ప్రముఖ వ్యాపారవేత్త, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. దేశంలో సాఫ్ట్‌వేర్ పరిశ్రమ అభివృద్ధికి బాటలు వేసింది ఆయనే. ఆయన తరచూ పలు వేదికలపైన పారిశ్రామిక రంగంలో ప్రస్తుత పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. పలు అంశాల్లో యువతకు మార్గదర్శనం చేస్తుంటారు.
తాజాగా ఓ ఆంగ్ల మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నారాయణమూర్తి అద్భుత కావ్యం మహాభారతంలో తనను అమితంగా ప్రభావితం చేసిన పాత్ర గురించి వివరించారు. అందులోని కర్ణుడి పాత్ర ప్రభావం తనపై ఎక్కువగా ఉందని చెప్పారు. కర్ణుడి దాన గుణం సాటి లేనిదని, ఆ ప్రభావంతోనే తాను పెరిగినట్లు తెలిపారు.
అదే కార్యక్రమంలో మూర్తి మాట్లాడుతూ విద్యార్థి దశలో కరుడుకట్టిన వామపక్షవాదిగా తాను తర్వత వ్యాపారవేత్తగా ఎలా మారాడో.. ఆ సైద్ధాంతిక పరివర్తన గురించి వెల్లడించారు. విఫలమైన తన మొదటి వ్యాపార ప్రయత్నం గురించి తెలిపారు. ఆ సమయంలో కంప్యూటర్లకు మార్కెట్ లేదని, అప్పట్లో భారతదేశంలో చాలా తక్కువ కంప్యూటర్లు ఉండేవని వివరించారు. ఆ తర్వాత ఇన్ఫోసిస్‌ను స్థాపించినప్పుడు మార్కెట్ ఎక్కువగా ఉన్న దేశాలకు ఎగుమతులపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ప్రపంచంలో అతి పెద్ద నివాసం భారత్‌లోనే.. యజమాని ఒకప్పటి క్రికెటర్, రాజకీయ నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment