత చిత్రం)
ఢిల్లీ: బీజేపీ ఎంపీలతో నమో యాప్ ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తమకు సంబంధం లేని విషయాలపై మాట్లాడకూడదని పార్టీ నేతలకు సూచించారు.అధీకృత పార్టీ ప్రతినిధులు మాత్రమే సంబంధిత అంశాలపై మాట్లాడాలని వెల్లడించారు.మీడియాతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచన చేశారు. మీడియాకు మసాలా అందించి, వక్రీకరించారని చెప్పడంలో అర్థం లేదన్నారు.రేప్ ఘటనలు, మహభారత్, ఉగ్రవాదం అంశాలపై తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని ఇబ్బందికి గురి చేసే వారి నోటికి తాళం వేయాలని ప్రధాని, ఎంపీలకు సంకేతాలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment