బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో లౌకిక కూటమి తరుపున ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దించేందుకు జేడీయూ సిద్ధమైంది. ఇప్పటికే ఆయనను ప్రధానిగా ప్రమోట్ చేస్తూ జేడీయూ అధికారికంగా ముందుకెళుతోంది. దేశంలో లౌకిక శక్తులన్నీ ఏకమై నితీశ్ నాయకత్వంలో ఎన్నికల్లోకి వెళ్లాలని, ఆయనకు ప్రధాని బాధ్యతలు కట్టబెట్టాలని జేడీయూ కోరింది.