వెయ్యికోట్ల ’మహాభారత్‌’ ఖరారు.. లీడ్ రోల్‌ ఎవరిది? | Film on Mahabharata to be made with Rs 1000 cr budget; Mohanlal will play lead role | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 17 2017 7:32 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ప్రతిష్టాత్మక వెయ్యికోట్ల భారీ బడ్జెట్‌ తో తెరకెక్కనున్న మహాభారత్ ను​ చిత్రానికి దర్శకుడు ఖరారయ్యాడు. యూఏఈకి చెందిన వ్యాపారవేత్త గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. భారతదేశంలోనే అతిపెద్ద మోషన్‌ ప్రాజెక్టుగా భావిస్తున్న ఈ సినిమాలో మోహన్‌ లాల్‌ కీలక పాత్రపోషించనున్నారు. ప్రముఖ యాడ్‌ ఫిలిం రూపకర్త వి.ఎ. శ్రీకుమార్‌ మేనన్‌ దర్శకత్వంలో మోహన్‌ లాల్‌ ఎంటీ ప్రాజెక్ట్‌ రూపొందించనుంది. ఈచిత్రంలో కీలకమైన భీముడి పాత్రలో ప్రముఖ మలయాళ నటుడుమోహన్‌ లాల్‌ కనిపించనున్నారు. ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్‌ ఖాతాలో అధికారికంగా ప్రకటించారు. దీంతోపాటు ఒక వీడియోను కూడా రిలీజ్‌ చేశారు. ఈ చిత్రంలో భీమ పాత్రకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని మోహన్‌ లాల్‌ తెలిపారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్య వాదాలు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement