న్యూఢిల్లీ: శనివారం నుంచి ప్రధాని మోదీ కువైట్‌లో రెండ్రోజులపాటు పర్యటించనున్నారు. గత 43 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు ఈ గల్ఫ్ దేశంలో పర్యటనకు వెళ్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జబీర్ అల్ సబాహ్ ఆహ్వానం మేరకు ఇండియా, కువైట్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని పర్యటిస్తున్నారని భారత విదేశాంగ శాఖ బుధవారం పేర్కొంది.
పర్యటనలో భాగంగా మోదీ కువైట్ పాలకులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అక్కడ భారతీయ సంతతి వ్యక్తులతో భేటీ కానున్నారు. చివరిసారిగా 1981లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ కువైట్‌లో పర్యటించారు. కువైట్, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2023–24లో ఏకంగా 10.47 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment