దానికి వేలాడుతూ అరముగ్గిన పండ్లు కనిపించాయి. అప్పటికే వచ్చి చాలాసేపు కావడంతో ఆకలిగా కూడా అనిపించింది. పండ్లు తింటే కాస్త ఆకలి తీరుతుందనుకున్న లిఖితుడు చెట్టు నుంచి పండ్లు కోసి, తినసాగాడు. లిఖితుడు పండ్లు తింటుండగా, బయటకు వెళ్లిన శంఖుడు ఆశ్రమానికి వచ్చాడు. తమ్ముడు పండ్లు తింటుండటం చూసి, ‘ఈ పండ్లు ఎక్కడివి?’ అని అడిగాడు. ‘ఇక్కడివే! అదిగో ఆ చెట్టు నుంచే కోశాను’ అంటూ తాను పండ్లు కోసిన జామచెట్టును చూపించాడు లిఖితుడు. ‘అనుమతి లేకుండా పండ్లు కోయవచ్చునా? అలా చేస్తే, అది దొంగతనం కాదా?’ అని ప్రశ్నించాడు శంఖుడు. అన్న నిలదీయడంతో లిఖితుడు ఖిన్నుడయ్యాడు.
‘నిజమే! ఆకలి వేయడంతో అనుమతి లేకుండానే చెట్టు నుంచి పండ్లు కోసి తిన్నాను. దొంగతనం పాపం. నేను పాపం చేశాను. దీనికి పరిహారం ఏమిటి?’ దుఃఖిస్తూ అడిగాడు లిఖితుడు. ‘రాజు వద్దకు వెళ్లి, దొంగతనానికి తగిన శిక్ష పొందడమే దీనికి పరిహారం. వెంటనే రాజు వద్దకు వెళ్లి, చేసిన నేరాన్ని చెప్పి, అతడు విధించిన శిక్షను అనుభవించు’ అన్నాడు శంఖుడు.
సుద్యుమ్నుడు ఆ ప్రాంతానికి రాజు. అన్న ఆదేశం మేరకు లిఖితుడు సుద్యుమ్నుడి రాజప్రాసాదానికి వెళ్లాడు. మునివేషధారి అయిన లిఖితుడిని నా కోరిక తీరుస్తానని మాట ఇచ్చావు, మంచిది. ఆడిన మాట తప్పడం రాజులకు తగదు. కాబట్టి, నీవు నా కోరిక నెరవేర్చక తప్పదు’ అన్నాడు లిఖితుడు. ‘చెప్పండి మహర్షీ! మాట తప్పను’ అన్నాడు సుద్యుమ్నుడు. ‘నా అన్న అనుమతి లేకుండా, అతడి ఆశ్రమంలో ఉన్న చెట్టు నుంచి పండ్లు కోసుకుని తిన్నాను. యజమాని అనుమతి లేకుండా వస్తువులు తీసుకోవడం దొంగతనం కిందకే వస్తుంది. కాబట్టి నేను చేసిన దొంగతనానికి తగిన శిక్ష విధించు. నువ్వు విధించే శిక్ష ద్వారా పాప పరిహారం పొందుతాను’ అని చెప్పాడు లిఖితుడు. అతడి మాటలకు సుద్యుమ్నుడు నివ్వెరపోయాడు.
‘మహాత్మా! మిమ్మల్ని శిక్షించమని నన్ను నిర్బంధించకండి’ అని బతిమాలుకున్నాడు. లిఖితుడు అతడి మాటలను పట్టించుకోలేదు. పైగా, ‘రాజా! రాజదండన పొందినవాడికి యమదండన తప్పుతుంది. ఆడిన మాట ప్రకారం నన్ను దండిస్తే, నీకు అనృతదోషం అంటకుండా ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని ఆచరించు. నేరం చేసిన నన్ను దండించు’ అని కరాఖండిగా చెప్పాడు. ఇక చేసేది లేక సుద్యుమ్నుడు భటులను ఆజ్ఞాపించి, లిఖితుడి రెండు చేతులనూ నరికేయించాడు.
మొండి చేతులతో లిఖితుడు అన్న వద్దకు వెళ్లి, ‘అన్నా! రాజదండన పొందాను’ అని చెప్పాడు. శంఖుడు సంతోషించాడు. ‘తమ్ముడా! ధర్మాన్ని ఆచరించావు. చేసిన పాపానికి పరిహారం పొందావు. బాహుదా నదికి వెళ్లి, దేవతలకు, మునులకు, మన పితృదేవతలకు తర్పణాలు ఇవ్వు. రాజదండన పొందినవాడికి పాపం నశించి, పుణ్యం ప్రాప్తిస్తుంది. నువ్వు పుణ్యాత్ముడివి. నీకు శుభం కలుగుతుంది’ అని చెప్పాడు.
అన్న చెప్పిన మాట ప్రకారం లిఖితుడు బాహుదా నదికి వెళ్లాడు. నదిలో ఒక్క మునకవేసి, పైకి లేచే సరికి అతడి రెండు చేతులూ మొలిచాయి. దేవతలకు, మునులకు, పితృదేవతలకు తర్పణాలు విడిచి, సంతోషంగా అన్న దగ్గరకు వెళ్లి, తనకు కొత్తగా మొలిచిన చేతులను చూపించాడు. ‘తమ్ముడా! నువ్వు పరిశుద్ధాత్ముడవు. అందుకే పరమాత్మ నిన్ను అనుగ్రహించి, తెగిన చేతులను మళ్లీ ప్రసాదించాడు’ అంటూ తమ్ముడిని మనసారా ఆశీర్వదించాడు శంఖుడు.
∙సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment