mahabharata
-
అరబిక్‌లో రామాయణ భారతాలు..అనువాదకులతో ప్రధాని భేటీ
కువైట్సిటీ: ప్రధాని మోదీ కువైట్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం(డిసెంబర్21) రామాయణ మహాభారతాలను అరబిక్‌లో అనువదించిన అబ్దుల్లా అల్ బరూన్,ఈ ఇతిహాసాల అరబిక్ వెర్షన్లను ప్రచురించిన అబ్దుల్ లతీఫ్ అల్ నెసెఫ్‌లను కలిశారు. తనకు రామాయణమహాభారతాలను అరబిక్‌లో అనువదించేందుకు రెండు సంవత్సరాల 8 నెలలు పట్టిందని అల్ బరూన్ అన్నారు. తాము ప్రచురించిన అరబిక్ రామాయణ మహాభారత పుస్తకాలను ప్రధాని మోదీ చూసి సంతోషించారని,రెండు పుస్తకాలపై ఆయన సంతకం చేశారని ప్రచురణకర్త అబ్దుల్లతీఫ్ అల్నెసెఫ్ చెప్పారు. అల్బరూన్,అల్నెసెఫ్ ప్రపంచంలోని ముప్పై దాకా గొప్ప కావ్యాలను అరబిక్‌లో ప్రచురించారు. 43 ఏళ్లలో భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. కువైట్‌లో ప్రధాని రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గతంలో ప్రధాని మన్‌కీబాత్‌లో కూడా అరబిక్‌లో రామాయణ మహాభారతాలను అనువదించిన ఇద్దరి గురించి ప్రస్తావించడం గమనార్హం. #WATCH | Kuwait | Ramayana and Mahabharata published in Arabic language; Abdullateef Alnesef, the book publisher and Abdullah Baron, the translator of Ramayana and Mahabharata in the Arabic language, met PM Narendra Modi in Kuwait CityAbdullateef Alnesef, the book publisher… pic.twitter.com/jO3EqcflXJ— ANI (@ANI) December 21, 2024 మా తాతను కలవండని ఓ నెటిజన్ విజ్ఞప్తి.. కలిసిన ప్రధాని ప్రధాని మోదీ కువైట్ పర్యటన నేపథ్యంలో కువైట్‌లో ఉంటున్న తన తాత,రిటైర్డ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఉద్యోగి మంగళ్ సేన్ హండా (101)ను కలవండని ఎక్స్(ట్విటర్)లో ఓ నెటిజన్ ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. ఆయనను తప్పకుండా కలుస్తానని బదులిచచ్చిన మోదీ కువైట్ చేరుకున్న అనంతరం మంగల్‌సేన్‌హండాను కలిశారు. — Narendra Modi (@narendramodi) December 21, 2024 -
ధర్మసూక్ష్మం ఇలా ఉంటుందా..? ఆత్వస్తుతి అంత పాపమా..?
కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది. ఒకనాడు కర్ణుడితో యుద్ధం చేస్తూ ధర్మరాజు అతడి శరాఘాతాలకు గురై గాయాల పాలయ్యాడు. కర్ణుడి సూటిపోటి మాటలతోనైతే మృత్యు సమాన స్థితినే పొందాడు. అవమాన భారం తట్టుకోలేక దూరంగా పారిపోయి వెళ్ళి దాక్కున్నాడు. మరోపక్క అశ్వత్థామను తీవ్ర గాయాలపాలు చేసి అర్జునుడు విజయగర్వంతో ధర్మరాజు కోసం చూశాడు. ఎక్కడా కనిపించపోయేసరికి కృష్ణుడితో కలిసి ధర్మరాజు కోసం వెతుకుతూ వెళ్ళాడు. ఒకచోట ధర్మరాజును కలుసుకున్నాడు. తనను సమీపించిన కృష్ణార్జునుల ముఖంలో సంతోషం చూసి కర్ణుణ్ని వధించి ఉంటారని అనుకున్నాడు ధర్మరాజు. అతణ్ని ఎలా వధించారో చెప్పమన్నాడు. కర్ణుణ్ని ఇంకా చంపలేదని అర్జునుడు సమాధానమిచ్చాడు.అవమానభారంతో కోపంగా ఉన్న ధర్మజుడు అర్జునుణ్ని అనేక విధాలుగా నిందించాడు. ఎంతో గొప్పదైన గాండీవం ఉండి కూడా ఉపయోగించుకోలేకపోతున్నావు కాబట్టి దాన్ని ఎవరికైనా ఇచ్చేయమన్నాడు. ఆ మాట వినడంతోనే అర్జునుడు ధర్మరాజును చంపడానికి కత్తి ఎత్తాడు. పక్కనే ఉన్న కృష్ణుడు అర్జునుణ్ని ఆపి అతడి కోపానికి కారణాన్ని ప్రశ్నించాడు. తన ఎదురుగా ఎవరైనా గాండీవాన్ని అవమానించి దాన్ని విడిచి పెట్టమని అంటే వాళ్లను ఆ క్షణంలోనే చంపుతానని ప్రతిజ్ఞ చేసినట్లు అర్జునుడు చెప్పాడు. అదొక విషమ సందర్భం. ఆ సమయం లో వారిద్దరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత కృష్ణుడిపై పడింది. అప్పుడు కృష్ణుడు ముందు ధర్మరాజును రక్షించాలనే ఉద్దేశంతో అర్జునుడికి ధర్మం స్వరూప స్వభావాలను తెలియజేశాడు. జీవహింస మహాపాపంమంటుంది ధర్మం. కానీ బలాకుడు అనే బోయవాడు భార్యాపుత్రులు, వృద్ధులైన తల్లిదండ్రుల ఆకలి తీర్చడం కోసం క్రూర జంతువును చంపి స్వర్గానికి వెళ్ళిన వృత్తాంతాన్ని వివరించాడు. అలాగే సత్యాన్ని మాత్రమే మాట్లాడమంటుంది వేదం. ఒక్కోసారి అది తప్పంటుంది ధర్మసూక్ష్మం. ఒకరోజు కొందరు వ్యక్తులు తమను దొంగలు వెంటపడుతుంటే ప్రాణభయంతో పారిపోయి కౌశికుడనే తపస్వి ముందు నుంచే అరణ్యంలోకి వెళ్ళారు. కొంతసేపటికి దొంగలు అటుగా వచ్చి వారి గురించి కౌశికుణ్ని ప్రశ్నించగా వారు ఎటు పారిపోయిందీ వివరించాడు. దొంగలు వెళ్ళి వారిని సంహరించి ధనాన్ని దోచుకుపోయారు. వారి మరణానికి పరోక్ష కారణమైన కౌశికుడు తాను చేసిన పనిమూలంగా పాపభారాన్ని మోయాల్సి వచ్చింది. కృష్ణుడి మాటలు విని అర్జునుడు ధర్మస్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక అన్నను చంపబోయానని చింతించాడు. ప్రతిజ్ఞాభంగం కలగకుండా ధర్మరాజును, తనను కాపాడమని వేడుకొన్నాడు. అప్పుడు అర్జునుడికి కృష్ణుడు పెద్దలను, గురువులను ఏకవచనంతో సంబోధిస్తే వారిని చంపినట్లే కాగలదన్నాడు. వెంటనే అర్జునుడు అలాగే చేశాడు. ధర్మరాజును అవమానించిన బాధతో కొంతసేపటికి అర్జునుడు నేనింకా బతికుండటం వృథా అంటూ మరణానికి సిద్ధమయ్యాడు. వెంటనే శ్రీ కృష్ణుడు అతణ్ని ఆపి ఆత్మస్తుతి చేసుకోవడం ఆత్మహత్యా సదృశమని చెప్పాడు. వెంటనే ధర్మరాజు ఎదుట అర్జునుడు తనను తాను అనేక రకాలుగా ప్రశంసించుకొని తాను చేసిన పాపం బారినుంచి విముక్తుడయ్యాడు. ఈ విధంగా ధర్మం అనేక ధర్మసూక్ష్మాలతో మిళితమై ఉంటుంది.(చదవండి: -
ప్రేమించు... జీవించు...
ఈ సృష్టి సమస్తం ప్రేమ మయం.. సృష్టిలో సమస్త జీవరాశుల పట్ల ప్రేమ కలిగి ఉండటమే అత్యుత్తమమైన ఆధ్యాత్మిక సాధన అని మహాభారతం చెబుతోంది. ప్రాణం పోసే మహత్తర శక్తి ప్రేమకు ఉంది. శారీరక, మానసిక, నైతిక ఆరోగ్యాలకు ప్రేమ ఎంతో అవసరం. ప్రేమకు కొలతలు లేవు. తరతమ భేదాలు లేవు. అది అనంతమైనది. విశ్వవ్యాప్తమైనది.. మనిషి సంఘజీవి. ఏకాకిగా అతడు సంఘంలో ఎక్కువ కాలం ఉండలేడు. అతడు జీవించాలంటే ప్రేమ కావాలి. ప్రేమ లేనిదే మనిషి జీవితం వ్యర్ధం. మనిషి మనుగడకు మూలం ప్రేమ. మానవ సంబంధాలు నిలబడేది, కొనసాగేది ప్రేమ పునాది పైనే. అయితే ప్రేమ అనగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది యువతీయువకుల మధ్య ఉండే ప్రేమ.. కేవలం యువతీయువకులదే కాదు ఇరుగు పొరుగు వారిది, తల్లిదండ్రులది, పిల్లలది, స్నేహితుల మధ్యన ఉండేది కూడా ప్రేమే. సమస్త మానవాళిలో ఉన్న ప్రేమను అవగతం చేసుకుంటే అది మానవ జీవితానికి పరిపక్వతనిస్తుంది. ప్రేమ గురించి సంపూర్ణంగా తెలిసినవారే, దాన్ని ఆస్వాదిస్తారు. ఇతరులకు పంచగలుగుతారు. ప్రేమ మనిషిని దైవంగా మారుస్తుంది.. ఆ దైవత్వంతోనే మనిషి ఎలాంటి కార్యాలనైనా సాధించగలుగుతాడు.. ప్రేమ గురించి , దాని శక్తి గురించి స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్త్ లాంటి ఎందరో మహనీయులు ఈ లోకానికి తెలియ చేశారు. ఈ క్రమంలో ప్రేమతత్వం ద్వారా కోట్ల మందిని ప్రభావితం చేశారు. ప్రేమలో నిర్భయత్వాన్ని, ఆనందాన్ని సాధించే మార్గాలను వారు ఈ లోకానికి అందించారు. అయితే ప్రేమ అనేది కేవలం మనుషుల మధ్యనే కాదు అది సమస్త జీవరాశుల మీదా ఉండాలి. అలాంటప్పుడే ఈ ప్రకతి అంతా ప్రేమ మయంగా అందంగా, ఆహ్వాదంగా కనిపిస్తుంది. బొందితో స్వర్గానికి వెళ్ళే అర్హత ధర్మరాజుకు ఉంది. ఆయన స్వర్గానికి వెళ్ళే సమయంలో ఓ కుక్క అతని వెంట పడుతుంది. ఆ కుక్కను ప్రేమగా చూసిన ధర్మరాజు కుక్కను వదిలి స్వర్గానికి వెళ్ళడానికి అంగీకరించడు. ఇలా చివరి క్షణంలో సైతం కుక్క మీద ప్రేమ కురిపించి మూగజీవాల పట్ల తన దయాగుణాన్ని చాటుకున్నాడు. సాక్షాత్తు శిరిడీ సాయి నాధుడు ఎప్పుడూ ప్రజలతో పాటు మూగ జీవాలను కూడా ఎంతగానో ప్రేమించేవారు. అలాగే రమణ మహర్షితో పాటు ఇంకా అనేక మంది యోగులు, మునులు, సిద్ధులు తమ ప్రేమను జంతు జీవాలపై కురిపించి విశ్వ మానవ ప్రేమను చాటుకున్నారు...ఇలా ఆపదలో ఉన్నవారిని, రోగ గ్రస్తులను మాత్రమే కాదు ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులను ప్రేమించిననాడే మానవ జీవితానికి పరిపక్వత సిద్ధిస్తుంది. ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తారసపడుతుంది. జీవితంలో ప్రతి మనిషి తన స్నేహితులను, తల్లితండ్రులను, పిల్లలనూ ప్రేమిస్తూనే ఉంటాడు. అలాగే సుందరమైన నదులు, కొండలపై జారు జలపాతాలు, ఇసుకతో కూడిన ఎడారులు, ప్రకతి శోభ, చెట్టు చేమ, జంతువులు, పక్షుల, వింతగా కనిపించే మబ్బులు, మిణుకు మిణుకుమనే నక్షత్ర సముదాయం, రోదసి, అందం, సుందరం, బుజ్జి పాపాయి అమాయక నవ్వు, మనుషుల స్నేహం, అభిమానం, వీటి అన్నింటిలో కూడా ప్రేమ కనిపిస్తుంది. వికసిస్తుంది. ప్రేమ మనకు ప్రకృతి ఇచ్చిన వరం.మనిషి మౌలికంగా దైవస్వరూపుడని, శరీరంలో నివసించే ఆత్మే దైవమని అనేక మంది మహనీయులు సెలవిచ్చారు. జ్ఞానం పెరిగే కొద్దీ ఆధ్యాత్మికత వికసిస్తుంది. అలా వికసించినపుడే అన్ని భేదాలు అంతరించి ప్రేమతత్వం సాధ్యపడుతుంది. ఏవిధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా, మంచి మనసుతో మనం ఒకరి పట్ల చూపే నిస్వార్థమైన ఆదరణే ప్రేమ‘. ఇది ఒక ఉన్నతమైన, పవిత్రమైన, గొప్పదైన భావన.– దాసరి దుర్గాప్రసాద్ -
రాజమౌళికి షాక్.. మహాభారతం ఏం చేస్తాడో మహానుభావుడు
-
ధర్మం అంటే ఏంటో తెలిపేది..ఈ శంఖలిఖితుల కథ
దానికి వేలాడుతూ అరముగ్గిన పండ్లు కనిపించాయి. అప్పటికే వచ్చి చాలాసేపు కావడంతో ఆకలిగా కూడా అనిపించింది. పండ్లు తింటే కాస్త ఆకలి తీరుతుందనుకున్న లిఖితుడు చెట్టు నుంచి పండ్లు కోసి, తినసాగాడు. లిఖితుడు పండ్లు తింటుండగా, బయటకు వెళ్లిన శంఖుడు ఆశ్రమానికి వచ్చాడు. తమ్ముడు పండ్లు తింటుండటం చూసి, ‘ఈ పండ్లు ఎక్కడివి?’ అని అడిగాడు. ‘ఇక్కడివే! అదిగో ఆ చెట్టు నుంచే కోశాను’ అంటూ తాను పండ్లు కోసిన జామచెట్టును చూపించాడు లిఖితుడు. ‘అనుమతి లేకుండా పండ్లు కోయవచ్చునా? అలా చేస్తే, అది దొంగతనం కాదా?’ అని ప్రశ్నించాడు శంఖుడు. అన్న నిలదీయడంతో లిఖితుడు ఖిన్నుడయ్యాడు. ‘నిజమే! ఆకలి వేయడంతో అనుమతి లేకుండానే చెట్టు నుంచి పండ్లు కోసి తిన్నాను. దొంగతనం పాపం. నేను పాపం చేశాను. దీనికి పరిహారం ఏమిటి?’ దుఃఖిస్తూ అడిగాడు లిఖితుడు. ‘రాజు వద్దకు వెళ్లి, దొంగతనానికి తగిన శిక్ష పొందడమే దీనికి పరిహారం. వెంటనే రాజు వద్దకు వెళ్లి, చేసిన నేరాన్ని చెప్పి, అతడు విధించిన శిక్షను అనుభవించు’ అన్నాడు శంఖుడు. సుద్యుమ్నుడు ఆ ప్రాంతానికి రాజు. అన్న ఆదేశం మేరకు లిఖితుడు సుద్యుమ్నుడి రాజప్రాసాదానికి వెళ్లాడు. మునివేషధారి అయిన లిఖితుడిని నా కోరిక తీరుస్తానని మాట ఇచ్చావు, మంచిది. ఆడిన మాట తప్పడం రాజులకు తగదు. కాబట్టి, నీవు నా కోరిక నెరవేర్చక తప్పదు’ అన్నాడు లిఖితుడు. ‘చెప్పండి మహర్షీ! మాట తప్పను’ అన్నాడు సుద్యుమ్నుడు. ‘నా అన్న అనుమతి లేకుండా, అతడి ఆశ్రమంలో ఉన్న చెట్టు నుంచి పండ్లు కోసుకుని తిన్నాను. యజమాని అనుమతి లేకుండా వస్తువులు తీసుకోవడం దొంగతనం కిందకే వస్తుంది. కాబట్టి నేను చేసిన దొంగతనానికి తగిన శిక్ష విధించు. నువ్వు విధించే శిక్ష ద్వారా పాప పరిహారం పొందుతాను’ అని చెప్పాడు లిఖితుడు. అతడి మాటలకు సుద్యుమ్నుడు నివ్వెరపోయాడు. ‘మహాత్మా! మిమ్మల్ని శిక్షించమని నన్ను నిర్బంధించకండి’ అని బతిమాలుకున్నాడు. లిఖితుడు అతడి మాటలను పట్టించుకోలేదు. పైగా, ‘రాజా! రాజదండన పొందినవాడికి యమదండన తప్పుతుంది. ఆడిన మాట ప్రకారం నన్ను దండిస్తే, నీకు అనృతదోషం అంటకుండా ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని ఆచరించు. నేరం చేసిన నన్ను దండించు’ అని కరాఖండిగా చెప్పాడు. ఇక చేసేది లేక సుద్యుమ్నుడు భటులను ఆజ్ఞాపించి, లిఖితుడి రెండు చేతులనూ నరికేయించాడు. మొండి చేతులతో లిఖితుడు అన్న వద్దకు వెళ్లి, ‘అన్నా! రాజదండన పొందాను’ అని చెప్పాడు. శంఖుడు సంతోషించాడు. ‘తమ్ముడా! ధర్మాన్ని ఆచరించావు. చేసిన పాపానికి పరిహారం పొందావు. బాహుదా నదికి వెళ్లి, దేవతలకు, మునులకు, మన పితృదేవతలకు తర్పణాలు ఇవ్వు. రాజదండన పొందినవాడికి పాపం నశించి, పుణ్యం ప్రాప్తిస్తుంది. నువ్వు పుణ్యాత్ముడివి. నీకు శుభం కలుగుతుంది’ అని చెప్పాడు. అన్న చెప్పిన మాట ప్రకారం లిఖితుడు బాహుదా నదికి వెళ్లాడు. నదిలో ఒక్క మునకవేసి, పైకి లేచే సరికి అతడి రెండు చేతులూ మొలిచాయి. దేవతలకు, మునులకు, పితృదేవతలకు తర్పణాలు విడిచి, సంతోషంగా అన్న దగ్గరకు వెళ్లి, తనకు కొత్తగా మొలిచిన చేతులను చూపించాడు. ‘తమ్ముడా! నువ్వు పరిశుద్ధాత్ముడవు. అందుకే పరమాత్మ నిన్ను అనుగ్రహించి, తెగిన చేతులను మళ్లీ ప్రసాదించాడు’ అంటూ తమ్ముడిని మనసారా ఆశీర్వదించాడు శంఖుడు. ∙సాంఖ్యాయన -
ఇన్ఫోసిస్ మూర్తిపై మహాభారత పాత్ర ప్రభావం.. అప్పట్లో కరుడుకట్టిన వామపక్షవాది!
ప్రముఖ వ్యాపారవేత్త, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. దేశంలో సాఫ్ట్వేర్ పరిశ్రమ అభివృద్ధికి బాటలు వేసింది ఆయనే. ఆయన తరచూ పలు వేదికలపైన పారిశ్రామిక రంగంలో ప్రస్తుత పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. పలు అంశాల్లో యువతకు మార్గదర్శనం చేస్తుంటారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నారాయణమూర్తి అద్భుత కావ్యం మహాభారతంలో తనను అమితంగా ప్రభావితం చేసిన పాత్ర గురించి వివరించారు. అందులోని కర్ణుడి పాత్ర ప్రభావం తనపై ఎక్కువగా ఉందని చెప్పారు. కర్ణుడి దాన గుణం సాటి లేనిదని, ఆ ప్రభావంతోనే తాను పెరిగినట్లు తెలిపారు. అదే కార్యక్రమంలో మూర్తి మాట్లాడుతూ విద్యార్థి దశలో కరుడుకట్టిన వామపక్షవాదిగా తాను తర్వత వ్యాపారవేత్తగా ఎలా మారాడో.. ఆ సైద్ధాంతిక పరివర్తన గురించి వెల్లడించారు. విఫలమైన తన మొదటి వ్యాపార ప్రయత్నం గురించి తెలిపారు. ఆ సమయంలో కంప్యూటర్లకు మార్కెట్ లేదని, అప్పట్లో భారతదేశంలో చాలా తక్కువ కంప్యూటర్లు ఉండేవని వివరించారు. ఆ తర్వాత ఇన్ఫోసిస్‌ను స్థాపించినప్పుడు మార్కెట్ ఎక్కువగా ఉన్న దేశాలకు ఎగుమతులపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రపంచంలో అతి పెద్ద నివాసం భారత్‌లోనే.. యజమాని ఒకప్పటి క్రికెటర్, రాజకీయ నాయకుడు -
రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలతో ఎంపీగా అనర్హత వేటు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో తలనొప్పి మొదలైంది. మహాభారతంలోని కౌరవులను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తో పోలుస్తూ రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒకరు కేసు వేశారు. గతంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ కోర్టులో కమల్ భదౌరియా అనే వ్యక్తి పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసు ఈనెల 12వ తేదీన విచారణకు రానుంది. కమల్ న్యాయవాది చెప్పిన ప్రకారం.. ఈ జనవరి తొమ్మిదో తేదీన భారత్ జోడో యాత్రలో భాగంగా హరియాణాలోని అంబాలా పట్టణంలోని ఒక కూడలిలో రాహుల్ ప్రసంగించారు. ‘ కౌరవులు ఎవరో మీకు తెలుసా ? మొదట మీకు 21 శతాబ్దపు కౌరవుల గురించి వివరిస్తా. వాళ్లంతా ఖాకీ రంగు నిక్కర్లు వేసుకుంటారు. చేతిలో లాఠీ పట్టుకుని ‘శాఖ’లు నిర్వహిస్తారు. భారత్‌లోని ఇద్దరు, ముగ్గురు అపర కుబేరులు వీరికి మద్దతుగా నిలుస్తున్నారు’ అని రాహుల్ ప్రసంగించారని తన పిటిషన్లో కమల్ పేర్కొన్నారు. ‘21వ శతాబ్దంలో కౌరవులు ఇంకా ఉన్నారు అంటే అది ఆర్ఎస్ఎస్ సభ్యులే’ అని ప్రసంగించి ఆర్ఎస్ఎస్ పరువుకు రాహుల్ తీవ్ర భంగం కల్గించారని ఆరోపించారు. ‘మోదీ అని ఇంటిపేరు ఉన్నవాళ్లంతా దొంగలే’ అని వ్యాఖ్యానించారన్న కేసులో దోషిగా తేలడంతో సూరత్ కోర్టు రాహుల్‌కు ఇప్పటికే రెండేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెల్సిందే. ఎగువ కోర్టులో అప్పీల్‌కు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును తాత్కాలిక నిలుపుదల చేసిన విషయం తెల్సిందే. -
బకాసుర వధ
హిడింబాసుర వధ తర్వాత పాండవులు హిడింబవనం నుంచి బయలుదేరి శాలిహోత్ర మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. శాలిహోత్ర ముని వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఇంతలో అక్కడకు వ్యాస మహర్షి వచ్చాడు. అందరూ ఆయనకు పాదభివందనం చేశారు. పాండవుల దుర్గతికి వ్యాసుడు జాలిపడ్డాడు. ‘కొడుకు మాట విని ధృతరాష్ట్రుడు మిమ్మల్ని రాజ్యం నుంచి వెళ్లగొట్టాడు. దుర్మార్గుల పట్ల ఏమరుపాటు తగదు. కొన్నాళ్లు ఎవరికీ తెలియకుండా మీరు ఇక్కడే కాలక్షేపం చేసి, తర్వాత ఏకచక్రపురం వెళ్లండి. అక్కడ బ్రాహ్మణ వేషంలో బ్రాహ్మణుల ఆశ్రయంలో తలదాచుకోండి. అంతా మంచే జరుగుతుంది’ అని చెప్పాడు. శాలిహోత్ర మహాముని ఆశ్రమంలో కొన్నాళ్లు గడిపిన తర్వాత వ్యాసుడి సూచనపై పాండవులు అక్కడి నుంచి ఏకచక్రపురం వెళ్లడానికి బయలుదేరారు. విదర్భ, మత్స్య, త్రిగర్త దేశాలు దాటి ఏకచక్రపురం చేరుకున్నారు. అక్కడ ఒక బ్రాహ్మణుల ఇంట ఆశ్రయం పొంది, భిక్షాటనతో కాలం గడపసాగారు. ఒకనాడు నలుగురు సోదరులూ భిక్షాటనకు వెళ్లగా, భీముడు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఇంతలో ఇంటి యజమానుల భాగం వైపు నుంచి ఏడుపులు పెడబొబ్బలు వినిపించసాగాయి. ఎవరికి ఏ ఆపద ఎదురైందోనని కుంతి అటువైపు హుటాహుటిన వెళ్లింది. భార్యాబిడ్డలను పట్టుకుని అదేపనిగా వెక్కివెక్కి ఏడుస్తున్నాడు బ్రాహ్మణుడు. ‘నిస్సారమైనది ఈ జీవితం. ఎంతటి వాళ్లకైనా కర్మఫలం తప్పదు. అగ్నిసాక్షిగా పెళ్లాడాను దీన్ని. రాక్షసుడి తిండికి దీన్నెలా పంపను? లోకం తెలియని పసికూన కూతురు. రాక్షసుడికి ఆహారంగా వెయ్యడానికి నాకు చేతులెలా వస్తాయి? కొడుకు– ఒక్కగానొక్క వంశాంకురం. తిలోదకాలన్నా లేకుండా వీణ్ణి మాత్రం ఎలా పంపను? నేనే వెళతాను’ అంటూ కళ్లు తుడుచుకున్నాడు. ‘వద్దు, వద్దు. మీరు వెళ్లకండి. మీరు లేకుండా నేనీ సంసారాన్ని ఈదలేను. అసలు బతకలేను. పునిస్త్రీ చావు కన్న పుణ్యం లేదు. నన్ను పంపండి. ఆ రాక్షసుడికి ఆహారంగా నేనే వెళతాను’ ఏడుస్తూ అంది ఆ ఇల్లాలు. ‘ఏనాటికైనా పరాయి ఇంటికి వెళ్లవలసిన దాన్నే. నన్ను పంపండి’ అంది కూతురు బిగ్గరగా రోదిస్తూ.ఊహ తెలియని కొడుకు ఇదంతా చూస్తూ, ‘ఎందుకు మీరంతా ఏడుస్తారు? నేనెళతాను. ఆ రాక్షసుణ్ణి చంపేసి వస్తా’ అంటూ దగ్గరే ఉన్న ఒక కర్రనందుకున్నాడు. ‘అసలేమైందమ్మా! మీరంతా ఎందుకో బాధపడుతున్నారు. రాక్షసుడంటున్నారు. ఆ రాక్షసుడు ఎవరు? మీకొచ్చిన ఆపద ఏమిటి? మీకు ఆపద వస్తే, మాకు వచ్చినట్లే. సందేహించకుండా చెప్పండి’ అంది కుంతి. ‘ఏం చెప్పేది తల్లీ! ఈ ఊరికి ఆమడ దూరంలో బకాసురుడి గుహ ఉంది. ఇదివరకు వాడు ఊళ్లో వాళ్లందరినీ మింగేస్తూ ఉండేవాడు. అప్పుడు ఊళ్లో వాళ్లంతా ఆలోచించి, బకాసురుడితో ఒక ఒప్పందం చేసుకున్నారు. ప్రతిరోజూ ఒక మనిషి, రెండు పోతులు, వంటకాలతో బండెడు ఆహారం వాడికి పంపుతామని, వాడు ఊరి మీద పడకుండా ఉండాలని ఆ ఒప్పందం. మా రాజుకు ఆ రాక్షసుణ్ణి ఎదిరించే బలం లేదు. అందుకే రోజూ వంతుల వారీగా ఒక్కో ఇంటి నుంచి ఒక మనిషి అతడికి ఆహారంగా వెళుతున్నాం’ అని చెప్పాడా బ్రాహ్మణుడు. ‘విచారించకండి. దీనికి తగిన ఉపాయం చెబుతాను’ అంది కుంతి. ‘మీకు ఒక్కడే కొడుకు. పైగా పసివాడు. నాకు ఐదుగురు కొడుకులు. వాళ్లలో ఒకణ్ణి పంపుతాను.’ అంది. ‘శివ శివా’ అంటూ చెవులు మూసుకున్నాడు బ్రాహ్మణుడు. ‘అతిథిని చావుకు ఎరగా వేయడం మహా పాతకం. నా ప్రాణం కోసం అతిథిగా వచ్చిన బ్రాహ్మణుణ్ణి రాక్షసుడికి బలి చెయ్యాలా? నేను ఇంతటి పాతకానికి సమ్మతించలేను తల్లీ!’ అన్నాడు. ‘అయ్యా! మీరు అనవసరంగా బాధపడకండి. మరేమీ భయపడకండి. నా కొడుకు సంగతి మీకు తెలీదు. వాడు మహా బలసంపన్నుడు. వందమంది బకాసురులైనా వాణ్ణేమీ చెయ్యలేరు. ఏ తల్లికైనా కన్నకొడుకు చేదుకాదు కదా, నేను నా కొడుకును ఎలా బలి పెడతాననుకున్నారు? జరిగేది చూస్తూ ఉండండి’ అంటూ భీముణ్ణి కేకేసి పిలిచింది. బకాసురుడికి బండితో భోజనం తీసుకువెళ్లమని చెప్పింది. ఉత్సాహంగా సిద్ధపడ్డాడు భీముడు. త్వర త్వరగా పంచభక్ష్యాలతో భోజనం తయారు చేయించి, పోతులు పూన్చిన బండికెక్కించాడు బ్రాహ్మణుడు. బండి పైకెక్కి భీముడు బయలుదేరాడు. బకాసురుడి గుహ అల్లంత దూరం ఉందనగా, యమున ఒడ్డున బండిని నిలిపాడు. నదిలో కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కుని, వచ్చి బకాసురుణ్ణి కేకలేసి పిలిచాడు. వాడు రాలేదు. ఈలోగా భోంచేద్దామని, బండిలోని పదార్థాలను ఆరగించడం ప్రారంభించాడు. గుహ ముందుకు భోజనం బండి వచ్చే జాడ కనిపించకపోవడంతో ఆకలితో నకనకలాడుతున్న బకాసురుడు బయటకు వచ్చాడు. కొద్ది దూరం వచ్చేసరికి బండి మీద భోంచేస్తున్న భీముడు కనిపించాడు. బకాసురుడికి కోపం నసాళానికెక్కింది. ‘నాకోసం తెచ్చిన తిండి నువ్వు తినేస్తున్నావేమిటి? ఒళ్లు కొవ్వెక్కిందా?’ అంటూ భీముడి వీపు మీద ఒక గుద్దు గుద్దాడు. ఏమాత్రం చలించకుండా, భీముడు తింటూనే ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు బకాసురుడు. కాస్త దూరంలో ఉన్న చెట్టును పెరుక్కు రావడానికి వెళ్లాడు. వాడు చెట్టు పెరుక్కుని తెచ్చేలోగా భీముడు భోజనం పూర్తి చేశాడు. బండి దిగి, మరో చెట్టును ఊడబెరికి బకాసురుడి ఎదురుగా వెళ్లాడు. ఇద్దరూ చెట్లతో కొట్టుకున్నారు. చుట్టు పక్కల చెట్లన్నీ అయిపోయే వరకు వారి మధ్య చెట్ల యుద్ధం సాగింది. చెట్టనేది ఏదీ కనిపించకపోవడంతో మల్లయుద్ధానికి కలబడ్డారు. భీముడు బకాసురుణ్ణి కిందకు పడదోసి, కాలితో తన్నాడు. వాడు చప్పున లేచి భీముణ్ణి గుండెలపై గుద్దాడు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదనుకుని భీముడు వాడి మీదకు మెరుపులా దూకాడు. ఒక చేత్తో నడుము దొరకబుచ్చుకుని, ఒక చేత్తో వాడి మెడను వంచాడు. మోకాలితో వీపు విరగబొడిచాడు. నెత్తురు కక్కుకుంటూ చచ్చాడు వాడు. బకాసురుడు చచ్చాడని తెలుసుకుని, వాణ్ణి చంపిన భీముణ్ణి చూడటానికి ఏకచక్రపుర వాసులంతా తండోపతండాలుగా అక్కడకు చేరుకున్నారు. బకాసురుడి పీడ విరగడ చేసిన భీముణ్ణి, ధైర్యంగా అతడిని పంపిన కుంతిని వేనోళ్ల పొగిడారు. -
Cheriyal Painting: నేర్చిన కళే నడిపిస్తోంది.. నకాశి
గృహిణి అనగానే ఇంటిని చక్కదిద్దుకుంటూ, వంట చేస్తున్న మహిళలే మనకు గుర్తుకు వస్తారు. ఇల్లు, వంట పనితో పాటు పిల్లల ఆలనాపాలనా చూస్తూనే చేర్యాల చిత్రకళను ఔపోసన పట్టారు వనజ. ఆరుపదులకు చేరవవుతున్న వనజ హైదరాబాద్ బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. కుటుంబకళగా పేరొందిన నకాశీ చిత్రకళ గురించి, ఈ కళలో మమేకమైన జీవితం గురించి, పొందిన సత్కారాల గురించి ఆనందంగా వివరిస్తారు వనజ. తెలంగాణలో అతి ప్రాచీన జానపద చిత్రకళగా చేర్యాల పెయింటింగ్స్‌కి పేరుంది. దీనినే నకాశి చిత్రకళ అని కూడా అంటారు. రామాయణ, మహాభారత, పురాణాలను, స్థానిక జానపద కథలను కూడా ఈ కళలో చిత్రిస్తారు. ఈ పెయింటింగ్స్‌తో పాటు రాజా రాణి, సీతారామ.. పోతరాజు, వెల్కమ్ మాస్క్‌లను తయారు చేస్తుంటారు వనజ. పెయింటింగ్ నేర్చుకుంటామని వచ్చినవారికి శిక్షణ కూడా ఇస్తుంటారు. వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటారు. 37 ఏళ్ల క్రితం ‘‘చదువుకున్నది ఏడవ తరగతి వరకే. పెళ్లయ్యాక ముగ్గురు పిల్లలు. నా భర్త వైకుంఠం ఈ చిత్రకళలో రోజంతా ఉండేవారు. ఓ వైపు ఇంటిపని, పిల్లల పని.. అంతా పూర్తయ్యాక మధ్యాహ్నం రెండు గంటల నుంచి పెయింటింగ్ నేర్చుకోవడానికి కూర్చునేదాన్ని. అంతకుముందు ఈ కళ మా కుటుంబానికి మా మామగారి ద్వారా ఏ విధంగా వచ్చిందో, ఎంత ప్రాచీనమైనదో తెలుసుకున్నాను. ప్రాణం పెట్టే ఈ కళ సహజత్వం గురించి అర్ధమవుతున్న కొద్దీ నాకు ఎంతో ఇష్టం పెరిగింది. కళ నేర్పిన చదువు వందల ఏళ్ల క్రితం నిరక్షరాస్యులకు ఈ బొమ్మల ద్వారా కథ తెలియజేసే విధానం ఉండేది. ఆ విధంగా సమాజానికి మంచి నేర్పే కళగానూ పేరుంది. దేవతా వర్ణనలతో, ఇతిహాసాలను, పురాణాలను, స్థానిక కుల కథలను కూడా ఈ కళద్వారా చిత్రిస్తాం. ఖాదీ వస్త్రం లేదా కాన్వాస్‌పై ప్రత్యేకంగా ప్రాసెస్ చేసిన చింత గింజల గుజ్జు, కొన్ని చెట్ల జిగురు, సహజ రంగులతో చిత్రిస్తాం. ఎరుపురంగు ప్రధాన భూమికగా ఉంటుంది. నీలం, పసుపు రంగులో దేవతల చిత్రాలు, బ్రౌన్ లేదా డార్క్ షేడ్స్ రాక్షసులకు, పింక్ స్కిన్ టోన్లు మనుషులకు ఉంటాయి. వందల సంవత్సరాల క్రితం పురుడు పోసుకున్న కళ ఇది. 3 అడుగుల వెడల్పుతో 60 అడుగులకు పైగా పొడవుతో ఈ బొమ్మలను చిత్రించవచ్చు. స్క్రోల్‌లో దాదాపు 40 నుంచి 50 ప్యానెల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్యానెల్ కథలోని కొంత భాగాన్ని వర్ణిస్తుంది. ఏడాదికి పైగా... రోజూ కనీసం 5–6 గంటల పాటు సాధన చేస్తూ ఉండటంతో ఏడాదిలో కళను నేర్చుకున్నాను. పిల్లలు స్కూల్‌కి వెళ్లే వయసొచ్చాక ఇంకాస్త సమయం కలిసొచ్చింది. దీంతో మెల్లమెల్లగా ఈ పెయింటింగ్స్‌లో లీనమవడం పెరిగింది. స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు కూడా నాతోపాటు పెయింటింగ్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. పిల్లలు చదువుతోపాటు ఈ కళనూ ఒంటపట్టించుకున్నారు. దేశమంతా ప్రయాణించాను ఎక్కడ మా ప్రోగ్రామ్ ఉన్నా నేనూ మెల్ల మెల్లగా వాటిల్లో పాల్గొనడం మొదలుపెట్టాను. ఆ విధంగా ఢిల్లీ, కలకత్తా, ముంబాయ్.. దేశమంతా తిరిగాను. ఎగ్జిబిషన్స్‌లో పెట్టే స్టాల్స్ చూసుకోవడంతో పాటు, ఇంటి వద్దకు వచ్చే మహిళలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. కాలేజీ అమ్మాయిలు కూడా వస్తూ ఉండేవారు. కాలేజీల్లో వర్క్‌షాప్స్ పెట్టేవాళ్లం. ఇప్పుడు రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకైనా పెయింటింగ్ పూర్తయ్యేవరకు వర్క్ చేస్తూనే ఉంటాను. మా వారికి జాతీయ స్థాయిలో అవార్డు వస్తే, నాకు రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. జంట మాస్క్‌లు చిత్రకళతో పాటు వినాయకుడు, రాజూరాణి, సీతారాములు, పోతరాజు, బోణాల పండగ సమయంలో అమర్చే అమ్మవార్ల రూపు మాస్క్‌లను చేస్తున్నాం. అలాగే, ఇంట్లోకి ఆహ్వానించడానికి అలంకరణగా, ఇంటి లోపలి అలంకరణగా కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. ఉడెన్ బాక్స్‌లు, ట్రేలు, జ్యువెలరీ బాక్స్‌లను కూడా పెయింటింగ్ తీర్చిదిద్దుతు న్నాం. వీటిని కానుకలుగా ఇవ్వడానికి వీటిని ఎంచుకుంటు న్నారు. మాస్క్‌ల తయారీలో చింతగింజల పొడి, కర్ర పొట్టు రెండూ కలిపి, తయారుచేసి, పెయింటింగ్ చేస్తాం. అలాగే, మెటల్ ప్లేట్‌కి ఖాదీ క్లాత్ ని పేస్ట్ చేసి, నేచురల్ కలర్స్‌తో పెయింటింగ్ చేసి, వార్నిష్ చేస్తాం. ఇవన్నీ ఇంటి అలంకరణలో అందంగా అమరిపోతాయి. ఈ చిత్రకళ అన్నింటికీ ప్రధాన ఆకర్షణగా తయారయ్యింది. నా తర్వాత మా ఇంటి కోడలు నాతో కలిసి మెల్ల మెల్లగా ఈ కళను నేర్చుకుంటోంది. కుటుంబంలో కలిసిపోవడం అంటే ఆ కుటుంబంలో ఉన్న ఇష్టాన్ని, కష్టాన్ని కూడా పంచుకోవడం మొదలుపెడుతూ ఉండాలి. ఈ విషయాన్ని నా జీవితం నాకే నేర్పింది. నా కుటుంబం చేతిలో కళ ఉంది. దానిని నేనూ అందిపుచ్చుకుంటే నా తర్వాతి తరం దానిని మరింత నైపుణ్యంగా ముందుకు తీసుకువెళుతుంది. ఇదే నేను నమ్మాను. నాలాంటి మహిళలకు ఈ కళలో శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు ఎంతో గుర్తింపుతో పాటు, ప్రపంచాన్ని కొత్తగా చూశానన్న సంతృప్తితో పెయింటింగ్స్‌ను చిత్రిస్తున్నాను. దీని వల్ల నా కుటుంబ ఆదాయమూ పెరిగింది’’ ఆని ఆనందంగా వివరించారు వనజ. – నిర్మలారెడ్డి -
ద్రౌపది, సీత పాత్రల్లో అలరించనున్న దీపికా పదుకోన్!
అనుకున్నట్లు అన్నీ కుదిరితే దీపికా పదుకోన్‌ని ప్రేక్షకులు సీత, ద్రౌపది పాత్రల్లో చూసే అవకాశం ఉంది. ఇప్పటికి ద్రౌపది పాత్ర ఖరారైంది. సీత పాత్ర ఖరారు కావాల్సి ఉంది. ఒకవేళ ఈ రెండు పాత్రలూ దీపికా చేస్తే.. రెండు పౌరాణిక పాత్రల్లో నటించిన ఘనత దీపికాకే దక్కుతుంది. ఇక విషయంలోకి వస్తే.. దీపికా పదుకోన్ కథానాయికగా రెండేళ్ల క్రితం ‘మహాభారత’ సినిమా ప్రకటన వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. రెండేళ్లయినా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడంతో ‘మహాభారత’ ఆగిందనే వార్తలు ప్రచారంలోకొచ్చాయి. ఈ వార్తలకు చిత్రనిర్మాత మధు మంతెన ఫుల్స్టాప్ పెట్టారు. ‘‘దీపికాకు ఈ కథ నచ్చి, నటించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా కూడా ఉండాలనుకున్నారు. ద్రౌపది దృష్టి కోణం నుంచి మహాభారతాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. పురాణాలు చెబుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందుకే చాలా పరిశోధనలు చేసి, సమాచారం సేకరించాం. ఇప్పుడు స్క్రీన్‌ప్లేకి కావాల్సిన సమాచారం మా దగ్గర ఉంది. అయితే ఈ సినిమాకి టైమ్ పడుతుంది. ఈలోపు ‘రామాయణ’ మొదలుపెడతాం. అయితే ఇంకా నటీనటులను అనుకోలేదు. రానున్న దీపావళికి ‘రామాయణ’ నటీనటులను ప్రకటించాలనుకుంటున్నాం’’ అన్నారు. అయితే ‘రామాయణ’లో సీత పాత్రను దీపికా చేయనున్నారనే వార్త ఉంది. అలాగే స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ‘సీత: ది ఇన్కార్నేషన్’ కథ రాస్తున్నారు. ఈ సినిమాలో సీతగా దీపికా నటిస్తారనే టాక్ కూడా ఉంది. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కదాంట్లో అయినా సీతగా ఆమె నటిస్తే.. అటు ద్రౌపదిగానూ ఇటు సీతగానూ నటించిన ఘనత దీపికాకు దక్కుతుంది. -
Kamal Haasan: కమల్‌కు కోర్టులో ఊరట
నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌కు మదురై కోర్టులో ఊరట లభించింది. కమలహాసన్ 2017లో ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహాభారతం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అంతేకాకుండా కమల్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నెల్లై జిల్లా పళైయూర్ గ్రామానికి చెందిన ఆదినాథ సుందరం అనే వ్యక్తి వల్లియూర్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ పిటిషన్‌ను కొట్టి వేయాల్సిందిగా నటుడు కమలహాసన్ తరఫున మదురై హైకోర్టులో దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణలో ఉంది. కాగా శుక్రవారం మరోసారి ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో నటుడు కమలహాసన్ తరఫు న్యాయవాది హాజరై ఇలాంటి వివాదాస్పద సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన మాటలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కమలహాసన్పై కేసును కొట్టి వేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: 'నేను పార్టీ మారానా.. దమ్ముంటే నిరూపించండి' -
మహా ఇండియా
1988వ సంవత్సరం అక్టోబర్ 2 నుంచి 1990 ఆగస్టు వరకు ప్రతి ఆదివారం ఉదయం 9:00 గంటలు... ఇండియాలో టీవీ ఉన్న ప్రతి ఇంటికీ వచ్చి ‘మహాభారత్’గారియల్ ఇండియాని మహదానందానికి గురి చేసింది. ‘మహా ఇండియా’గా మార్చేసింది. ప్రపంచ గ్రంథమైన మహాభారతాన్ని దత్తత తీసుకోవాలని కలగన్నాడు ఓ వ్యక్తి.‘లోకంలో లేనిది మహాభారతంలో లేదు, మహాభారతంలో లేనిది లోకంలో లేద’న్న వ్యాసుడి జ్ఞానాన్ని కూడా దత్తత తీసుకోవాలనుకున్నాడు. నిజంగా అది సాధ్యమేనా?!.. మహాభారతం, రామాయణం వంటి పురాణాల గురించి తెలియని ఆధునిక తరాలు ఈ దృశ్యీకరణను చూసి తప్పుగా అర్థం చేసుకోకూడదు. అంటే, మూలం చెడకూడదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాలి అనుకున్నాడు. అతనే నిర్మాత బి.ఆర్.చోప్రా. ఎంత ఖర్చుకైనా వెనకాడేది లేదన్నాడు. సిద్ధం అన్నాడు దర్శకుడిగా రవిచోప్రా. కృష్ణార్జునుల్లా యుద్ధంలో అడుగుపెట్టి విజేతలై నిలిచారు ఈ తండ్రీ కొడుకులు. 1988 గాంధీ జయంతినాడు దూరదర్శన్‌లో 45 నిమిషాలపాటు ‘మ...హా...భా..ర...త్...’ సీరియల్ ప్రసారమయ్యింది. 94 ఎపిసోడ్లలో హస్తినాపురం బుల్లితెర మీదుగా నట్టింటికి దిగి వచ్చింది. కురుక్షేత్రాన్ని కళ్లముందు నిలిపింది. రామాయణం సీరియల్ తర్వాత ప్రజలందరినీ టీవీల ముందు కట్టిపడేసిన సీరియల్ మహాభారత్. ఈ సీరియల్‌ను చూసి కానీ ప్రజలు తమ పనులకు వెళ్లేవారు కాదు. ఈ సీరియల్‌ని ఆ తర్వాత కెనడా బిబిసిలో ప్రసారం చేస్తే యాభైలక్షల మంది వీక్షించారట. కాలం చెప్పిన కథ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అస్త్రాలు ఆకాశంలో తారాజువ్వల్లా లేవడం, శత్రువుల గుండెలను చీల్చడం బుల్లితెర ప్రేక్షకులు విస్మయంగా వీక్షించారు. ఎవరికీ తెలియని కథను కళ్లకు కట్టడం వేరు...అందరికీ తెలిసిన కథను అందునా యుగయుగాలుగా ప్రజల నోళ్లలో నానుతున్న కథను దృశ్యీకరించడం అంటే, ఎలా చెప్పాలి? అందుకే కాలంతో దోస్తీ చేశాడు దర్శకుడు. కాలం సాక్షీభూతంగా కథను చెప్పడం మొదలుపెట్టింది. ‘నేను కాలాన్ని. అజరామరంగా వెలుగొందే భారత కథను మీకు చెబుతున్నాను. ఇది కేవలం భరతవంశానికి చెందిన కథ మాత్రమే కాదు. భారతీయ సంస్కృతికి చెందినది. సత్య–అసత్యాల మధ్య జరిగిన మహా యుద్ధ కథ ఇది. చీకటికి – వెలుగుకు మధ్య జరిగిన యుద్ధ కథ ఇది. ఇందులోని పాత్రలు, సందర్భాలు నేను దగ్గరగా చూశాను. నేను అనుభూతించాను. ఇప్పటికీ మంచి – చెడులతో పోరాడుతూనే ఉన్నాను. నాకు ముగింపు అన్నది లేదు. గతంలో జరిగింది ఇప్పుడూ జరుగుతుంది. భవిష్యత్తులోనూ జరుగుతుంది. ఇది ఇతిహాస గ్రంథం మాత్రమే కాదు. ఇది అందరి కథ. అందరూ ఈ కథలో ఉన్నారు. ఈ కథలో ఉన్నవారందరూ ప్రపంచమంతటా ఉన్నారు. కృష్ణుడు అర్జునుడికి గీతా ఉపదేశం చేయడమో, దుర్యోధనుడు ద్రౌపదిని అవమానించడం మాత్రమే భారత కథ కాదు. ఇది మీ కథ. ఇది నా కథ..’ అంటూ కాలం భరత మహారాజును పరిచయం చేస్తుంది. మహారాజు భరతుడి హస్తినాపురం రాజదర్బారుతో ఈ కథ మొలుపెడుతుంది కాలం.హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఒకే దేశంగా పరిపాలించిన చంద్రవంశరాజు భరతడు తన తదనంతరం రాజును ప్రకటించాల్సి సమయం వచ్చింది. తన తొమ్మిది మంది పుత్రులలో ఎవరిని యువరాజుగా ప్రకటించాలన్నదే భరతుడి సమస్య. ఒక రోజు దర్బారులో భరతుడు –‘రాజుకు ఉండాల్సిన లక్షణాలు నా తొమ్మిది మంది పుత్రుల్లో ఎవరికీ లేవు. అన్ని లక్షణాలూ గల భరద్వాజ ముని పుత్రుడు భుమన్యుడిని దత్తతు తీసుకుంటున్నాను. అతడే ఈ సామ్రాజ్యాధినేత’ అని ప్రకటిస్తాడు. ఇక్కడ తల్లి–కొడుకుల మధ్య సంవాదం మనల్ని ఆలోచింపచేస్తుంది. రాజు కావాలంటే వారసత్వంగా కాదు ప్రజలను రక్షించి, పరిపాలించేవాడు కావాలి అని తల్లికి చెప్పే భరతుడి మాటలు భవిష్యత్తుతరాలకు మార్గదర్శకం చేస్తున్నట్టుగా ఉంటాయి. ప్రతీపుడి కొడుకు శంతనుడు. అతనికి సురగంగ వల్ల దేవరాతుడు, సత్యవతి ద్వారా విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు అనే ఇద్దరు కొడుకులు జన్మిస్తారు. కొడుకులిద్దరూ అర్ధంతరంగా చనిపోవడంతో కురువంశానికి వారసుడు లేకపోవడంతో తల్లి సత్యవతి అభ్యర్థనకు వ్యాసుడు తలవంచుతాడు. వ్యాసుని ద్వారా అంబిక, అంబాలికలకు దృతరాష్ట్రుడు, పాండురాజులు జన్మిస్తారు. పుట్టుకతో అంధుడైన దృతరాష్ట్రుడికి రాజ్యం కట్టబెట్టలేక అతని తమ్ముడు పాండురాజును రాజును చేస్తారు. అన్న దృతరాష్ట్రుడికి పుట్టిన వందమంది కొడుకులకు, పాండురాజుకు పుట్టిన ఐదుగురు కొడుకులకు మధ్య జరిగిన దాయాదుల పోరుకు కురుక్షేత్రం వేదిక అవుతుంది. ఇది న్యాయ–అన్యాయాలకు మధ్య జరిగిన పోరుగా కురుక్షేత్రం చూపుతుంది. యుద్ధం ముగిసి, ధర్మరాజు హస్తినాపుర రాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. అంపశయ్య మీద భీష్ముడు ప్రాణాలు వదలడంతో సీరియల్ ముగుస్తుంది.జీవితం ప్రశ్నార్థకంగా మారినప్పుడల్లా కాలం దానికి సమాధానం చెబుతూ వస్తోందని మహాభారతంలోని ప్రతి కథ మన కళ్లకు కడుతుంది. వర్తమానం భయపెట్టినప్పుడల్లా ధర్మంవైపుగా అడుగు వేయమని అభయమిస్తుంది. అన్ని సంఘటనలను మౌనసాక్షిగా వీక్షించిన కాలం చెప్పే మాటలకు మన మనసులో గూడు కట్టుకున్న ఒక్కోపొర తొలగిపోతున్నట్టుగా ఉంటుంది. ‘నేను ధర్మం అధర్మం మీద గెలిచే విధానాన్ని మీకు పరిచయం చేశాను. ధర్మం వైపుగా ఉండాలా, అధర్మం వైపుగా సాగాలా అనేది మీ మనసుల్లోనే ఉంది. ఇది కౌరవులకు – పాండవులకు జరిగిన యుద్ధం కాదు. మీ మనసుల్లో ధర్మం–అధర్మం ప్రస్తావన రేగినప్పుడల్లా కురుక్షేత్రం ప్రతిబింబమై మీకు సమాధానమిస్తుంది. మీ మనసే ఓ కురుక్షేత్రం. దాంట్లో ఏ వైపుగా మీరుంటే గెలుపు సుసాధ్యమో మీరే తెలుసుకోవాలి’ అని ధర్మబోధ చేస్తుంది కాలం. బుల్లితెర వ్యాసుడు బి.ఆర్.చోప్రా రామాయణం, మహాభారతం రెండు మహాగ్రంధాలు. రామానంద్ సాగర్, బిఆర్ చోప్రా ఇద్దరికిద్దరూ సమర్థులు. సాగర్ రామాయణం తర్వాత బరిలోకి దిగాలని మహాభారత్ మేకింగ్‌ను పోస్ట్‌పోన్ చేసుకున్నారట చోప్రా. ఆ సమయంలో చోప్రా, అతని కుమారుడు రవి కొన్ని టెలీఫిల్మ్స్ తీశారు. ఈ సమయంలో రహి మసూన్ రెజా, సతీష్ భట్నాగర్, నరేంద్ర శర్మలతో కలిసి స్క్రీన్ ప్లే, మాటలు సిద్ధం చేసుకున్నారట. దీనికి ఆరు నెలల సమయం పట్టింది. కొత్త ఆర్టిస్టుల కోసం వేలమందిని స్క్రీన్ టెస్ట్ చేశారు. అమితాబ్‌బచ్చన్‌ని మహాభారత్‌కు తీసుకోవాలనే ఆలోచన చేశారు. అయితే ఓ సినిమా సందర్భంలో అమితాబ్‌కి గాయాలు అవడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నారట. రామాయణం బుల్లితెర మీద అప్పటికే సూపర్ సక్సెస్ అయ్యింది. అంటే, తమ ప్రయత్నం ఇంకా ఘనంగా ఉండాలి. పురాణేతిహాసాలు అన్ని కాలాలకు సంబంధించినవి. అందుకే కాలం వాయిస్‌తో ‘మై సమయ్ హూ’ అంటూ ఈ సీరియల్‌ని మొదలుపెట్టారు. రెండేళ్ల పాటు వచ్చిన ఈ సీరియల్ ద్వారా వందలాది నటులు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నది చోప్రాల లక్ష్యం. దాదాపు రూ.9 కోట్లతో తీసిన ఈ సీరియల్లోని కురుక్షేత్ర సన్నివేశానికి ముంబయ్ ఫిల్మ్ సిటీ వేదిక అయ్యింది. కొన్ని సన్నివేశాలను రాజస్థాన్‌లో తీశారు. ఈ సీరియల్ అంతా ఒక ఎత్తు అయితే ‘హరీష్ భిమాని’ వాయిస్ ఒక ఎత్తు. గంభీరంగా పలికే ఆ స్వరం టీవీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి కూచోబెట్టింది. రామాయాణం పౌరాణిక గాథగా తీస్తే, మహాభారత్ పూర్తిగా డ్రమాటిక్ మోడల్‌కే వాల్యూ ఇచ్చారు. బి.ఆర్.చోప్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘మహాభారత్ గ్రంథంలోని ప్రతి నీడనూ అన్వేషించాం. అందుకే ప్రేక్షకులు అంతగా ఆదరించారు. కొన్ని వివరణలను వదిలివేసింది అనే విమర్శకులూ ఉన్నారు. కానీ ప్రేక్షకుల నాడియే అసలు సిసలు విజయం’ అన్నారు. ‘అథ శ్రీ మహాభారత కథ’ అంటూ చిన్నితెర మీద అతి పెద్ద ప్రయత్నం చేసి గెలిచిన చోప్రాకి దూరదర్శన్, తిలకించిన అశేష ప్రేక్షకజనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. ►ఉర్దూ రచయిత, కవి రహి మసూమ్ రజా వ్యాస మహాభారతం నుంచి ఈ సీరియల్ మూల కథను రాసుకున్నారు. ►‘మ..హా..భా..ర..త్’ టైటిల్ సాంగ్‌ను కంపోజ్ చేసింది ప్రసిద్ధ సంగీత దర్శకుడు రాజ్‌కమల్. దీనిని గాయకుడు మహేంద్ర కపూర్ పాడగా, హరీష్ భిమాని తన గొంతును (కాలం) జత కలిపాడు. ఇందులోని శ్లోకాలు భగవద్గీత నుంచి తీసుకున్నారు. ►బాలీవుడ్ నటుడు రాజ్‌బబ్బర్ అప్పటికే అగ్రనటుల జాబితాలో ఉన్నారు. చోప్రా తీసే సినిమాల్లో రాజ్‌బబ్బర్ నటించాలనేది వారికి ఒక సెంటిమెంట్‌గా వస్తుండేది. మహాభారత్ టీవీ సీరియల్లోనూ భరతుడుగా రాజ్‌బబ్బర్‌ను చూస్తాం. 1988లో మహాభారత్ వస్తే, 1989లో ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభకు ఎం.పీగా ఎన్నికయ్యారు రాజ్‌బబ్బర్. ►భీష్మ పాత్రధారి ముఖేష్ఖన్నా మహాభారత్ తర్వాత సినిమా నటుడిగా నిలదొక్కుకున్నారు. చంద్రకాంత, శక్తిమాన్ వంటి సీరియల్స్‌తోనూ ప్రసిద్ధి పొందారు. ►ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడే బుల్లితెర మీద కనిపిస్తున్నాడా అనిపించే నటుడు, దర్శకుడు నితిష్ భరద్వాజ్ నటన ఈ సీరియల్‌కి ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ►కర్ణపాత్రధారి పంకజ్ధీర్కి ఈ సీరియల్‌తో స్టార్డమ్ వచ్చేసింది. సనమ్ బేవఫా, బాద్షా వంటి సినిమాలతో పాటు చంద్రకాంత, కింగ్ జునాడ్గడ్, హరిశ్ఛంద్ర వంటి సీరియల్లోనూ ఆ తర్వాత షారూఖ్‌ఖాన్ చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోనూ పంకజ్ధీర్ నటించారు. ►అర్జున్‌గా నటుడు ఫిరోజ్‌ఖాన్, ద్రౌపదిగా రూపా గంగోలితో పాటు ఈ సీరియల్లోని ప్రధాన పాత్రధారులంతా ప్రముఖులయ్యారు. ద్రౌపది పాత్రకు ముందు జుహీచావ్లాను అనుకున్నారట. చివరగా రూపాగంగూలీని ద్రౌపది పాత్రకు ఎంపిక చేశారు. అభిమన్యుడిగా నటుడు చంకీపాండే సంతకాలు చేసినా, అతనికున్న సినిమా షెడ్యూల్ కుదరకపోవడంతో మాస్టర్ మయూర్‌ని అభిమన్యుడి పాత్రకు తీసుకున్నారు. ►1988 లో వచ్చిన చోప్రా మహాభారత్ తర్వాత 2013 లో స్వస్తిక్ ప్రొడక్షన్స్ అనే సంస్థ దాదాపు రూ. 120 కోట్ల వ్యయంతో మహాభారత్ సీరియల్‌ని నిర్మించింది. ఈ సీరియల్ మొత్తం 128 ఎపిసోడ్లుగా వచ్చింది. -
మ్యూరల్ మహాభారతం
ఒక గురువు. ముప్పై ఐదు మంది శిష్యులు. అంతా మహిళలు. నాలుగేళ్లు. వేర్వేరు రాష్ట్రాలు. వేర్వేరు ప్రాంతాలు. విభిన్న భాషలు. అంతా కలిశారు. కుడ్యచిత్రాలలో మహాభారతాన్ని లిఖించారు. ఆ కుడ్యచిత్ర కళ కూడా అతి ప్రాచీనమైనది. ఇక వీరు సృష్టించిన అద్భుతమైతే వర్ణనాతీతమైనది. కుడ్యచిత్ర కళ (మ్యూరల్ పెయింటింగ్) అనేది దక్షిణ భారతదేశంలో ప్రత్యేక కళ. ఇది ‘టెంపుల్ ఆర్ట్’గా కూడా ప్రసిద్ధి. ఆలయాల పైకప్పుల మీద ఎక్కువగా ఈ కళావైభవం కనిపిస్తుంటుంది. వీటిల్లో మళ్లీ కేరళ మ్యూరల్ పెయింటింగ్స్ ది ప్రత్యేక శైలి. గురువాయూరులోని శ్రీకృష్ణ ఆలయంలో, మరికొన్ని ఆలయాల్లో ఇవి విశేషంగా సాక్షాత్కరిస్తాయి. ఈ చిత్రకళా ప్రక్రియ 9 – 12 వ శతాబ్దాల మధ్యలో బాగా ప్రాచుర్యం పొందింది. ఆ కాలంలో రాజుల ప్రోత్సాహంతో కుడ్యచిత్రకళ మనుగడ సాగించింది. ముఖ్యంగా కేరళలోని ఎట్టమన్నూరు శివాలయంలో, మట్టన్ చెరి రాజప్రాసాదంలో.. రామాయణ ఘట్టాల మ్యూరల్స్, కృష్ణపురం ప్యాలెస్‌లో గజేంద్రమోక్షం ఘట్టం, అనంత పద్మనాభస్వామి ఆలయం పైకప్పు మీద.. ఈ మ్యూరల్ పెయింటింగ్స్ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అయితే.. ఇంత వరకు ఎక్కడా మహాభారతంపై మ్యూరల్ పెయింటింగ్స్ పెద్దగా లేవు. ఈ లోటును భర్తీ చేయడానికా అన్నట్లు ఇప్పుడు ప్రిన్స్ తొన్నక్కల్ కుడ్య చిత్రాలను రూపొందించి, వాటితో ఒక విశేష ప్రదర్శన ఇచ్చారు. నూటా పదమూడు ఘట్టాలు ప్రిన్స్ తొన్నక్కల్ కేరళకు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు. ఆయన శిష్యురాళ్లైన ముప్పై ఐదు మంది రూపొందించిన ‘మ్యూరల్ మహాభారతం’ ఇప్పుడు దక్షిణ భారతంలో ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంటోంది. భారతీయ ఇతిహాసమైన మహాభారతాన్ని ఈ బృందం 113 కుడ్య చిత్రాలనుగా ప్రదర్శించింది. చెన్నైలోని లలిత కళా అకాడమీలో పదిరోజులు జరిగిన ఈ మ్యూరల్ మహాభారతం చిత్రలేఖనాల ప్రదర్శన ముగింపులో వీటిని రూపొందించిన మహిళామణులు, వారి గురువు సత్కారాలను అందుకున్నారు. విశేషం.. విశ్వరూప దర్శనం ప్రిన్స్ తొన్నక్కల్‌కు ‘మహాగురువు’ అని పేరు. మ్యూరల్ పెయింటింగ్స్‌లో మహాభారతాన్ని రూపొందించాలన్నది ఆయన కల. దీనిని సాకారం చేసేందుకు ఆయన శిష్యురాళ్లు నడుం బిగించారు. మొత్తం కుడ్య చిత్రాలలో మహిళా శిష్యులు ఒక్కొక్కరూ 3 నుండి 4 పెయింటింగ్స్ ను రూపొందించగా గురువు ప్రిన్స్ తొన్నక్కల్ మహాభారతంలోని చివరి ఘట్టమైన విశ్వరూప దర్శనాన్ని ఒక చిత్రంగా తయారుచేశారు. ఈ ప్రాజెక్టులో కేరళలోని కొల్లం, కొట్టాయం, తిరువనంతపురానికి చెందిన మహిళా చిత్రకారులు అధికం ఉన్నారు. తమిళనాడు నుండి 8 మంది, ఢిల్లీ నుంచి ఒకరు, దుబాయ్ నుండి ఒకరు ఉన్నారు. ముందుగా మహాభారత ఘట్టాలను చిత్రీకరించి, ప్రకృతి సహజమైన పంచవర్ణ రంగులతో వాటిని తీర్చిదిద్దారు. ఈ మొత్తం ‘మ్యూరల్ మహాభారతం’ థీమ్ తయారీకి వీళ్లంతా నాలుగేళ్లు శ్రమించాల్సి వచ్చింది. – సంజయ్ గుండ్ల, సాక్షి టీవీ, చెన్నై -
మహాభారతంలో ఇంటర్నెట్ ఉంది : సీఎం
అగర్తలా, త్రిపుర : భారతీయ జనతా పార్టీ మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ వ్యాఖ్యలను మరువక ముందే ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అగర్తలాలోని ఓ ఈవెంట్‌కు హాజరైన మహాభారత కాలంలోనే ఇంటర్నెట్, ఉపగ్రహ వ్యవస్థ భారత్‌కు అందుబాటులో ఉన్నాయని అన్నారు. మహాభారత సంగ్రామంలో ఎప్పటికప్పుడు ఏం జరగుతుందో సంజయ ద్రుతరాష్ట్రుడి తెలియజేశాడని, అది ఇంటర్నెట్ వల్లే సాధ్యం అయిందని చెప్పారు. అయితే, ఈ టెక్నాలజీ అప్పట్లోనే ఉందని మనకు తెలియలేదని అన్నారు. ఇంటర్నెట్ను పాశ్చాత్య దేశాలు కనుగొన్నాయని భావించే ప్రతిఒక్కరూ లక్షల సంవత్సరాల క్రితమే భారత్ ఇంటర్నెట్ను వినియోగించిందని తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. సాంకేతికతకు పుట్టినిల్లు అయిన భారత్‌లో జన్మించినందుకు తనకు గర్వంగా ఉందన్నారు. ఇంటర్నెట్ వంటి అద్భుత సాంకేతికతను దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ అందరికీ అందుబాటులోకి తెస్తున్నారని అన్నారు. కాగా, విప్లవ్ వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో జోకులు పేలుతున్నాయి. బీజేపీలో ఉంటూ కెరీర్‌ను అభివృద్ధి పథాన నడిపించుకోవాలంటే స్టూపిడ్ కామెంట్స్ చేయాలని ఒకరు. అవునా..!! అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, కొందరు నిపుణులు విప్లవ్ కామెంట్లపై ప్రశ్నలు సంధించారు. మీరు చెప్పిందే నిజమైతే పద్మవ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుడు ఎలా వెనక్కురావాలో క్వొరాలో అడగలేదు ఎందుకు? అని ప్రశ్నించారు. కొద్ది రోజుల క్రితం సత్యపాల్ డార్విన్ సిద్ధాంతాన్ని తప్పుబట్టిన విషయం తెలిసందే. This raises a few questions. Why didn't Abhimanyu ask Quora how to escape the Chakravyuha? Why did Sanjay narrate the Kurukshetra War when Siri could have done it? Also, Krishna really should have streamed the Bhagavad-Gita on Facebook Live. #Mahabharata — Audrey Truschke (@AudreyTruschke) 17 April 2018 How to build your career in BJP. Say stupider things than your supreme leader. 🤦♂️https://t.co/jTKLGJ6Zug — Sasidharan Pazhoor (@inquestioner) 17 April 2018 -
'మహాభారత'లో నటిస్తా : ప్రభాస్
బాహుబలి 2 ప్రమోషన్ లో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రస్తుతం కేరళలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న ది మహాభారత సినిమాపై స్పందించాడు. 1000 కోట్ల బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న మహాభారతలో కీలకమైన భీముడి పాత్రకు మోహన్ లాల్ కరెక్ట్ చాయిస్ అన్నాడు ప్రభాస్. అంతేకాదు.. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మరేదైన పాత్రకు తనను సంప్రదిస్తే అందులో నటించేందుకు సిద్ధమే అంటూ ప్రకటించాడు. ఇప్పటికే కృష్ణుడి పాత్రకు మహేష్ బాబును సంప్రదించే ఆలోచనలో ఉన్న మహాభారత టీం.. ప్రభాస్‌ను ఇతర పాత్రలకు కన్సిడర్ చేస్తారేమో చూడాలి. ప్రభాస్ లీడ్ రోల్ లో తెరకెక్కిన బాహుబలి 2 ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 9000 వేల థియేటర్లలో బాహుబలి 2 రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. -
మహాభారతాన్ని తప్పకుండా తెరకెక్కిస్తా : రాజమౌళి
బాహుబలి 2 రిలీజ్ కు రెడీ కావటంతో రాజమౌళి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై చర్య మొదలైంది. గతంలో పలు సందర్భాల్లో తాను మహాభారతాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నానని రాజమౌళి చెప్పటంతో బాహుబలి తరువాత మహాభారతమే సెట్స్ మీదకు వెళ్తుందని భావించారు. అయితే రాజమౌళి మాత్రం మహాభారతానికి తెర రూపం ఇచ్చేంత అనుభవం తనకింకా రాలేదని అందుకు ఇంకా సమయం పడుతుందని చెపుతూ వస్తున్నాడు. తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ 1000 కోట్ల తో మహాభారతాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించటంతో మరోసారి రాజమౌళి మహాభారతం చర్చకు వచ్చింది. మోహన్ లాల్ అంత భారీగా రూపొందించిన తరువాత తిరిగి రాజమౌళి అదే కథను తీస్తాడా అన్న అనుమానం వ్యక్తం అయ్యింది. అయితే ప్రస్తుతం బాహుబలి 2 ప్రమోషన్ లో బిజీగా ఉన్న జక్కన మహాభారతం తీసే ఆలోచనపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. తాను తప్పకుండా మహాభారతాన్ని తెరకెక్కిస్తానని చెప్పాడు. అయితే అదే మరో ఏడాదిలోనా.. లేక పదేళ్ల తరువాతనా అన్న విషయం మాత్రం ఇప్పుడే చెప్పలేనని తెలిపాడు. మహాభారతం మహాసముద్రమన్న జక్కన అందులో మోహన్ లాల్ టీం కొంత తీస్తే నేను కొంత తీస్తానని అలా ఎంతమందైనా చేయోచ్చని తెలిపాడు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. -
ఛోటా భీమ్లా ఉంటావు.. నీకు భీముడి పాత్రా?
సెలబ్రిటీలను నిత్యం దూషిస్తూ.. విమర్శిస్తూ వార్తలు నిలువడం హాబీగా పెట్టుకున్నాడు కమాల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కే. నిత్యం బాలీవుడ్ నటులపై దుమ్మెత్తిపోయే ఆయన తాజాగా మలయాళ నటుడు మోహన్‌లాల్‌పై పడ్డాడు. రూ. వెయ్యికోట్ల భారీ బడ్జెట్‌తో దుబాయ్ బిలియనీర్ బీఆర్ శెట్టీ తీయనున్న మహాభారతం చిత్రంలో తాను భీముడి పాత్ర పోషిస్తున్నట్టు మోహన్‌లాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని తీవ్రంగా తప్పుబడుతూ కేఆర్కే ట్వీట్ చేశాడు. ’మోహన్‌లాల్ సర్. మీరు ఛోటా భీమ్లా కనిపిస్తారు. ఇంకా ఎలా మహాభారతంలోని భీముడి పాత్రను పోషిస్తారు? (నిర్మాత) బీఆర్ శెట్టీ డబ్బును మీరెందుకు వృథా చేయాలనకుంటున్నారు’ అంటూ ప్రశ్నించాడు. కంప్లీట్ యాక్టర్‌గా పేరొందిన మోహన్‌లాల్‌ను కించపరుస్తూ కేఆర్కే ఈ వ్యాఖ్య చేయడంతో కేరళ నెటిజన్లు భగ్గుమన్నారు. కేఆర్కేకు తెలియని మలయాళ భాషలో విరుచుకుపడుతూ వేలాది మెసేజ్‌లు ట్విట్టర్లో వెల్లువెత్తాయి. తిడుతూ.. తూలనాడుతూ, కించపరుస్తూ, బెదిరిస్తూ వందలాది ట్వీట్ల వరద వెల్లువెత్తింది. దీంతో బిత్తరపోయిన కేఆర్కే మళ్లీ ట్వీట్ చేస్తూ.. ‘మలయాళీలు ఎందుకు నన్ను పొద్దటి నుంచి తిడుతున్నారో అర్థం కావడం లేదు. భీముడి ఆయుధమంతా కూడా ఉండని మోహన్‌లాల్ భీముడి పాత్ర పోషించాలనుకోవడం సరికాదని నేను అనడం తప్పా’ అంటూ మరోసారి నోరుపారేస్తున్నాడున. మరోవైపు మోహన్‌లాల్ పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదంటూ కేఆర్కేను నెటిజన్లు చెడామడా వాయిస్తున్నారు. -
వెయ్యికోట్ల ’మహాభారత్’ ఖరారు.. లీడ్ రోల్ ఎవరిది?
-
మహాభారతాన్ని నిర్మించబోతున్న దుబాయ్ బిలియనీర్
కొచీ: ప్రతిష్టాత్మక వెయ్యికోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న మహాభారత్ చిత్రానికి నిర్మాత ఖరారయ్యాడు. యూఏఈకి చెందిన భారత వ్యాపారవేత్త బీఆర్ శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారతదేశంలోనే అతిపెద్ద మోషన్ ప్రాజెక్టుగా భావిస్తున్న ఈ ప్రాజెక్టులో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ముందుకొచ్చారు. మరోవైపు ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ కీలక పాత్రపోషించనున్నారు. ప్రముఖ యాడ్ ఫిలిం రూపకర్త వి.ఎ. శ్రీకుమార్ మేనన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ ఎంటీ ప్రాజెక్ట్ ఈ మూవీని రూపొందించనుంది. ఈ చిత్రంలో కీలకమైన భీముడి పాత్రలో సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ మోహన్ లాల్ కనిపించనున్నారు. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ఖాతాలో అధికారికంగా ప్రకటించారు. దీంతోపాటు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో భీమ పాత్రకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని మోహన్ లాల్ తెలిపారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్య వాదాలు తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళిల డ్రీమ్ సినిమా మహాభారత్ మూవీని, ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎం.టి వాసుదేవన్ నాయర్ రాసిన ‘రాందమూళం’ నవల ఆధారంగా ఈ సినిమాను 150 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 2018న మొదలుపెట్టి 2020కి రిలీజ్ చేయనున్నారు. అలాగే మొదటి భాగం విడుదలైన 90 రోజుల్లోనే రెండవ భాగాన్ని విడుదల చేయనున్నారని సమాచారం. అంతే కాకుండా ఈ సినిమా కోసం నటీనటులను టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎంపికచేయనుండగా, వారిని ఒక అంతర్జాతీయ దర్శకుడు ఎంపిక చేయనుండడం విశేషం. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రపంచ సినిమా లో గొప్ప పేర్లు ఉత్తమ ప్రతిభగల, సాంకేతిక సిబ్బంది, ఇతర అకాడమీ అవార్డు విజేతలు సహా పాపులర్ నటులతో రూపొందనున్న ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు, తమిళంతోపాటు ఇతర విదేశీ భాషల్లోకి డబ్బింగ్ చేయనున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. -
నిజమే... మహాభారతమే!
ఇంతకు ముందోసారి హిందీ హీరో ఆమిర్‌ఖాన్‌ను కలసినప్పుడు మహాభారతం గురించే మాట్లాడానని దర్శకుడు రాజమౌళి స్పష్టం చేశారు. హిందీ హిట్ ‘దంగల్’ ప్రచార కార్యక్రమాలకు హైదరాబాద్ వచ్చిన ఆమిర్‌ను ఇదే అంశమై ప్రశ్నించగా... ‘‘రాజమౌళిని ఓసారి కలిశా. కానీ, సినిమా గురించి ఏం మాట్లాడలేదు’’ అన్నారు. ఒకవేళ రాజమౌళి కలల సినిమా ‘మహభారతం’లో ఛాన్స్ వస్తే నటిస్తారా? అని ఆమిర్‌ను అడగ్గా... ‘‘కృష్ణుడిగా నటించడానికి ఇష్టపడతా’’ అన్నారు. అమితాబ్ బచ్చన్, మోహన్‌లాల్, ఆమిర్‌ఖాన్ ముఖ్య పాత్రధారులుగా సుమారు 600 కోట్లతో మహాభారతాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం జరిగింది. దీనిపై తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ – ‘‘ఇంతకు ముందు చెప్పినట్టు మహాభారతాన్ని చిత్రంగా తీయాలనుంది. తప్పకుండా చేస్తా. కానీ, ‘బాహుబలి’ తర్వాత మాత్రం కాదు. ‘మహా భారతం’ అనేది క్లాసిక్, ఓ ఎపిక్. నాకు టైమ్ కావాలి. ఆమిర్‌ఖాన్‌తో ‘మహాభారతం’ గురించి చర్చించిన మాట వాస్తవమే. ఈ సినిమా చేయాలని ఆయన కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు’’ అన్నారు. -
రాజమౌళి బాటలో షారూఖ్..!
బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించిన దర్శకధీరుడు రాజమౌళి, త్వరలో మహాభారతాన్ని మరింత భారీగా వెండితెర మీద ఆవిష్కరించాలనుందని తెలిపాడు. అయితే ఇంతటి భారీ కథను తెరకెక్కించడానికి తన అనుభవం సరిపోదన్న జక్కన ఎప్పటికైనా మహాభారతాన్ని తెరకెక్కిస్తానని ప్రకటించాడు. అయితే రాజమౌళి ఈ ఆలోచనలో ఉండగానే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మహాభారతాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. ఆరు వంద కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా మరో హీరో కూడా మహాభారతాన్ని తెరకెక్కించాలని ఉందని ప్రకంటించాడు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మహాభారతాన్ని వెండితెరకెక్కించటం నా కల అని ప్రకటించాడు. 'నేను చాలా ఏళ్లుగా ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.. కానీ అంత బడ్జెట్ కేటాయించటం నా వల్ల అవుతుందని నేను అనుకోవటం లేదు. అందుకే ఏదైన హాలీవుడ్ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లుందుకు ప్రయత్నిస్తున్నా. జనవరిలో మహాభారతం తెరకెక్కించటం పై స్పందించిన రాజమౌళి, తనకు ఆలోచన ఉన్నా వెంటనే అదే సినిమా చేసే అవకాశం లేదని తెలిపాడు. షారూఖ్ కూడా మహాభారతం తెరకెక్కించాలన్న కోరిక ఉందని చెప్పినా.. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. అందులో షారూఖ్ ఏ పాత్రలో కనిపించనున్నాడు లాంటి అంశాలను మాత్రం ప్రస్థావించలేదు. -
కమల్‌హాసన్ ముస్లిమా..? అసలు పేరు..
హీరో కమల్‌హాసన్ ముస్లిమా?. కాదు. కానీ, ఆదివారం ఓ జాతీయ దినపత్రికలో వచ్చిన కాలమ్‌లో లెజండరీ హీరో హిందూ వ్యతిరేక కామెంట్లు చేశారని, ఆయన ఇస్లాంను నమ్ముతారని కాలమిస్టు ఆరోపించారు. కాలమ్ వివాదాస్పదంగా మారడంతో ఆన్లైన్ వెర్షన్ లోని కాలమ్ నుంచి వివాదాస్పద పేరాగ్రాఫ్‌ను తొలగించారు. కమల్ తన మతాన్ని మరచి హిందూ, ముస్లింల మధ్య భేదాలను పొడసూపేలా ప్రవర్తిస్తున్నారని కాలమిస్టు తొలగించిన పేరాగ్రాఫ్‌లో వ్యాఖ్యానించారు. ఆయన మతానికి చెందిన వాళ్లే మహిళను అవమానించారనే విషయాన్ని మరిచిపోయి ఓ ముస్లింలా మాట్లాడుతున్నారని అన్నారు. మహాభారతం లాంటి వాటిపై కామెంట్లు చేయడం కన్నా.. సమకాలీన సమస్యలైన త్రిపుల్ తలాక్ లాంటి వాటిపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. మతాలపై మాట్లాడటప్పుడే ఒళ్లు దగ్గరపెట్టుకుంటే బాగుంటుందని అన్నారు. అసలు కాలమిస్టు కమల్‌ను ఓ ఇస్లామిస్టుగా పేర్కొనడానికి కారణం.. ఆయన మహాభారతాన్ని ఉద్దేశించి చేసిన ఓ కామెంట్. కొద్ది రోజుల కిందట కమల్ ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వూ ఇచ్చారు. రెండు కుటుంబాల గొడవల్లో ఓ మహిళను పెట్టి జూదం ఆడిన వాళ్ల పండుగను దేశంలో ఎందుకు జరుపుకుంటారో తనకు అర్ధం కాదని అన్నారు. కమల్ అసలు పేరు ఇది.. తాను దేవుడిని నమ్మనని కమలే చెప్పారు. కమల్ 1952లో తమిళ బ్రహ్మణులైన అయ్యంగార్ల కుటుంబంలో జన్మించారు. చెన్నైలోని పల్లవుల కాలానికి చెందిన ఓ గుడిలో 'పార్ధసారధి' అని తల్లిదండ్రలు నామకరణం చేశారు. కొద్దికాలం తర్వాత తండ్రి శ్రీనివాసన్ పార్ధసారధి పేరును కమల్‌హాసన్‌గా మార్చారు. అయితే, కమల్‌హాసన్ అని పేరును మార్చడం వెనుక కొన్ని ఇతర కారణాలున్నాయని గతంలో ఆన్లైన్లో న్యూస్ హాల్చల్ చేసింది. యాకూబ్ హసన్ అనే తన ఫ్రెండ్ గుర్తుగా శ్రీనివాసన్ కమల్‌కు కమల్‌హాసన్ అని పేరు పెట్టారని దీని సారాంశం. ఈ వార్తలను అప్పట్లో కమల్ ఖండించారు. కమల్ అంటే పద్మం అని, హాసన్ అనే పదం హాస్యం నుంచి వచ్చిందని చెప్పారు. కాగా, జాతీయ దినపత్రికలో వచ్చిన కాలమ్ దేశంలో పెచ్చరిల్లుతున్న మత ఆపాదనలను ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా స్వేచ్చగా మాట్లాడే హక్కును ఇది హరిస్తుంది. -
బలరామ సత్యభామల గర్వభంగం!
ముక్కోపిగా, ముఖస్తుతికి లోబడే వ్యక్తిగా మహాభారతంలో కనిపించే బలరామునిలో తన శౌర్యపరాక్రమాలపై మితిమీరిన విశ్వాసం. కృష్ణుని ప్రియపత్నిగా పేరొందిన సత్యభామకు తన అందచందాలమీద ఎనలేని నమ్మకం. వీరికి తగిన గుణపాఠం చెప్పేందుకు శ్రీకృష్ణుడు సమయం కోసం ఎదురు చూస్తుండగా తగిన అవకాశం ఆంజనేయుడి రూపంలో రానే వచ్చింది. త్రిలోక సంచారి అయిన నారదుడు నారాయణ నామస్మరణ చేస్తూ వెళ్తుండగా ఆ దాపులనే రామనామాంకిత ధ్యానంలో మునిగిపోయి ఉన్న ఆంజనేయుడు కనిపించాడు. నారదుడు కావాలనే శ్రీరామ స్మరణ చేశాడు. రామనామం వినగానే ఆంజనేయుడు పరుగున వచ్చి నారదుని ముందు వాలి, ‘‘ఓ రుషిపుంగవా, నా రామయ తండ్రి నామాన్ని స్మరిస్తున్నావంటే నీకు తప్పకుండా రామునితో అవినాభావ సంబంధం ఉండే ఉంటుంది. నా స్వామిని చూసి చాలా కాలం అవుతోంది. ఒక్కసారి ఆయనను దర్శించుకోవాలని నా మనస్సు కొట్టుకులాడుతోంది. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్పగలవా?’’ అంటూ అర్థించాడు. ‘‘ఓ వానరా! రాముణ్ని నేను చూసి కూడా చాలా కాలమయింది. అయితే రామునికంటే అధిక శౌర్యపరాక్రమాలు కలవాడు, సీతమ్మకన్నా అందమైనదీ అయిన శ్రీకృష్ణ సత్యభామలు సమీపంలోనే ఉన్నారు. చూడాలనుంటే చెప్పు, తీసుకెళతాను’’ అన్నాడు.‘‘ఏమిటీ, నా రామయ్య తండ్రి కన్నా బలమైనవాడు, సీతమ్మ తల్లికన్నా సౌశీల్యమైన స్త్రీ మరొకరున్నారా? నన్నొకసారి అక్కడికి తీసుకెళ్లు. నేను చూసిన తర్వాత వారు అలా లేకపోవాలీ, నీ పని చెబుతాను’’ అంటూ నారదునితో కలసి ద్వారకను చేరాడు. ఆంజనేయుడు బయటేఉండి, ‘‘రామబంటునైన నేను అన్యుల మందిరానికి రాను. నీవే నీ కృష్ణుని ఇక్కడకు రమ్మను’’ అంటూ నారదుని లోనికి పంపించాడు. నారదుడు రాజప్రాసాదానికేగి, సత్యభామాసమేతంగా బలరాముడి చెంత ఆసీనుడైన గోపాలకృష్ణుని చూస్తూ ‘‘కృష్ణా! హనుమంతుడనే ఒక వానరాగ్రగణ్యుడు నీ దర్శనం కోసం ద్వారంలో వేచి ఉన్నాడు. అతడు మిమ్మల్నే తన కడకు రమ్మంటున్నాడు. ఒకవేళ రాకపోతే నీ మందిరాన్ని నాశనం చేసి, ద్వారకను సముద్రంలో ముంచేస్తానంటున్నాడు. నువ్వు త్వరగా పద, ఆ వానరాగ్రేసరుడిని దర్శించుకుందువు’’ అంటూ తొందర చేశాడు నారదుడు. అహకారంలోనూ, మితిమీరిన ఆత్మాభిమానంలోనూ ఒకరికొకరు ఏమాత్రం తీసిపోని సత్యభామ, బలరాములు వెంటనే అమితాగ్రహంతో ‘‘నారదా! ఒక వానరం వస్తే, వానిని చూడటానికి కృష్ణుడే స్వయంగా వెళ్లాలా? అలా రాకపోతే ఆ కోతి ద్వారకనే పెళ్లగించి సముద్రంలో పడేస్తుందా? ఏమిటీ వింత? ముందు నేనెళ్లి, వాడి సంగతి తేలుస్తాను’’ అంటూ తన హలాయుధాన్ని భుజానేసుకుని బయటికొచ్చాడు బలరాముడు. అతణ్ణి అనుసరించబోయింది సత్యభామ. బలరాముడు బయటకు వచ్చి, ఆంజనేయుణ్ణి చూసి, ‘‘ఓయీ, వృద్ధ వానరమా! నా తమ్ముడు కృష్ణుని చూడటానికి వచ్చి అతనినే బయటకు రమ్మంటున్నావా? నీకెంత అహంకారం? నువ్వు ద్వారకనే సముద్రంలో ముంచెయ్యగలిగేంత మొనగాడివా? ముందు నన్ను గెలువు, ఆ తర్వాత బతికుంటే చూద్దువుగాని’’ అంటూ దూసుకురాబోయిన బలరాముణ్ణి హనుమ తన తోకతో చుట్టి విసిరికొట్టబోతుండగా, నారదుడు ‘‘హనుమా! లోపల ఉన్నది రాముడే, ఈయన అతనికి ప్రియ సోదరుడు సుమీ’’ అంటూ హెచ్చరించాడు. హనుమ వెంటనే బలరాముణ్ణి తన భుజాల మీద కూర్చుండబెట్టుకుని లోపలకు దారితీశాడు. ఈ లోగా కృష్ణుడు సత్యభామతో ‘‘భామా! నువ్వు సీతమ్మలా అలంకరించుకునిరా’’ అంటూ తాను రామునిలా రూపు మార్చుకున్నాడు. ఈలోగా హనుమలోనికి రానే వచ్చాడు. వస్తూనే కృష్ణునికి నమస్కరించి, ‘‘ఎన్ని యుగాలయ్యింది స్వామీ నిన్ను చూసి?’’ అంటూ గాఢాలింగనం చేసుకుని, ‘‘నీ పక్కనే ఉన్న ఈమె ఎవరు స్వామీ ఎంతో వికారంగా ఉన్నా, ఇన్ని నగలు అలంకరించుకుని ఉంది? ఇంతకూ నా తల్లి సీతమ్మ ఎక్కడ’’ అంటూ ప్రశ్నించాడు. సరిగ్గా అప్పుడే మందిరంలోనికి అతి సామాన్యమైన చీర, కట్టుబొట్టు... ప్రశాంతమైన ముఖం, పెదవులపై చిరునగవే ఆభరణాలుగా ప్రవేశించిన రుక్మిణిని చూస్తూనే హనుమ ‘‘వచ్చావా సీతమ్మా’’ అంటూ చివాల్న ఆమె పాదాల మీద వాలిపోయాడు. హనుమ తోకతో చుట్టివేయడంతోనే ఒళ్లంతా ఉండచుట్టుకుపోయిన వీరాధివీరుడు, బలాఢ్యుడు అయిన బలరాముడు, అతిలోక సౌందర్యరాశి, ఐశ్వర్యవంతురాలు అయిన సత్యభామలు సిగ్గుతో తలలు వంచుకున్నారు. -
స్నేహ పురాణం
నేడు స్నేహితుల దినోత్సవం స్నేహం గురించి, స్నేహం ఔన్నత్యాన్ని గురించి రామాయణమహాభారతాలలో అద్భుతంగా వర్ణించారు. రామాయణంలోని శ్రీరామ సుగ్రీవుల మైత్రి, మహాభారతంలో కుచేల శ్రీకృష్ణుల మైత్రి, కర్ణదుర్యోధనుల మైత్రీబంధం... ఈ మూడు స్నేహాలూ గొప్పవే. అయితే ఒక్కొక్క స్నేహంలో ఒక్కో కోణం ఉంది. ముందుగా రామాయణం విషయానికొస్తే... అవసరానుగుణమైన స్నేహం రామసుగ్రీవులది... తన ప్రియసఖి సీతను వెదుకుతూ అడవిమార్గంలో వెళుతున్నాడు రాముడు తన సోదరుడు లక్ష్మణునితో కలిసి. వారిని చూసిన వానర రాజు సుగ్రీవుడు తన అన్న వాలి తనను సంహరించడానికి ఎవరినో పంపాడేమోనని భయపడ్డాడు. అది గమనించిన ఆంజనేయుడు వారి రాకకు కారణం తెలుసుకుని, అటు రాముడికీ, ఇటు సుగ్రీవుడికీ ప్రయోజనం చేకూరే విధంగా వారి మధ్య మైత్రి కుదిర్చాడు. ఇది పరస్పర ప్రయోజనాన్ని చేకూర్చేదే అయినా, రాముడితో పోల్చితే సుగ్రీవుడి బలం ఏపాటి? అయితే సీతావియోగ దుఃఖంలో ఉన్న రాముడికి సుగ్రీవుడు చేస్తానన్న సాయం ఆశాకిరణంలా తోచింది. పైగా అధర్మపరుడు, అమిత బలశాలి అయిన అతడి అన్న వాలి నుంచి అతడిని కాపాడ్డం కర్తవ్యంగా భావించాడు. అందుకే సుగ్రీవుడికి తన స్నేహహస్తాన్ని అందించాడు. అంతేకాదు, వాలిని సంహరించి, సుగ్రీవుడికి రాజ్యాన్ని కట్టబెట్టేవరకు అండగా నిలిచి స్నేహధర్మానికి మారుపేరుగా నిలిచాడు. సుగ్రీవుడు కూడా అమిత బలపరాక్రమాలు గల ఆంజనేయుడి తో సహా ఎందరో వానర వీరులను సీతాన్వేషణలో భాగస్వాములను చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇక్కడ గ్రహించలసిందేమంటే, రాముడు బలశాలి అయిన వాలితో స్నేహం చేస్తే, అతని సాయంతో అవలీలగా రావణుని జయించగలడు. కానీ బలహీనుడైన సుగ్రీవుడితోనే స్నేహం చేశాడు. అవతలివారి ధనబ లాన్నో, అంగబలాన్నో చూసి, వారితో స్నేహం చేయాలని ఉవ్విళ్లూరేవారు ఇది గ్రహించాలి. పూలూ దారంలాంటి స్నేహం శ్రీకృష్ణ కుచేలురది... శ్రీకృష్ణుడు, కుచేలుడు సాందీపుని ఆశ్రమంలో సహాధ్యాయులు, స్నేహితులు. కాల క్రమేణా కృష్ణుడేమో రాజయ్యాడు, కుచేలుడేమో గంపెడంత మంది పిల్లలతో చాలీచాలని ఆదాయంతో సంసారాన్ని ఈదలేక మరింత పేదవాడయ్యాడు. దుర్భరమైన పరిస్థితుల్లో భార్య సలహా మేరకు స్నేహితుడైన కృష్ణుడి వద్దకు బయలేరాడు సాయం కోరడానికి. ఉట్టిచేతులతో వెళ్లలేక ఇంట్లో ఉన్న కాసిన్ని అటుకులను మూటకట్టుకుని వెళ్లాడు. అతని అవతారాన్ని చూసిన ద్వారపాలకులు లోపలికి పోనివ్వకుండా అడ్డుపడ్డారు. కృష్ణుడది చూసి వారిని వారించి, ఎదురెళ్లి మరీ బాల్యస్నేహితుడికి ఘన స్వాగతం పలికాడు. కావలించుకుని, కుశలప్రశ్నలు వేస్తూ, నాకోసం ఏం తెచ్చావని అడుగుతూనే అతని మూటలో ఉన్న అటుకులను చూసి, వాటినే ఎంతో ప్రీతితో తిన్నాడు. రాచమర్యాదలతో అతనికి ఆతిథ్యమిచ్చాడు. ఈ స్నేహమాధుర్యంలో తడిసి ముద్దయిన కుచేలుడు తానక్కడికెందుకు వచ్చాడో కూడా మర్చిపోయాడు. అయితే కృష్ణుడు ఆ మాత్రం గ్రహించకుండా ఉంటాడా... స్నేహితుడు ఇల్లు చేరేసరికే అతని దారిద్య్రాన్ని తీర్చేశాడు. తరాలపాటు కూర్చుని తిన్నా తరగని సంపదను ఇచ్చాడు. స్నేహమంటే అది! తాను రాజైనా, అవతలివాడు కూటికి లేని పేదవాడైనా సరే, తనను వెతుక్కుంటూ వచ్చిన మిత్రుడు నోరు తెరిచి అడక్కుండానే అతనిక్కావలసిన దానిని అనుగ్రహించాడు. అడిగేవరకూ ఊరుకోలేదు. అడగాలని కోరుకోలేదు. అవసరమైనది ఇచ్చాడు. అవసరార్థస్నేహం కర్ణదుర్యోధనులది... వీరిద్దరూ గొప్ప స్నేహితులనే విషయాన్ని ఎవరూ కాదనలేరు కానీ వారిది కేవలం అవసరానుగుణమైన స్నేహమే. ఒకరి స్వార్థం కోసం ఒకరు స్నేహితులయ్యారు. ఎలాగంటే కర్ణుడు కూడా రాజపుత్రుడే! సూర్యుని అనుగ్రహంతో సహజ కవచకుండలాలతో జన్మించిన ఉత్తమ కుల సంజాతుడే!! అయినప్పటికీ, కారణాంతరాలవల్ల సూతపుత్రుడుగా పెరిగిన వాడు కాబట్టి కురుపాండవుల బలాబలాల్ని పరీక్షించే క్షాత్ర పరీక్షలో అర్జునుడితో తలపడేందుకు అతి సామాన్యుడిగా, దాసీపుత్రునిగానే కొలువుకు వచ్చాడు. అతని తేజస్సును, బలపరాక్రమాలను, వీర్యశౌర్యాలను అంచనా వేసిన దుర్యోధనుడు అతడు తనకు బాగా పనికి వస్తాడని గ్రహించి, అప్పటికప్పుడు అంగరాజ్యానికి రాజును చేశాడు. కర్ణుడు కూడా తానెవరో, తన అర్హత ఏమిటో, దుర్యోధనుడు తనను రాజుగా ఎందుకు చేస్తానంటున్నాడో తెలుసుకోలేనంతటి అమాయకుడు కాడు. అయినా సరే, అంగరాజుగా సుయోధన సార్వభౌమునితో పట్టం కట్టించుకున్నాడు. ఆ కృతజ్ఞతాభావంతోనే దుర్యోధనుడికి ఆఖరివరకు అండగా నిలిచాడు. తెలిసి తెలిసీ, తన వీర్యశౌర్యపరాక్రమాలన్నింటినీ నీచుడు, స్వార్థపరుడు, అధికార దాహంతో తపించిపోయే దుర్యోధనుడికే ధారపోశాడు. దుర్యోధనుడు కూడా కర్ణుడున్నాడనే ధైర్యంతోనే పాండవులతో పోరాటానికి సిద్ధపడ్డాడు. అర్జునుడి చేతిలో చస్తాడని తె లిసినా, కర్ణుడిని తన స్వార్థానికే ఉపయోగించుకున్నాడు. స్నేహమనేది వీరిలా ఉండకూడదని నిరూపించారు ఇద్దరూ. -
పర్షియన్ మహాభారతం
జాతస్య హి ద్రువో మృత్యుః పూర్తి కాకుండానే అది మహాభారతంలోని భగవద్గీత శ్లోకమని ఠక్కున చెప్పేస్తాం. మన ఇతిహాసాలు సగటు భారతీయుడిపై అంతగా ముద్ర వేశాయంటే అతిశయోక్తి కాదు. అయితే ‘పర్షియన్ మహాభారతం’ గురించి ఎప్పుడైనా విన్నారా? పర్షియాలో మహాభారతమేంటని అనుమానపోకండి. సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన ఈ మహాగ్రంథాన్ని 400 ఏళ్ల కిందట అక్బర్ సంస్థానంలోని ‘నవరత్నా’ల్లో ఒకరైన అబుల్ ఫజిల్ పర్షియన్లోకి కూడా అనువాదం చేశారు. ఆ గ్రంథం ఇప్పటికీ చెక్కు చెదరకుండా జామియా నిజామియా గ్రంథాలయంలో భద్రంగా ఉంది. ..:: ఎస్.శ్రావణ్‌జయ భాగ్యనగర దర్పానికి చిహ్నంగా నిలిచే చార్మినార్కి మూడు కిలోమీటర్ల దూరంలోని శిబ్లి గంజ్‌లో పురాతన జామియా నిజామియా లైబ్రరీ ఉంది. 144 ఏళ్ల కిందట జామియా మహమ్మద్ అల్ ఫరూకీ 1874లో దీన్ని ఏర్పాటు చేశారు. తొలుత 25 వేల పుస్తకాలతో ప్రారంభం కాగా, ప్రస్తుతం లక్ష పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పర్షియన్‌తో పాటు ఇక్కడ ఉర్దు, అరబిక్, హిందీ, ఇంగ్లిష్ భాషల్లోని పుస్తకాలను భద్రపరిచారు. అలాగే కొన్ని తెలుగు పుస్తకాలు కూడా ఉంచారు. నిజాం నవాబు వంశంలో 6, 7తరాలకు చెందినవారు కూడా ఇక్కడే చదువుకున్నారు. బంగారు రేకులతో... జామియా లైబ్రరీలో మహాభారతంతో పాటు దాదాపు 3000 రాత ప్రతులున్నాయి. ‘మను చరిత్రకు సంబంధించి మా వద్ద ఉన్న గ్రంథాలు 200 ఏళ్లకు పూర్వం రచించినవే. అత్యంత పురాతన మను చరిత్ర గ్రంథాన్ని 700 ఏళ్లకు పూర్వమే కితాబ్ ఉల్ తబ్సేరా ఫిల్ ఆషరా రచించారు. మా లైబ్రరీలో మొత్తం 40 సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలు 5 భాషల్లో దొరుకుతాయి’ అని లైబ్రేరియన్ షా మహమ్మద్ ఫసీదుద్దీన్ నిజామియా చెప్పారు. ఇక్కడ అత్యంత పురాతనమైన ఖురాన్ గ్రంథం కూడా ఉంది. ఇందులోని మొదటి రెండు పేజీలు బంగారు రేకులతో రూపొందించారు. విద్యాదాయిని... జామియా నిజామియా ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇన్స్టిట్యూట్లో ప్రస్తుతం 1200 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి తిండి, బట్ట, వైద్యం అన్నీ ట్రస్ట్ భరిస్తుంది. దీనికి ప్రభుత్వ సాయం లేదు. కేవలం విరాళాలతోనే ఈ ట్రస్ట్ నడుస్తోంది. బర్మా, శ్రీలంక, యెమెన్, సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ నుంచి కూడా విద్యార్థులు పీహెచ్డీ చేసేందుకు ఇక్కడికి వస్తుంటారు. వారిలో కొందరికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు కూడా లభించాయి. మార్చి 21, 22తేదీల్లోలైబ్రరీ వ్యవస్థాపకుడు జామియా మహమ్మద్ అల్ ఫరూకీ 100వ వ ర్ధంతి ఘనంగా నిర్వహించనున్నారు. పరమత దూషణ, పరమత హింస అక్కడక్కడా జరుగుతున్న ఈ కాలంలో పరభాష నుంచి అనువదించిన గ్రంథాలను వందల ఏళ్ల నుంచి జాగ్రత్తగా కాపాడటం అరుదైన విషయం! -
ఎవరెలా పోయినా...నా దారి రహదారి!
పద్యానవనం తమ కార్యంబు పరిత్యజించియు బరార్థ ప్రాపకుల్ సజ్జనుల్, దమ కార్యంబు ఘటించుచున్ బరహితార్థ వ్యావృతుల్ మధ్యముల్, దమకై యన్య హితార్థ ఘాతుక జనుల్ దైత్యుల్, వృథాన్యార్థ భం గము గావించెడు వారలెవ్వరొ యెరుంగన్ శక్యమేయేరికిన్? మేలు చేయకపోతే పోయావు కీడు మాత్రం చేయబోకుమంటారు. అంటే, కనీసం తటస్థంగా ఉండమని వేడుకోలన్నమాట! అలా ఉండగలమా? ఎందుకుండలేం, బేషుగ్గా ఉండగలం. ఎవరికీ, ఎప్పుడూ అసలేమీ చేయకుండా ఉంటాం కనుక మనకే ఇబ్బందీ ఉండదనుకుంటారు చాలా మంది. నిజమే! ఏమీ చేయనప్పుడు ఏముంటుంది, మంచి-చెడులు బేరీజు వేయడానికి? ఏదైనా పూని చేస్తే కదా, మంచయినా, చెడయినా! ఎవరికో ఏదో ఎప్పుడూ చేస్తూనే ఉండాలనే తలంపుతో ఉంటారు కొందరు. మంచిదే, చేసేది మంచిదైతే. ఇక చెడిపోయేదేముంది, చేసేది చెడు కానప్పుడు, అనేది మరో తలంపు. హనుమంతుడ్ని చేయబోతే కోతయిందన్న సామెత చందంగా, ఏదో కాస్త మంచి చేద్దామని వెళితే, అక్కడ మనజోక్యం వల్లో, మనతో నిమిత్తం లేకుండానో చెడు జరిగిందనుకో... ఏం చేస్తాం! మన చేతిలో లేకుండా ఏదేదో జరిగిపోతే మనం మాత్రం చేయగలిగేదేముంటుంది? కాకపోతే మన ఉద్దేశం చెడు కాకూడదంతే! ‘యద్భావం తద్భవతిః’. మన తలంపు మంచిదయితే మంచే జరుగుతుందని పెద్దల భావన/దీవెన. మంచి చేసిన వారికి మంచి చేయడం అంత గొప్పేం కాదంటాడు బద్దెనామాత్యుడు. ‘ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ, వివరింపంగన్ అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ!’ అన్నాడందుకే. మనకు అపకారం చేసినవాడైనా, తప్పు పట్టకుండా ఉపకారం చేయడంలో ఉందట గొప్పదనం! అలా చేసిన వాడే నేర్పరి అంటాడు. మనకంత నేర్పుందా? నేర్పు, ఓర్పు, మార్పు, కూర్పు సంగతలా ఉంచితే, అసలు ముందు మనకో సంకల్పం ఉండాలి నిజంగా అలా చేయాలంటే! మనం యుగకర్తగా కీర్తించే గురజాడ అప్పారావు అందుకేనేమో! ‘....పూని ఏదైనను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్, సొంతలాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడుపడవోయ్!’ అన్నాడు. ఏదైనా సత్సంకల్పం అనేది, వారి వారి తత్వాన్ని, ఆలోచనా ధోరణిని బట్టి ఉంటుందేమో అనిపిస్తుంది. కొంతమంది పూని మంచి పనులు చేయడం వెనుక నిర్దిష్టమైన హేతువు కనబడుతుంది. ఆత్మతృప్తికో, కీర్తి కాంక్షతోనో, విశాల దృక్పథంతోనో, తమకూ మంచే జరగాలనో, వచ్చే జన్మలో సద్గతుల కోసమో... ఇలా రకరకాల కారణాలతో మంచి పనులు చేస్తుంటారు. తమ తమ స్థాయికి, తలంపునకు తగిన రీతిలో ఈ మంచిపనులకు పూనుకుంటారు. స్వార్థమో, అసూయో, ఈర్ష్యా-ద్వేషాలో... చెడు పనులు చేసేవారికీ కొన్ని కారణాలుంటాయి. కొందరి చేష్టల వెనుక ఏ లాజికూ ఉండదు. వారి గురించి భర్తృహరి అద్భుతంగా చెప్పారు తన సుభాషితాల్లో! దానికి, ఏనుగు లక్ష్మణకవి చేసిన అత్యద్భుతమైన తర్జుమాయే పై పద్యం. తాము చేపట్టే పనుల విషయంలో నాలుగు రకాలుగా ఉండే జనం గురించి చెప్పాడిందులో! ఇతరుల ప్రయోజనాల్ని కోరుకునే క్రమంలో తమ పనుల్ని కూడా వదులుకునే వారు సజ్జనులు. తమ పని చేసుకుంటూ, పనిలో పనిగా ఇతరుల పనులూ చేసి పెట్టే వారు మధ్యములు. తమ పనులు చేసుకునేందుకు వీలుగా ఇతరుల పనులను చెడగొట్టేవారు నీచులు. ఇక, ఇంకో రకం వాళ్లున్నారు, అసలు వారినేమనాలో ఎవరికీ తెలియదంటాడు. వాళ్లెవరంటే, దానివల్ల తమకు ఏ ప్రయోజనం లేకపోయినా, ఇతరుల పనుల్ని పనిగట్టుకొని చెడగొట్టేవారట. తస్మాత్ జాగ్రత్త! ఇలాంటి వారూ ఉంటారు. మనం ఆ తెగలోకి రాకుండా జాగ్రత్త పడాలి సుమా! అందుకొక చక్కని మార్గముంది. ధర్మాలలోకెల్లా ఉత్తమోత్తమమైన ధర్మంగా మహాభారతంలో చెప్పినదాన్ని పాటిస్తే చాలు. అదేంటంటారా! తిక్కన ఓ చక్కని పద్యంలో చెప్పాడీ మాట. ‘‘ఒరులేయవి యొనరించిన, నరవర అప్రియంబు తన మనంబునకగు, తానొరులకు నవి సేయకునికి పరాయణము పరమ ధర్మ పథముల కెల్లన్’’. ఇతరులు మనకు ఏం చేయకూడదని కోరుకుంటామో, అవేవీ మనం ఇతరులకు చేయకుండా ఉండటమే ఉత్తమోత్తమ ధర్మం. ‘‘ధర్మో రక్షతి రక్షితః’’. ఎవరెలా పోయినా మనం ధర్మబద్ధంగా ఉందాం, దట్సాల్! - దిలీప్‌రెడ్డి -
'కౌరవులపై పాండవులు గెలిచినట్లు..'
అలనాటి మహాభారతంలో కౌరవులపై పాండవులు గెలిచినట్లు నేడు తెలంగాణ ప్రజలు గెలిచారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీశ్‌రావు అభివర్ణించారు. మంగళవారం ఆయన మెదక్‌లో విలేకర్లతో మాట్లాడుతూ... తమతో కలిసి ఉండేవారంతా తమవాళ్లే అని పునరుద్ఘాటించారు. అయితే దోపిడి పెత్తనాన్ని మాత్రం ఒప్పకోమన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ భాగం కావాలని తమ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. -
వారం రోజుల వ్యవధిలో రెండు భారీ త్రీడీ చిత్రాలు
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోన్న టెక్నాలజీ... త్రీడి. ‘అవతార్’ తర్వాత త్రీడీ సినిమాల పట్ల అమితాసక్తి మొదలైంది. అందుకే అన్ని భాషల్లోనూ త్రీడీ సినిమాలు విరివిగా తయారవుతున్నాయి. ఆనందించదగ్గ పరిణామం ఏంటంటే - ఓల్డ్ క్లాసిక్స్‌గా పేర్గాంచిన చిత్రాలక్కూడా త్రీడీ హంగులు అద్ది, ఈ తరానికి కూడా పరిచయం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్లో రెండు త్రీడీ చిత్రాలు భారీ ఎత్తున విడుదలకు సిద్ధమయ్యాయి. ఒకటేమో యానిమేషన్ చిత్రం ‘మహాభారతం’ కాగా, మరొకటి ఇండియన్ ఎవర్గ్రీన్ ఫిల్మ్ ‘షోలే’. ఈ రెండూ వారం వ్యవధిలో విడుదల కానుండటం విశేషం. మహామహులతో ‘మహాభారతం’ ‘తింటే గారెలే తినాలి.. వింటే భారతమే వినాలి’ అనేది పాత నానుడి. ఇక ముందు... చూస్తే మహాభారతాన్ని త్రీడీలోనే చూడాలని ప్రేక్షకులు అంటారేమో. మహాభారతాన్ని ఎన్నిసార్లు విన్నా.. చూసినా తనవి తీరదనేని కాదనలేది వాస్తవం. గతంలో టెలివిజన్ సీరియల్‌గా వచ్చిన మహాభారతానికి ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మన చరిత్రలో, సంస్కృతిలో మహాభారతానికి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని.. అధునిక హంగుల్ని జోడించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు త్రీడీ టెక్నాలజీతో మహాభారతాన్ని యానిమేషన్ చిత్రంగా రూపొందించారు త్రీడీటెక్నాలజీ, యానిమేషన్‌తోపాటు బాలీవుడ్ అగ్రతారలను కూడా రంగంలోకి దించారు. భీష్మ పితామహుడి పాత్రకు సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, శ్రీకృష్ణుని పాత్రకు శతృఘ్న సిన్హా, భీమునికి సన్నీ డియోల్, అర్జునునికి అజయ్ దేవగన్, కర్ణునికి అనిల్ కపూర్, ఆదిశక్తి దుర్గకు మాధురీ దీక్షిత్, ద్రౌపదికి విద్యాబాలన్, శకునికి అనుపమ్ ఖేర్, ధర్మరాజుకి మనోజ్ బాజ్‌పేయ్, కుంతికి దీప్తి నావల్, ధుర్యోధనునికి జాకీ ష్రాఫ్‌లు డబ్బింగ్ చెప్పారు. తన 44 ఏళ్ల కెరీర్లో అమితాబ్ ఓ యానిమేషన్ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారి. అనిల్ కపూర్ 15 రోజులు, మనోజ్ బాజ్‌పేయ్ నాలుగు రోజులు డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ నెల 27న ‘మహాభారత్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘షోలే’ మాయాజాలం: 1975లో ‘షోలే’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. మీడియా ప్రభావం అంతగా లేని ఆ రోజుల్లోనే ‘షోలే’ పేరు చిన్న చిన్న పల్లెటూళ్లలో కూడా మార్మోగిపోయింది. ముఖ్యంగా ‘గబ్బర్‌సింగ్’ ఊతపదం ‘అరె ఓ సాంబా’ అందరి నాలుకలపై బాగా నానింది. జీపీ సిప్పి నిర్మాణ సారథ్యంలో రమేశ్ సిప్పీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వీరుగా ధర్మేంద్ర, జై పాత్రలో అమితాబ్ బచ్చన్లు నటించారు. పోలీస్ ఆఫీసర్‌గా సంజీవ్ కపూర్ నటించారు. హేమమాలిని, జయబాధురి తమ నటనతో ఆలరించారు. 2002లో బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో షోలే టాప్ టెన్ భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. భారతీయ సినిమా చరిత్రలో ‘షోలే’ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, ఈకాలపు ప్రేక్షకులను మరోసారి త్రీడీలో ‘గబ్బర్‌సింగ్’ ద్వారా భయపెట్టేందుకు దర్శకుడు కేతన్ మెహతా తన సంస్థ మాయా డిజిటల్ ద్వారా ఓ ప్రయోగం చేస్తున్నారు. సుమారు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 350 మంది సాంకేతిక నిపుణులతో ‘షోలే’ చిత్రాన్ని త్రీడీ ఫార్మాట్లోకి మార్చారు. సరికొత్త టెక్నాలజీతో, గత కాలపు మధురస్మృతులను మరోసారి నెమరు వేసుకోవడానికి ‘షోలే’ చిత్రం జనవరి 3న విడుదల కానుంది.