న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య పరస్పర సహకారంపై నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహాల్ (ప్రచండ)తో భారత ప్రధాని మోదీ శనివారం చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య మైత్రి బంధాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించామని ఆ తర్వాత ప్రధాని మోదీ చెప్పారు.
ఈ మేరకు శనివారం ఇద్దరు నేతలు కొంతసేపు ఫోన్‌లో సంభాíÙంచుకున్నారు. ‘మే 31 నుంచి జూన్ మూడో తేదీ వరకు భారత్‌లో పర్యటించిన నేపాల్ ప్రధాని ప్రచండతో మోదీ పలు ద్వేపాక్షిక అంశాలపై చర్చించారు’ అని ఆ తర్వాత ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదలచేసింది. పొరుగు దేశం నేపాల్‌ను భారత్ చిరకాలంగా మిత్రదేశంగా పరిగణిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment