
కోల్‌కతా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్’ ప్రధాని అభ్యర్ధిగా ఎవరి పేరును ప్రకటించడం లేదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ముందుగానే చేసే అటువంటి ప్రకటన ప్రాంతీయ పార్టీలున్న తమ కూటమిలో విభేదాలకు బీజం వేస్తుందని, బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలన్న లక్ష్యాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు.
శుక్రవారం కోల్‌కతాలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ)నేత ఒమర్ అబ్దుల్లాతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘దేశ క్షేమం కోసం బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయి. ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకే అభ్యర్ధిని బరిలోకి దించుతాయి. బీజేపీ నియంత పాలనకు వ్యతిరేకంగా త్యాగాలకు సిద్ధంగా ఉన్నాం’ అని ఒమర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment