అరబిక్‌లో రామాయణ భారతాలు..అనువాదకులతో ప్రధాని భేటీ | PM Modi Meets Ramayana Mahabharata Translators In Kuwait | Sakshi
Sakshi News home page

అరబిక్‌లో రామాయణ భారతాలు..అనువాదకులతో ప్రధాని భేటీ

Published Sat, Dec 21 2024 7:14 PM | Last Updated on Sat, Dec 21 2024 7:31 PM

PM Modi Meets Ramayana Mahabharata Translators In Kuwait

కువైట్‌సిటీ: ప్రధాని మోదీ కువైట్‌ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం(డిసెంబర్‌21) రామాయణ మహాభారతాలను అరబిక్‌లో అనువదించిన అబ్దుల్లా అల్ బరూన్,ఈ ఇతిహాసాల అరబిక్ వెర్షన్‌లను ప్రచురించిన అబ్దుల్ లతీఫ్ అల్ నెసెఫ్‌లను కలిశారు. తనకు రామాయణమహాభారతాలను అరబిక్‌లో అనువదించేందుకు రెండు సంవత్సరాల 8 నెలలు పట్టిందని అల్‌ బరూన్‌ అన్నారు. 

తాము ప్రచురించిన అరబిక్‌ రామాయణ మహాభారత పుస్తకాలను ప్రధాని మోదీ చూసి సంతోషించారని,రెండు పుస్తకాలపై ఆయన సంతకం చేశారని ప్రచురణకర్త అబ్దుల్‌లతీఫ్‌ అల్‌నెసెఫ్‌ చెప్పారు. అల్‌బరూన్‌,అల్‌నెసెఫ్‌ ప్రపంచంలోని ముప్పై దాకా గొప్ప కావ్యాలను అరబిక్‌లో ప్రచురించారు. 

43 ఏళ్లలో భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. కువైట్‌లో ప్రధాని రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గతంలో ప్రధాని మన్‌కీబాత్‌లో కూడా అరబిక్‌లో రామాయణ మహాభారతాలను అనువదించిన ఇద్దరి గురించి ప్రస్తావించడం గమనార్హం. 

 మా తాతను కలవండని ఓ నెటిజన్‌ విజ్ఞప్తి.. కలిసిన ప్రధాని 

ప్రధాని మోదీ కువైట్‌ పర్యటన నేపథ్యంలో కువైట్‌లో ఉంటున్న తన తాత,రిటైర్డ్‌ ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌ ఉద్యోగి మంగళ్‌ సేన్‌ హండా (101)ను కలవండని ఎక్స్‌(ట్విటర్‌)లో ఓ నెటిజన్‌ ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. ఆయనను తప్పకుండా కలుస్తానని బదులిచచ్చిన మోదీ కువైట్‌ చేరుకున్న అనంతరం మంగల్‌సేన్‌హండాను కలిశారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement