ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ పర్యటన ప్రారంభం
నేడు ద్వైపాక్షిక చర్చలు
కీలక రంగాల్లో ఒప్పందాలకు అవకాశం
43 ఏళ్ల తర్వాత కువైట్‌లో కాలుమోపిన భారత ప్రధాని
కువైట్ సిటీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం గల్ఫ్ దేశమైన కువైట్‌కు చేరుకున్నారు. కువైట్ రాజు షేక్ మెషల్ అల్–అహ్మద్ అల్–జబేర్ అల్–సబా ఆహా్వనం మేరకు ఆయన కువైట్‌లో అడుగుపెట్టారు. భారతదేశ ప్రధానమంత్రి కువైట్‌లో పర్యటిస్తుండడం గత 43 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం. రాజధాని కువైట్ సిటీలోని ఎయిర్‌పోర్టులో నరేంద్ర మోదీకి కువై ట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్–సబాతోపాటు పలువురు మంత్రు లు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికా రు. రెండు రోజుల పర్యటనలో మోదీ కువైట్ పాలకులతో భేటీ కానున్నారు.
వివిధ కీలక రంగాల్లో భారత్–కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా చర్చలు జరుపనున్నారు. అలాగే పలు ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకొనే అవకాశం ఉంది. కువైట్‌కు చేరుకున్న తర్వాత మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తన పర్యటన రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి దో హదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వేర్వేరు రంగాల్లో భారత్, కువైట్ పరస్పరం స హకరించుకుంటూ కలిసికట్టుగా ముందడుగు వేయాలన్నదే తమ లక్ష్యమని వివరించారు.
కు వైట్ నాయకులను కలుసుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. మో దీ ఆదివారం ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఇదిలా ఉండగా, 1981లో అప్పటి భారత ప్రధా ని ఇందిరా గాంధీ కువైట్‌లో పర్యటించారు. ఆ తర్వాత కువైట్‌లో అడుగుపెట్టిన మొదటి ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డుకెక్కారు.
ప్రపంచ నైపుణ్య రాజధానిగా ఎదిగే సత్తా భారత్‌కు ఉందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఆయన శనివారం కువైట్ సిటీలో ‘హలా మోదీ’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కువైట్‌లో నివసిస్తున్న భారతీయులు హాజరయ్యారు. వారిని ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ప్రపంచ ప్రగతిలో మన భారతీయులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.
ప్రతిఏటా వందలాది మంది భారతీయులు కువైట్‌కు వస్తున్నారని, ఇక్కడ భారతీయతను చాటిచెబుతున్నారని పేర్కొన్నారు. కువైట్ అనే చిత్రానికి భారతీయ నైపుణ్యాలు అనే రంగులద్దుతున్నారని వివరించారు. భారతీయ ప్రతిభ, సాంకేతికతను కువైట్ సంప్రదాయంతో మేళవిస్తున్నారని చెప్పారు. కువైట్ దేశం మినీ–హిందుస్తాన్‌గా పేరుగాంచిందని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment