'మహాభారత'లో నటిస్తా : ప్రభాస్ | Prabhas Responds on Acting in Mohanlal Mahabharata | Sakshi
Sakshi News home page

'మహాభారత'లో నటిస్తా : ప్రభాస్

Published Tue, Apr 25 2017 12:50 PM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM

'మహాభారత'లో నటిస్తా : ప్రభాస్

'మహాభారత'లో నటిస్తా : ప్రభాస్

బాహుబలి 2 ప్రమోషన్ లో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రస్తుతం కేరళలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న ది మహాభారత సినిమాపై స్పందించాడు. 1000 కోట్ల బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న మహాభారతలో కీలకమైన భీముడి పాత్రకు మోహన్ లాల్ కరెక్ట్ చాయిస్ అన్నాడు ప్రభాస్.

అంతేకాదు.. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మరేదైన పాత్రకు తనను సంప్రదిస్తే అందులో నటించేందుకు సిద్ధమే అంటూ ప్రకటించాడు. ఇప్పటికే కృష్ణుడి పాత్రకు మహేష్ బాబును సంప్రదించే ఆలోచనలో ఉన్న మహాభారత టీం.. ప్రభాస్ను ఇతర పాత్రలకు కన్సిడర్ చేస్తారేమో చూడాలి. ప్రభాస్ లీడ్ రోల్ లో తెరకెక్కిన బాహుబలి 2 ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 9000 వేల థియేటర్లలో బాహుబలి 2 రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement