తెలుగు విద్యార్థినికి మోదీ ప్రశంస | Narendra Modi hails telugu student who collected relief fund for JK victims | Sakshi
Sakshi News home page

తెలుగు విద్యార్థినికి మోదీ ప్రశంస

Published Mon, Oct 27 2014 4:40 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

తెలుగు విద్యార్థినికి మోదీ ప్రశంస - Sakshi

తెలుగు విద్యార్థినికి మోదీ ప్రశంస

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ వరద బాధితుల కోసం విరాళాలు సేకరించిన తెలుగు విద్యార్థిని దువ్వూరి రోహిణి ప్రత్యూషను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. కువైట్ లోని భారతీయ విద్యాభవన్ లో 12వ తరగతి చదువుతున్న రోహిణి వరద బాధితుల కోసం రూ.2.15 లక్షలు సేకరించి భారత రాయబార కార్యాలయానికి అందజేసింది.

తరగతులు ముగిసిన తర్వాత కువైట్ లోని భారతీయుల ఇళ్లకు వెళ్లి ఆమె విరాళాలు సేకరించింది. రోహిణి అందజేసిన విరాళాన్ని భారత ఎంబసీ- ప్రధాని సహాయనిధికి పంపింది.

కాగా రోహిణి చేసిన మంచి పనిని ప్రధాని మోదీ ప్రశంసిస్తూ ఆమెకు లేఖ రాశారు. ఇతరులకు సహాయం చేసేందుకు రోహిణి చూపిన చొరవ ప్రశంసనీయని పేర్కొన్నారు. రోహిణి నాయకత్వం, సంస్థాగత సామర్థ్యం, వరద బాధితుల పట్ల స్పందించిన తీరును మోదీ కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement