ఖాఠ్మాండూ: నేపాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం పార్లమెంట్‌లో ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ ఓడిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (CPN-UML) ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో 'ప్రచండ' విశ్వాస తీర్మానాన్ని కోల్పోయారు.
275 మంది సభ్యులు కలిగిన పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం నుంచి గట్టేకాలంటే 138 ఓట్ల మెజార్టీ అవసరం. విశాస తీర్మానంలో ప్రచండకు 63 ఓట్లు రాగా. తీర్మానానికి వ్యతిరేకంగా 194 ఓట్లు పడ్డాయి. మాజీ ప్రధాని కేపీ.శర్మ ఓలి నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రస్తుత ప్రభుత్వం కూలిపోయినట్లయ్యింది.
కాగా డిసెంబర్ 25, 2022న నేపాల్ ప్రధానిగా ప్రచండ బాధ్యతలు స్వీకరించారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆయన నాలుగు అవిశాస్వ తీర్మానాలను ఎదుర్కొన్నారు. మూడింట్లో గెట్టకగా.. చివరిదైనా నాలుగో దాంట్లో ఓడిపోయారు.
అయితే మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని సిపిఎన్-యుఎంఎల్ గత వారం సభలో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్‌తో అధికార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో ప్రచండ నేతృత్వంలోని ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంది.
ఈ క్రమంలో ఓలీని తదుపరి ప్రధాన ఓలీని తదుపరి ప్రధానమంత్రిగా ఆమోదించారు. ఇక పార్లమెంట్‌లో నేపాలీ కాంగ్రెస్‌కు 89 సీట్లు ఉండగా, CPN-UMLకి 78 సీట్లు ఉన్నాయి. దిగువ సభలో మెజారిటీకి అవసరమైన 138 కంటే వారి ఉమ్మడి బలం (167) ఎక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment