Pushpa Kamal Dahal aka Prachanda
-
విశ్వాస పరీక్షలో ఓడిన నేపాల్ ప్రధాని ‘ప్రచండ’
ఖాఠ్మాండూ: నేపాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం పార్లమెంట్లో ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ ఓడిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (CPN-UML) ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో 'ప్రచండ' విశ్వాస తీర్మానాన్ని కోల్పోయారు.275 మంది సభ్యులు కలిగిన పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం నుంచి గట్టేకాలంటే 138 ఓట్ల మెజార్టీ అవసరం. విశాస తీర్మానంలో ప్రచండకు 63 ఓట్లు రాగా. తీర్మానానికి వ్యతిరేకంగా 194 ఓట్లు పడ్డాయి. మాజీ ప్రధాని కేపీ.శర్మ ఓలి నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రస్తుత ప్రభుత్వం కూలిపోయినట్లయ్యింది.కాగా డిసెంబర్ 25, 2022న నేపాల్ ప్రధానిగా ప్రచండ బాధ్యతలు స్వీకరించారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆయన నాలుగు అవిశాస్వ తీర్మానాలను ఎదుర్కొన్నారు. మూడింట్లో గెట్టకగా.. చివరిదైనా నాలుగో దాంట్లో ఓడిపోయారు.అయితే మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని సిపిఎన్-యుఎంఎల్ గత వారం సభలో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్‌తో అధికార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో ప్రచండ నేతృత్వంలోని ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో ఓలీని తదుపరి ప్రధాన ఓలీని తదుపరి ప్రధానమంత్రిగా ఆమోదించారు. ఇక పార్లమెంట్లో నేపాలీ కాంగ్రెస్‌కు 89 సీట్లు ఉండగా, CPN-UMLకి 78 సీట్లు ఉన్నాయి. దిగువ సభలో మెజారిటీకి అవసరమైన 138 కంటే వారి ఉమ్మడి బలం (167) ఎక్కువగా ఉంది. -
నేపాల్ ప్రధానితో మోదీ చర్చలు
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య పరస్పర సహకారంపై నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహాల్ (ప్రచండ)తో భారత ప్రధాని మోదీ శనివారం చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య మైత్రి బంధాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించామని ఆ తర్వాత ప్రధాని మోదీ చెప్పారు. ఈ మేరకు శనివారం ఇద్దరు నేతలు కొంతసేపు ఫోన్లో సంభాíÙంచుకున్నారు. ‘మే 31 నుంచి జూన్ మూడో తేదీ వరకు భారత్‌లో పర్యటించిన నేపాల్ ప్రధాని ప్రచండతో మోదీ పలు ద్వేపాక్షిక అంశాలపై చర్చించారు’ అని ఆ తర్వాత ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదలచేసింది. పొరుగు దేశం నేపాల్‌ను భారత్ చిరకాలంగా మిత్రదేశంగా పరిగణిస్తోంది. -
నోరుజారిన నేపాల్ ప్రధాని.. ఏకి పారేస్తున్న ప్రతిపక్షాలు
ఖాట్మండు: నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహాల్ ఇటీవల భారతీయ వ్యాపారి సర్దార్ ప్రీతమ్ సింగ్ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తాను ప్రధానమంత్రి కావడానికి ఆయన చాలా సహాయం చేశారని చేసిన వ్యాఖ్యలు నేపాల్ లో పెను దుమారాన్ని రేపాయి. నేపాల్ ప్రధాని నియామకం ఢిల్లీ కనుసన్నల్లో జరిగిందని ప్రధాని ప్రచండకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే తన పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశాయి అక్కడి ప్రతిపక్షాలు. ప్రఖ్యాత భారత వ్యాపారి ప్రీతమ్ సింగ్ పేరిట కిరణ్ దీప్ సంధు రాసిన జీవితచరిత్ర పుస్తకం "రోడ్స్ టు ది వ్యాలీ: ది లెగసీ ఆఫ్ సర్దార్ ప్రీతమ్ సింగ్ ఇన్ నేపాల్" ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహాల్ ప్రచండ. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారత్-నేపాల్ సంబంధాలు బలపడటానికి ప్రీతమ్ సింగ్ చాలా సహాయపడ్డారని, తన రాజకీయ జీవితం తొలినాళ్లలో కూడా అయన చాలా సహాయం చేశారని చెప్పుకొచ్చారు. నన్ను ప్రధాన మంత్రిని చేయడానికి ఆయన అనేకమార్లు ఢిల్లీ వెళ్లడమే కాదు అటు ఢిల్లీ నాయకులతోనూ, ఇటు ఖాట్మండు నాయకులతోనూ సంప్రదింపులు జరిపారని తెలిపారు. ఈ వ్యాఖ్యలకు నేపాల్ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. ప్రధాని వ్యాఖ్యలు జాతి స్వాతంత్య్రానికి, గౌరవానికి, రాజ్యాంగానికి, చట్టసభకే అవమానకరమని ప్రతిపక్ష నాయకుడు కెపి శర్మ ఓలి అన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ తోపాటు ఇతర ప్రతిపక్షాలు రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీల నేతలు ప్రధాని ప్రచండ రాజీనామాను డిమాండ్ చేస్తూ బుధవారం జాతీయ అసెంబ్లీ సమావేశాలకు తీవ్ర అంతరాయం కలిగించారు. నేపాల్ ప్రధాని ప్రచండ ప్రతిస్పందిస్తూ నేపాల్ అంతర్గత రాజకీయాల్లో భారత్ పాత్ర ఉందని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు ప్రీతమ్ సింగ్ కు సాంఘిక సంక్షేమం మీదనే కాదు రాజకీయాల పైన కూడా అంతే ఆసక్తి ఉండేదని చెప్పాలనుకున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు మాత్రం మాకు మీ వివరణ అక్కర్లేదు.. మీ రాజీనామా మాత్రమే కావాలని పట్టుబట్టడంతో నేపాల్ జాతీయ అసెంబ్లీ సమావేశానికి నిరవధికంగా అంతరాయం కలిగింది. ఇది కూడా చదవండి: వింబుల్డన్‌లో దారుణం.. స్కూల్లోకి దూసుకెళ్లిన కారు.. -
మాకు సరైన నాయకుడే లేడంటూ 100 ఏళ్ల వ్యక్తి పార్లమెంట్ బరిలోకి
పార్లమెంటరీ ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు నేపాల్‌లోని గుర్ఖా ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు టికా దత్ పోఖారెల్. వయసు 100 ఏళ్లు. నేడు(సోమవారం) వందవ ఒడిలోకి అడుగుపెట్టాడు. దేశ రాజకీయాలపై విసుగుచెంది తాను కూడా పోటీ సిద్ధమయ్యాడు. అది కూడా నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండపై పోటీ చేసి గెలిచి, హిమలయ దేశాన్ని మళ్లీ హిందూ దేశంగా మార్చాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నట్లు పోఖారెల్ తెలిపారు. ఇక్కడ చట్టం, న్యాయం లేదని, కేవలం డబ్బు సంపాదించుకోవడం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారని పోఖారెల్ ఆరోపించారు. సరైన నాయకుడే నేపాల్‌లో లేడని, అందుకే తాను పోటీకి సిద్ధమైనట్లు తెలిపారు. అంతేగాదు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, బాగా నడవడం, మాట్లాడటమే గాకుండా రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉంటారని నేపాలీ కాంగ్రెస్(బీపీ) అధ్యక్షుడు సుశీల్ మాన్ సెర్చన్ తెలిపారు. ఈ మేరకు ఎన్నికల సంఘం కూడా ఆయన పేరును అభ్యర్థిగా నమోదు చేసింది. నవంబరు 20న జరగనున్న నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పెద్ద అభ్యర్థి ఆయనే. అంతేకాదు నేపాల్‌లో ఫెడరల్ పార్లమెంట్‌కి, ప్రావిన్షియల్ అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోఖారెల్ మాట్లాడుతూ....ప్రచండను ఓడించి ఎన్నికల్లో గెలుస్తానని పోఖారెల్ ధీమాగా చెబుతున్నాడు. గుర్ఖా నేలకు తానెంటో తెలుసునని అన్నారు. ఈ దేశ నాయకులు విధానాలు, సూత్రాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయకుండా దోచుకున్నారని చెప్పారు. తాను ప్రజలకు హక్కులను కల్పించడమే కాకుండా మళ్లీ హిందూ దేశంగా మార్చేందుకే తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశానని వివరించారు. 67 ఏళ్ల ప్రచండకు వ్యతిరేకంగా 11 మంది అభ్యర్థుల తోపాటు గుర్ఖా రెండు నియోజకవర్గాల నుంచి తన అభ్యర్థిత్వాన్ని పోఖారెల్ దాఖలు చేసినట్లు సెర్చన్ తెలిపారు. (చదవండి: పుతిన్ ప్లాన్ అట్టర్ ప్లాప్...71 వేల మంది రష్యా సైనికులు మృతి) -
మెజారిటీ కోల్పోయిన ఓలి ప్రభుత్వం
ఖాట్మాండూ: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలికి షాక్ తగిలింది. ఆయన ప్రభుత్వానికి మద్దతిస్తున్న సీపీఎన్ (మావోయిస్ట్ సెంటర్) పార్టీ తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఓలి ప్రతినిధుల సభలో మెజారిటీ కోల్పోయారు. తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు సీపీఎన్ నేత పుష్ఫ కమల్ దహల్ ప్రచండ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పార్లమెంటు సెక్రటేరియట్‌కు సీపీఎన్ పార్టీ లేఖను పంపింది. ఓలి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని, ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు దేశ సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయని, అందుకే మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో 275 మంది సభ్యులున్న సభలో ఓలికి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకొనేందుకు మరో 15 మంది సభ్యుల అవసరం ఉంటుంది. -
పార్టీ పేరులో ‘మావోయిస్టు సెంటర్’ని తొలగించాలి
ఖట్మండూ: దేశంలో మావోయిస్టు భావజాలాన్ని వ్యతిరేకించే, కమ్యూనిస్టు శక్తులు సైతం పార్టీలో చేరేందుకు అనుకూలంగా ఉండేలా పార్టీ పేరులో నుంచి ‘మావోయిస్టు సెంటర్’ అనే పదాన్ని తొలగించాలంటూ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్–మావోయిస్టు సెంటర్ (ఎంసీ) నేపాల్ చీఫ్ పుష్ప కమల్ దహాల్ ‘‘ప్రచండ’’ ప్రతిపాదించినట్లు మీడియా వెల్లడించింది. మాజీ ప్రధాని ప్రచండ దేశంలోని కమ్యూనిస్టు శక్తుల ఐక్యతను ఆకాంక్షించారని, అయితే పార్టీ పేరులో నుంచి మావోయిస్టు పదాన్ని తొలగించడం ద్వారా అది సాధ్యమౌతుందని, అందుకు పార్టీ సిద్ధంగా ఉందని సీపీఎన్–ఎంసీ సభ్యుడు శివకుమార్ మండల్ చెప్పినట్టు హిమాలయన్ టైమ్స్ రిపోర్టు చేసింది. ప్రధాని కెపి.శర్మ ఓలి నేతృత్వంలోని సీపీఎన్–యుఎంఎల్‌తో సీపీఎన్–ఎంసీ విలీనాన్ని ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పేరు మార్పు విషయం చర్చకొచ్చింది. ప్రధాని కేపి.శర్మ ఓలికి కేంద్ర కమిటీలోనూ, పార్లమెంటరీ పార్టీలోనూ పూర్తి మెజారిటీ రావడంతో పార్టీలో ఆయన స్థానం బలోపేతం అయ్యింది. ప్రచండతో చేతులు కలిపిన, సీపీఎన్–యుఎంఎల్ నేపాల్ వర్గంలోని ఇతర కీలక నేతలు మాధవ్ కుమార్ నేపాల్, ఝలనాథ్ ఖానల్‌లు ఓలిని ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందిగా కోరినట్టు రిపోర్టు వెల్లడించింది. 2017 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీచేసి, ఘనవిజయం సాధించిన తరువాత, సీపీఎన్ (యుఎంఎల్), సీపీఎన్ (ఎంసీ)లు కలిసి 2018లో యూనిఫైడ్ నేపాల్‌కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడ్డాయి. 275 మంది సభ్యుల ప్రతినిధుల సభను డిసెంబర్లో రద్దు చేయాలన్న ఓలి నిర్ణయంతో ఎన్సీపీ రెండుగా చీలిపోయింది. అయితే సుప్రీంకోర్టు పార్లమెంటు దిగువ సభను తిరిగి నియమించింది. రెండు పార్టీల విలీనాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన తరువాత తిరిగి తమ పార్టీలను మళ్ళీ విలీనం చేయాలని భావిస్తే, పార్టీకి కొత్త పేరు, ఎన్నికల గుర్తుతో రావాలని నేపాల్ ఎన్నికల కమిషన్ సీపీఎన్(యుఎంల్), సీపీఎన్(ఎంసీ)లను ఆదేశించింది. మార్క్స్, లెనిన్‌ల కమ్యూనిస్టు సిద్ధాంతమే నిజమైన కమ్యూనిజమని విశ్వసించే కమ్యూనిస్టు పార్టీలనేకం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని, ‘‘మావోయిస్టు సెంటర్’’ అనేది వీరి మధ్య ఐక్యతకు విఘాతంగా మారిందని మండల్ పేర్కొన్నారు. మావో చెప్పినట్టుగా ‘తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ అని సీపీఎన్–ఎంసీ తొలుత భావించిందనీ, అయితే 2006లో జరిగిన సమగ్ర శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తరువాత ‘బ్యాలెట్ ద్వారానే రాజకీయాధికారం లభిస్తుంది’ అని విశ్వసిస్తోందని మారిన సీపీఎన్–ఎంసీ విధానాన్ని రాజకీయ విశ్లేషకులు ఉద్దభ్ ప్యాకురేల్ వివరించారు. ఉదారవాద ప్రజాస్వామ్య విలువలు కలిగిన సీపీఎన్–యుఎంఎల్‌తో విలీనం అవడంతో సీపీఎన్–ఎంసీకి మావోయుస్టు ట్యాగ్‌ని తొలగించుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని ప్యాకురేల్ వ్యాఖ్యానించారు. చదవండి: రైతుల నిరసనకు లిల్లి సింగ్ మద్దతు -
భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు.. నేపాల్ ప్రధానికి షాక్
ఖాట్మాండు: భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపాల్ ప్రధానమంత్రి రాజీనామా చేయాలని సొంత పార్టీ నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాలని నేపాల్‌లోని అధికార పక్షమైన కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తోంది. పార్టీ చైర్మన్ పుష్ప కమల్ దహల్ కూడా ప్రధాని తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేయడం నేపాల్ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. తనను పదవి నుంచి తొలగించేందుకు భారత్ కుట్ర చేస్తోందని, కొంతమంది నేపాల్ నాయకులు సైతం ఈ కుట్రలో భాగస్వామ్యలు అయ్యారని ఆదివారం ప్రధాని ఓలీ ఆరోపించారు. (నన్ను గద్దె దింపేందుకు కుట్ర: నేపాల్ ప్రధాని) నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశం మంగళవారం బలువతార్‌లోని ప్రధానమంత్రి నివాసంలో జరిగింది. దీనికి అధికార పార్టీ సభ్యులతో పాటు మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను పదవి నుంచి తప్పించడానికి భారత్ కుట్రలు పన్నుతోందని ప్రధాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, దౌత్యపరంగా సరైనవి కావన్నారు. అనవసరంగా చిరకాల మిత్ర దేశమైన భారత్‌తో విరోధం ప్రధాని వైఫల్యమే అని అసహనం వ్యక్తం చేశారు. అలాగే సొంత పార్టీ నేతలపైన విమర్శలు చేయడం తగదన్నారు. ప్రధాని వ్యాఖ్యలు పొరుగు దేశాలతో నేపాల్ సంబంధాలను దెబ్బతీసేలా ఉన్నాయని హెచ్చరించారు. (చైనాపై మరింత కోపంగా ఉన్నాను: ట్రంప్) పుష్ప కమల్ దహల్, మాధవ్ కుమార్ నేపాల్, జలనాథ్ ఖనల్ వంటి ముఖ్యనేతలు కూడా ప్రధాని చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని లేకుంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమర్థవంతమైన నాయకత్వం అందించడంలో ప్రధాని ఓలీ విఫలమయ్యారని.. పార్టీ పగ్గాలను కూడా సరైన నేతలకు అప్పగించాలని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మొత్తం 18 మంది నాయకులు హాజరవగా 17 మంది రాజీనామాకు పట్టుబట్టినట్టు సమాచారం. అయితే ఈ సమావేశంలో ప్రధాని ఏ విధంగానూ స్పందించకపోవడం గమనార్హం. -
నేపాల్ ఎన్నికల్లో ప్రచండ ఓటమి
నేపాల్‌లో జరిగిన ఎన్నికల్లో మావోయిస్టు నేత పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ ఓడిపోయారు. ఖట్మండ్లోని అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 10వ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. అయితే అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నేపాలీ కాంగ్రెస్ నాయకుడు రాజన్ కె.సి చేతితో ప్రచండ ఓటమి పాలైయ్యారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపివేయాలని యూనిఫైడ్ సీపీఎన్ మావోయిస్టు పార్టీ గురువారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా తప్పుల తడకగా అభివర్ణించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రభుత్వం సరిగ్గా చేపట్టలేదని నేపాల్ యూనిఫైడ్ సీపీఎన్ మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ మూడో స్థానంలో నిలవడం పట్ల ఆ పార్టీ విచారం వ్యక్తం చేసింది.