నెహ్రూ-మోదీ (జత చేయబడిన చిత్రాలు)
సాక్షి, న్యూఢిల్లీ ; గూగుల్‌లో చోటు చేసుకున్న ఓ తప్పిదంపై సెటైర్లు పేలుతున్నాయి. భారత దేశ తొలి ప్రధాని ఎవరు అన్న సమాధానానికి నెహ్రూకి సంబంధించిన సమాచారం రాగా.. ఫోటో మాత్రం నరేంద్ర మోదీది ప్రత్యక్షం కావటంతో చాలా మంది కంగుతున్నారు. అయితే అది వైరల్ కావటం.. అదే సమయంలో విమర్శలకు దారితీయటం జరిగింది. దీంతో పొరపాటున గమనించిన గూగుల్.. ఆ తప్పిదాన్ని సరిచేసుకుంది.
ఇక ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ ప్రతినిధి దివ్య స్పందన స్పందించారు. గూగుల్ ఇండియా.. ఏ ప్రతిపాదికన ఇలా చేశారు? అంటూ ఆమె ట్వీట్‌లో మండిపడ్డారు. మరోవైపు ప్రముఖ జాతీయ ఛానెళ్లలో కూడా ఈ తప్పిదంపై కథనాలు ప్రసారం అయ్యాయి. మరికొందరు సోషల్ మీడియాలో దీనిని ట్రోల్ చేస్తూ గూగుల్‌పై సెటైర్లు వేస్తున్నారు.
.@Google @GoogleIndia what algorithm of yours allows this?! You’re so full of junk- pic.twitter.com/GHyxh3fEWm
— Divya Spandana/Ramya (@divyaspandana) 25 April 2018
When we search "India first PM" on Google, Narendra Modi image appears. Why?
— I_am (@thenagawalrus) 25 April 2018
Surprised seeing the result of Ist PM pic in google search as "India first PM" @narendramodi @akashbanerjee @atanubhuyan @tulika_devi @pranaybordoloi #IndiafirstPM #google pic.twitter.com/5uhnLlTlJc
— Afrida Hussain (@afrida786) 25 April 2018
Comments
Please login to add a commentAdd a comment