vote of confidence
-
విశ్వాస పరీక్షలో షోల్జ్ ఓటమి
బెర్లిన్: జర్మనీ చాన్సెలర్ ఒలాఫ్ షోల్జ్ సోమవారం పార్లమెంట్లో విశ్వాస పరీక్షలో ఓటమి పాలయ్యారు. యూరప్‌లోనే అత్యధిక జనాభా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీలో ఫిబ్రవరిలోనే ముందస్తు ఎన్నికలకు ఈ పరిణామం దారి తీయనుంది. మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం నవంబర్ 6న కుప్పకూలింది. రాజ్యాంగం ప్రకారం సభలో విశ్వాస పరీక్ష చేపట్టాల్సి ఉంటుంది. మొత్తం 733 మంది సభ్యులుండే దిగువ సభ బుండెస్టాగ్‌లో సోమవారం షోల్జ్‌కు అనుకూలంగా 207 మంది ఓటేశారు. దీంతో, ఆయన సభ విశ్వాసం పొందలేకపోయినట్లు ప్రకటించారు. విశ్వాసంలో గెలవాలంటే మరో 367 ఓట్ల అవసరముంది. ఫిబ్రవరి 23వ తేదీన ఎన్నికలు జరపాలని ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఉక్రెయిన్‌కు ఆయుధ, ఆర్థిక సాయమందించేందుకు సిద్ధమని ప్రకటిస్తున్న షోల్జ్ ‘సోషల్ డెమోక్రాట్’పార్టీకి వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు తక్కువని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం యూనియన్ బ్లాక్ ముందంజలో ఉందంటున్నారు. -
విశ్వాస పరీక్షలో ఓడిన నేపాల్ ప్రధాని ‘ప్రచండ’
ఖాఠ్మాండూ: నేపాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం పార్లమెంట్లో ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ ఓడిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (CPN-UML) ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో 'ప్రచండ' విశ్వాస తీర్మానాన్ని కోల్పోయారు.275 మంది సభ్యులు కలిగిన పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం నుంచి గట్టేకాలంటే 138 ఓట్ల మెజార్టీ అవసరం. విశాస తీర్మానంలో ప్రచండకు 63 ఓట్లు రాగా. తీర్మానానికి వ్యతిరేకంగా 194 ఓట్లు పడ్డాయి. మాజీ ప్రధాని కేపీ.శర్మ ఓలి నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రస్తుత ప్రభుత్వం కూలిపోయినట్లయ్యింది.కాగా డిసెంబర్ 25, 2022న నేపాల్ ప్రధానిగా ప్రచండ బాధ్యతలు స్వీకరించారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆయన నాలుగు అవిశాస్వ తీర్మానాలను ఎదుర్కొన్నారు. మూడింట్లో గెట్టకగా.. చివరిదైనా నాలుగో దాంట్లో ఓడిపోయారు.అయితే మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని సిపిఎన్-యుఎంఎల్ గత వారం సభలో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్‌తో అధికార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో ప్రచండ నేతృత్వంలోని ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో ఓలీని తదుపరి ప్రధాన ఓలీని తదుపరి ప్రధానమంత్రిగా ఆమోదించారు. ఇక పార్లమెంట్లో నేపాలీ కాంగ్రెస్‌కు 89 సీట్లు ఉండగా, CPN-UMLకి 78 సీట్లు ఉన్నాయి. దిగువ సభలో మెజారిటీకి అవసరమైన 138 కంటే వారి ఉమ్మడి బలం (167) ఎక్కువగా ఉంది. -
కుప్పకూలిన ప్రభుత్వం: విశ్వాసం కోల్పోయిన ఓలి
ఖాట్మాండు: నేపాల్ ప్రధానమంత్రి కేటీ శర్మ ఓలి పార్లమెంట్ విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రచండ నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ కేపీ శర్మ ఓలి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని ఓలి సోమవారం పార్లమెంట్లో విశ్వాస పరీక్ష కోల్పోయింది. అనుకూలంగా 96 ఓట్లు పడగా.. వ్యతిరేకంగా 124 ఓట్లు వచ్చాయి. 15 మంది ఎంపీలు ఎటువైపు లేరు. ప్రభుత్వానికి కావాల్సిన 136 మంది ఎంపీల మద్దతు లేకపోవడంతో ఓలీ ప్రభుత్వం పడిపోయింది. నేపాల్ పార్లమెంట్లో ప్రస్తుతం 271 మంది ఎంపీలు ఉన్నారు. ఓలి ప్రభుత్వం విశ్వాస పరీక్ష నుంచి గట్టెక్కాలంటే కనీసం136 మంది ఎంపీల మద్దతు అవసర కాగా సీపీఎన్-యూఎంఎల్‌కు 121 మంది సభ్యులు ఉన్నారు. అయితే పుష్పకమల్ దహల్ (ప్రచండ) నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ మద్దతు ఉపసంహరించుకుంది. ఓలి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మరో 15 మంది మద్దతు అవసరం ఉండగా మద్దతు కూడగట్టుకోవడంలో ఓలి విఫలమయ్యారు. దీంతో పార్లమెంట్ విశ్వాసాన్ని కోల్పోయారు. సోమవారం సాయంత్రం జరిగిన చర్చలో ఓలి తాను ప్రధానిగా చేసిన పనులు, సాధించిన విజయాలు.. లక్ష్యాలు తదితర అంశాలు పార్లమెంట్లో వివరించారు. అనంతరం ప్రతిపక్ష పార్టీ నేపాలి కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ చైర్పర్సన్ పుష్పకమల్ దహల్ విశ్వాస పరీక్షపై మాట్లాడారు. ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగించారు. మిగతా జనతా సమాద్‌వాది పార్టీ నాయకులు మహతో ఠాకూర్, ఉపేంద్రయాదవ్ విశ్వాస తీర్మానంపై మాట్లాడారు. విశ్వాసం కోల్పోవడంతో నేపాల్‌లో ప్రభుత్వం కుప్పకూలిపోయింది. చదవండి: ‘మావల్ల కాదు.. మేం పంపలేం’ ప్రధానికి సీఎం లేఖ చదవండి: రాజకీయాల్లో చిచ్చురేపిన అల్లుడి పెళ్లి బరాత్ -
క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటకం
బెంగళూర్ : మలుపులు తిరుగుతున్న కన్నడ రాజకీయాలు ఈనెల 18న క్లైమాక్స్‌కు చేరనున్నాయి. కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సారథి, ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి గురువారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటారని మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్ధరామయ్య నిర్ధారించారు. 18న ఉదయం 11 గంటలకు రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కానుందని చెప్పారు. విశ్వాస పరీక్ష తేదీపై సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య పార్టీలతో పాటు, బీజేపీ అంగీకరించాయి. కాగా, తమ రాజీనామాల ఆమోదంపై స్పీకర్‌కు సూచనలు ఇవ్వాలని రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై మంగళవారం కోర్టు వెలువరించే ఉత్తర్వులు విశ్వాస పరీక్షపై ప్రభావం చూపనున్నాయి. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ఉద్దేశపూర్వకంగా తమ రాజీనామాలను ఆమోదించకుండా జాప్యం వహిస్తున్నారని మరో ఆరుగురు రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కారణంతో పదిమంది కాంగ్రెస్-జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం 16మంది రెబెల్ ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసినట్టయింది. గతంలో పదిమంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లోనే తాజా ఆరుగురు ఎమ్మెల్యేల విజ్ఞప్తినీ కలిపి విచారించాలని వారి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. మొత్తం 16మంది రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ జరిపి.. మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. -
పళని విశ్వాస పరీక్షపై రాష్ట్రపతికి నివేదిక
- ఇప్పటికే పంపిన గవర్నర్ విద్యాసాగర్‌రావు - ‘అసెంబ్లీలో’ ఆరోపణలపై డీఎంకేను ఆధారాలు చూపాలన్న కోర్టు చెన్నై/ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా ఈ నెల 18న అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు నివేదిక పంపారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. తమిళనాడు అసెంబ్లీలో నిబంధనలకు విరుద్ధంగా విశ్వాస పరీక్ష జరిగిందన్న దానిపై వీడియో క్లిప్పింగ్లుగాని, ఇతర ప్రామాణికాలుగాని సమర్పించాలని ప్రతిపక్ష డీఎంకేకు మద్రాస్ హైకోర్టు సూచించింది. విశ్వాస పరీక్షను రద్దు చేయాలంటూ ఈ నెల 20న డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హులువాది జి రమేశ్, జస్టిస్ ఆర్ మాధవన్‌లతో కూడిన ధర్మాసనం డీఎంకే ఆరోపణలపై ఆధారాలను సమర్పిం చాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ప్రజాస్వామ్యం ఖూనీ: స్టాలిన్ తమిళనాడు అసెంబ్లీలో అన్నా డీఎంకే సభ్యులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, విపక్ష నేత స్టాలిన్ విమర్శించారు. అసెంబ్లీ సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలకు నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు జరిపారు. తిరుచ్చి తెన్నూర్ ఉళవర్ సంత మైదానంలో జరిగిన నిరాహార దీక్షలో స్టాలిన్ ప్రసంగిస్తూ.. పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ ధనపాల్ అధికార పార్టీ సభ్యుడిగా మారిపోయారని మండిపడ్డారు. -
'అమ్మ' లక్ష్యం అదే : పన్నీర్ సెల్వం
చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళపై విమర్శలను తీవ్రతరం చేశారు. శశికళపై పన్నీర్ తీవ్రస్థాయిలో బాణాలను ఎక్కుపెట్టారు. శశి కుటుంబాన్ని తమిళ రాజకీయాలకు జయలలిత ఆద్యంతం దూరంగా ఉంచారని చెప్పారు. అమ్మ చివరి నిమిషం వరకు కూడా ఆమెను పార్టీకి దూరం పెట్టారన్న విషయాన్ని ఆయన శుక్రవారం మరోసారి గుర్తుకు చేశారు. శశికళ కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలనే లక్ష్యంతోనే అమ్మ పనిచేశారన్నారు. సభలో బల పరీక్షకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఘాటు వ్యాఖ్యలతో ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. జయలలిత ఆశయాలను కాపాడేందుకు అసెంబ్లీలో పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. బల పరీక్షలో ఆలోచించి ఓటు వేయాలని, ఒత్తిడికి గురై పళని వర్గాన్ని బలపర్చవద్దని కోరారు. ప్రస్తుతం పన్నీర్ వర్గంలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పళనిస్వామి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ డీఎంకే కూడా వ్యూహాత్మాకంగా ముందుకు వెళ్తోంది. శుక్రవారం ఉదయం బల పరీక్షకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. అనూహ్యంగా శుక్రవారం సాయంత్రం డీఎంకే నేతల భేటీ అనంతరం సభకు హాజరుకావాలని నిర్ణయించారు. -
ఆస్పత్రిలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే
మద్దతు ఏ వర్గానికో ? టీనగర్: తమిళనాడులో పొలిటికల్ హిట్ తారాస్థాయికి చేరింది. మరికొద్ది గంటల్లో అసెంబ్లీలో బల పరీక్ష జరుగుతున్న సమయంలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు కూడా ప్రాధాన్యతను సంతరించకుంది. గంధర్వకోట్టై అన్నాడీఎంకే ఎమ్మెల్యే నార్ధామలై ఆర్ముగం అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయన ఏ వర్గానికి మద్దతు తెలుపుతారనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఆర్ముగం కొన్ని నెలలుగా పేగు జారడంతో బాధపడుతూ వచ్చారు. ఈ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కొద్ది రోజుల క్రితం చెన్నై రాజీవ్‌గాం ధీ ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో ఆయనకు హెర్నియా శస్త్రచికిత్స చేశారు. దీంతో ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలావుండగా ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే గృహ నిర్బంధంలో ఉంచినందున ఆర్ముగం కూడా కనిపించడం లేదంటూ కొన్ని రోజుల క్రితం నియోజకవర్గ ప్రజలు ఫిర్యాదు చేశారు. ఇలావుండగా ఆయన త్వరలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన తన మద్దతు ఎడపాడి పళనిస్వామికా? లేదా పన్నీర్ సెల్వంకా? అనేది ప్రకటించనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కనిపించడం లేదు: పోస్టర్‌తో సంచలనం: కృష్ణగిరి జిల్లా, బర్గూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేంద్రన్ కనిపించడం లేదంటూ పోస్టర్లు వెలియడంతో సంచలనం ఏర్పడింది. ఈయన శశికళ వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన ఫిబ్రవరి ఏడవ తేదీ నుంచి కనిపించడం లేదంటూ బర్గూరు నియోజకవర్గంలో అనేక చోట్ల పోస్టర్లు వెలిశాయి. పోస్టర్ చివరిలో ఇట్లు, బర్గూరు నియోజకవర్గ ప్రజలు అని, సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 94432 68844 అంటూ పేర్కొనబడింది. దీంతో ఈ పోస్టర్లు ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించాయి. ఎమ్మెల్యేపై మోసం కేసు: పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే శరవణన్‌పై మోసపు ఫిర్యాదు నమోదైంది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిస్థితిలో ఓ.పన్నీర్ సెల్వంకు 10 ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఇందులో మదురై దక్షిణ నియోజకవర్గం అన్నాడీఎంకే ఎమ్మెల్యే శరవణన్ ఒకరు. శశికళ మద్దతు ఎమ్మెల్యేలు ఉన్న శిబిరం నుంచి మారువేషంలో తప్పించుకుని వచ్చి పన్నీర్ సెల్వం శిబిరంలో చేరిన విషయం తెలిసిందే. మదురై మదిచ్చియం ప్రాంతానికి చెందిన న్యాయవాది జయరాం మదురై పోలీసు కమిషనర్‌కు ఒక ఫిర్యాదు పత్రం అందజేశారు. అందులో మదురై దక్షిణ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు ఎస్ఎస్ శరవణన్ ఎన్నికల సమయంలో ఖర్చుల కోసం తన వద్ద రెండు లక్షల నగదు కోరగా 8 మే, 2016లో అందజేశానని, రెండు నెలల్లో తిరిగి ఇస్తానని హామీ ఇచ్చిన అతను నగదు ఇవ్వకుండా మోసం చేశాడని తెలిపారు. అందువల్ల అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిగురించి ఎమ్మెల్యే శరవణన్ మాట్లాడుతూ ఇది అబద్ధపు ఫిర్యాదని, దీనిని చట్టబద్ధంగా ఎదుర్కొంటానని తెలిపారు. -
తమిళ రాజకీయాల్లో తాజా ట్విస్ట్
చెన్నై: తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. పళనిస్వామి ప్రభుత్వం రేపు అసెంబ్లీలో బలం నిరూపించుకోనున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బలపరీక్షలో పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని విపక్ష డీఎంకే ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రేపు అసెంబ్లీ హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీకి చెందిన 89 ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఎంకే స్టాలిన్ తెలిపారు. బలపరీక్షకు హాజరుకాబోమని ఈ ఉదయం డీఎంకే ప్రకటించింది. ఇప్పుడు నిర్ణయం మార్చుకుంది. డీఎంకే తాజా ప్రకటనపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. డీఎం నిర్ణయం మార్చుకోవడం వెనుక ఏదైనా బలమైన వ్యూహం ఉండే అవకాశముందన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. డీఎం వ్యూహంతో తమిళ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మరోవైపు బలపరీక్షలో పళనిస్వామి ప్రభుత్వాన్ని ఓడించేందుకు పన్నీర్ సెల్వం తన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే శశికళ శిబిరం నుంచి 10 ఎమ్మెల్యేలు ఆయన వైపు రావాల్సి ఉంటుంది.